శరీరా బరువు తగ్గడమనేది కాస్తా కష్టమైన పనే . రుచిలేని ఫుడ్స్ తీసుకుంటారు. దీంతో చాలా మంది మొదట్లో ఇష్టంగా తిన్నా.. రాను రాను బోర్ కొడుతుంది. అందుకే, దీనిని కంటిన్యూ చేయలేరు. కొంతమంది బరువు తగ్గేందుకు ఎలా అయినా తింటుంటారు. కానీ, మరికొంతమంది తినడానికి ఇష్టపడరు. అందు కోసమే, కాస్తా రుచిగా ఉండే ఫుడ్స్‌ని ఎంచుకుంటే ఈ వెయిట్ లాస్ జర్నీని మనం మనం కంటిన్యూ చేయగలం.
అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని మనం రెగ్యులర్‌గా తింటే బోరింగ్ ఉండదు. అయితే, తినేటప్పడు పోర్షన్ కంట్రోల్ అనేది ముఖ్యమని తెలుసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫుడ్స్‌ని ఒకేసారి మొత్తంగా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి. దీంతో ఆకలి వేయదు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. వెయిట్ లాస్ జర్నీ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.కాటేజ్ చీజ్
హోల్ గ్రెయిన్ బ్రెడ్
చీజ్

చీజ్ అది కూడా ఫుల్ ఫ్యాట్ చీజ్ తినడం అలవాటు చేసుకోండి. ఇందులో పోషకాలు ఉంటాయి. దీనికోసం మీరు తీసుకునే ఫుడ్స్‌పై చీజ్ వేయండి. దీనిని తురుములా చేసి తినొచ్చు. ఏదైనా ఫ్రై, చికెన్ వంటివి తిన్నప్పుడు దానిపై చీజ్ ముక్కల్ని వేసి తినండి. దీని వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.
పాప్‌కార్న్

చాలా మంది ఇష్టంగా తినే స్నాక్స్‌లో పాప్‌కార్న్ ఒకటి. ఈ స్నాక్ హెల్దీ. అయితే, మితంగానే తీసుకోవాలి. నేరుగా పాప్‌కార్న్ కాకుండా ప్రోటీన్స్‌తో కలిపి తినండి. దీంతో కడుపు నిండుతుంది. దీనిని ఎంజాయ్ కూడా చేస్తారు. కాబట్టి, రెగ్యులర్‌గా తినండి.
పెరుగు

పెరుగు చాలా హెల్దీ. కానీ, నేడు మార్కెట్లో దొరికే పెరుగులో ఎన్నో పదార్థాలను కలుపుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు. కాబట్టి, ఇందులో పంచదార లేకుండా కేవలం నేచురల్ పెరుగుని తినండి. ఇందులో గ్రనోలా, నట్స్, సీడ్స్, బెర్రీస్ కలపండి. మరింత టేస్టీగా ఉంటుంది. హెల్దీగా కూడా మారుతుంది.
గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
No comments:
Post a Comment