వింటర్ సీజన్‌లో మనకు బత్తాయి పండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మార్కెట్లలో, రోడ్లపై వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయితే, చలికాలంలో బత్తాయి, బత్తాయి జ్యూస్ తీసుకోకూడదని కొందరు చెబుతుంటారు. బత్తాయి జ్యూస్, బత్తాయి తీసుకోవడం వల్ల జలుబుతో పాటు దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే, ఇది సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. సీజనల్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో బత్తాయి జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

బత్తాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను ఇది నివారించడంలో సహాయపడుతుంది. బత్తాయిలో ఉండే పోషకాలు అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అలసటను తగ్గిస్తాయి. నీరసం లేకుండా చేస్తాయి. బత్తాయి పండు తినడం ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. ఆస్థియో, ఆర్థరైటిస్ వంటి సమస్యలు బారినపడకుండా ఉంటారని నిపుణులు తెలిపారు. అయితే బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి బూస్టర్
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం
బరువు తగ్గడం
ఒత్తిడిని తగ్గిస్తుంది
చర్మానికి మేలు
జ్యూస్ ఎప్పుడు, ఎలా తాగాలి?
బత్తాయి జ్యూసుని బయట తాగడం మానేయండి. బత్తాయి జ్యూసుని ఇంట్లోని తయారు చేసుకుని తాగండి. ఫ్రెష్‌గా చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పంచదార బదులు బత్తాయి జ్యూసులో తేనె కలిపి తాగితే మంచిది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే. డైరెక్ట్‌గా తాగితే మంచిదంటున్నారు నిపుణులు. ఇక, బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట లేదా గంట తర్వాత బత్తాయి జ్యూస్ తాగితే బెస్ట్. అయితే, ఎసిడిటీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు వైద్యుణ్ని సంప్రదించి తర్వాత బత్తాయి జ్యూస్ తాగండి.
గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.
No comments:
Post a Comment