వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. దీనికోసం ఇంట్లోనే వర్కౌట్స్ చేయొచ్చు. ఇలా ఇంట్లో చేసే ఎక్సర్‌సైజెస్‌కి ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఇతర కష్టాలు అవసరం లేకుండానే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. రోజుకి 15 నిమిషాల నుంచి అరగంటలోపు ఎంత వీలైత అంతగా వర్కౌట్స్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా జిమ్‌కి వెళ్లి fitt గా మారిన body పొందొచ్చు. అలాంటి రిజల్ట్స్‌ని ఇచ్చే వర్కౌట్స్ గురించి తెలుసుకోండి.
లంజెస్
లంజెస్ కూడా కాళ్లు, పిరుదులకి మంచి ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల స్టేబిలిటీ పెరుగుతుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా నిల్చోవాలి. ఓ కాలిని ముందు పెట్టాలి. తర్వాత కిందకి వంగాలి. మరో కాలుతో ఇలానే రిపీట్ చేయండి. ఇలా వీలైనన్నీ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
మౌంటెయిన్ క్లైంబింగ్
మౌంటెయిన్ క్లైంబింగ్ కూడా మంచి కోర్ ఎంగేజ్ చేసే ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల కేలరీలు త్వరగా burn అవుతాయి. దీనికోసం ప్లాంక్ పొజిషన్‌లో ఉండాలి. తర్వాత ఒక్కో కాలుని ముందుకు తీసుకురావాలి. ఓ రకంగా పరుగెత్తినట్లుగా ఉండాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ work out చేయాలి.
బాడీవెయిట్ స్క్వాట్స్
ఈ స్క్వాట్స్ కూడా బాడీని టోన్ చేసే బెస్ట్ వర్కౌట్. దీనిని చేయడం వల్ల తొడలు, బ్యాక్ పార్ట్స్ టోన్ అవుతాయి. ఇవి మజిల్స్‌ని బలంగా చేసి కేలరీలని బర్న్ చేస్తాయి. దీనికోసం కాళ్లని దూరంగా పెట్టి నిలబడాలి. తర్వాత మోకాళ్లని వంచి లోయర్ బాడీని కిందికి వంచుతూ కూర్చున్నట్లుగా వంగి పైకి లేవాలి. ఇది 15 నుంచి 25 times చేయాలి. ఏదైనా బరువు ఉంచి చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
ప్లాంక్స్
ప్లాంక్స్ కూడా లో ఇంపాక్ట్ వర్కౌట్. ఈ ప్లాంక్స్ చేయడం వల్ల కోర్ స్ట్రెంథ్ పెరుగుతుంది. దీని వల్ల పోశ్చర్, body balancing పెరుగుతుంది. దీనికోసం మనం బోర్లా పడుకోవాలి. ఇప్పుడు పాదాలు, మోచేతుల్ని నేలపై ఉంచి వాటి బ్యాలెన్స్‌తో body ని పైకి లేపాలి. ఇదే పొజిషన్‌లో ఉండగలిగేంత సేపు ఉండాలి. మొదట్లో 20, 50 సెకన్లు సరిపోతాయి.
హై నీ మార్చెస్
ఇది కూడా పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. lower body, కోర్ బలం పెరుగుతుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా నిల్చోవాలి. కాళ్లని దూరంగా పెట్టాలి. ఒక్కొక్కటిగా మార్చింగ్ పొజిషన్‌లో పైకి లేవాలి. ఈ work out మీ fitness ప్రకారం speed ని పెంచుకోవాలి.