CurdHair:helth tips articelshow, hair

పెరుగు..జుట్టుకు ఏం సంబంధం ?..

పెరుగు...తినడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సూచిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు నివారించవచ్చు. పెరుగులో చర్మానికి..జుట్టుకు ప్రయోజనం కలిగించే అనేక అంశాలున్నాయి. మరి అవేంటో చూద్దామా...


*. ఒక చెంచా పెరుగులో అర స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి ముఖానికి పట్టించాలి. కొద్దిసేపటి తరువాత కడుక్కొవాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య నుండి దూరం కావచ్చు.

*. నాలుగు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కొకో పౌడర్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి..మెడకు పట్టించాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

*. అరకప్పు పెరుగు..రెండు మూడు స్పూన్ల మెంతి పొడి కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తీరుతుంది.

*. రెండు నుండి నాలుగు స్పూన్ల పెరుగు లో కొద్దిగా ఓట్స్ తీసుకోవాలి. ఒక చెంచా నిమ్మరసం.. తేనే కలుపుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. అనంతరం ముఖానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలిగిపోతాయి.

*. పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ఫ్ కి పట్టించి.. శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

Dandruff Simple Techniques Helth Tips Articleshow

చుండ్రు..సింపుల్ టెక్నిక్స్..


చుండ్రు...ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఎవో షాంపులు వాడుతూ జుట్టు సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చుండ్రు సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలు..

*. ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెకు 5-10 చుక్కల ట్రీ ఆయిల్ కలపాలి. అనంతరం దీనిని మాడుకు పట్టించాలి.

*. నిమ్మరసం మాడుకు పట్టించి ఒక నిమిషం అనంతరం స్నానం చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకోవాలి.

*. ముందుగా షాంపు.. తక్కువ గాఢతో ఉన్న షాంపూను సెలక్ట్ చేసుకోవాలి. కండీషనర్ రాసుకొనే అలవాటు ఉంటే మాడకు అంటకుండా రాసుకొంటె బెటర్.

*. కొంత వేపాకు తీసుకుని 4-5 కప్పుల వేడి నీటిలో వేయాలి. ఇలా రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోవాలి.

*. వేపాకు పేస్టును తలకు పట్టించినా చుండ్రు సమస్య తగ్గుతుంది.

*. పెరుగును తలకు పట్టించాలి. ఓ గంట పాటు అలాగే ఉండాలి. అనంతరం గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడుక్కోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే మారుతుంది.

Appetite Control, helt tips. Article show

ఆకలి..ఆరోగ్యం..


కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచుతున్నారా ? ఆకలిని నిర్లక్ష్యం చేస్తున్నారా ? వేళకు తినడం లేదా ? వేళ మించాక తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే. కడుపును ఖాళీగా ఉంచడం.. పూర్తి భర్తీ చేసేయడం రెండూ మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు..

*. మరీ ఆకలి పెరిగిపోయే వరకు ఆగకుండి. ఆకలి కాకుండానే తినేయవద్దు. వేళకు తింటూ ఉంటే అదే సమయానికి ఆకలి వేస్తుంది.

*. భోజన సమయంలో వీలైనంత నీళ్లు కూడా తాగవద్దు. భోజనం పూర్తయిన తరువాత నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

*. ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయాలి. భోజనం మంచిగా..రుచిగా ఉందని ఎక్కువగా తినేయడం వల్ల ఇతర అనార్థాలు వచ్చే అవకాశం ఉంది.

*. దోస ముక్కలు, క్యారెట్ ముక్కల వంటి సలాడ్స్ తీసుకోవడం మంచిది. పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలనే తినండి. పాప్కార్న్స్, స్నాక్స్, సాఫ్టింక్స్ లాంటి చిరుతిండ్లకు దూరంగా ఉండండి.

Diabetes check: షుగర్ కు చెక్ పెట్టండిలా..Helth Tips Articleshow

షుగర్ కు చెక్ పెట్టండిలా..


రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.

*. డయాబెటిస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.

*. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో అలియం సాటివం అనే రసాయనం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.

*. పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగాలి. ఓ గంట పాటు వాకింగ్ చేయాలి..

*. బీట్రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తిని తేడా గమనించండి.

*. ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

*. గ్రీన్ టీ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.

Heart Stroke :వడదెబ్బ safety Treatment HelthTips Articleshow

వడదెబ్బ..చికిత్స..జాగ్రత్తలు..
Heat stroke


ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల లాంటి లవణాలు తిరగడం లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని చెమటరూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు. దీనికి చికిత్స చేస్తే సరిపోతుంది. శరీష ఉష్ణోగ్రత తగ్గే విధంగా చూడాలి. మెడ.. ఇతర భాగాల్లో ఐస్ ప్యాక్ లు పెట్టారు. వడ దెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకరావాలి. బట్టలను వదులు చేయాలి. నీటితో శరీరాన్ని తడపాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం. బయటకు వెళ్లిన సందర్భంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

Black Heads:మచ్చలు పోవాలంటే..చిట్కాలు..Helth Tips. Articleshow


మచ్చలు పోవాలంటే..చిట్కాలు..

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన

ఆకులను తీసుకోవాలి. ఇవి ఒక్కోటి వంద గ్రాములుండాలి. అందులో చిటికెడు పసుపు వేసుకుని పొడిగా మిక్సీ చేసుకోవాలి. వాడే సమయంలో రెండు స్పూన్ల పొడికి తగినంత పన్నీరు వేసుకుని కలుపుకుని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అర టీ స్పూన్ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. తులసి ఆకు ఎంతో శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. తులసీ ఆకుల్లో కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.

Summer:ఎండ నుండి ఉపశమనానికి చిట్కాలు..Helth Tips. Articelshow

ఎండ నుండి ఉపశమనానికి చిట్కాలు..

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు వడగాలులు..ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నమోదవుతున్నాయి. జనాలు మరి ఎండాకలం నుండి ఉపశమనం పొందాలంటే..కొన్ని చిట్కాలు..


*. ఉసిరి కాయను ఆహారంలో భాగంగా చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకపోకుండా చూస్తుంది. అంతేగాకుండా విటమిన్ సి అందుతుంది.

*. ప్రతి రోజు పుదీనా ఆకులను ఆహారంలో ఉపయోగించండి. పుదీనాను ఎలాగైనా వాడుకోవచ్చు. చట్నీ.. సలాడ్.. డికాషన్ వేసుకోవచ్చు. తలనొప్పి.. వికారాలు.. ఒత్తిడి..నీరసం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.


*. గుప్పెడు తులసీ ఆకుల రసాన్ని తీసుకోండి. ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా అందుతుంది. రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుండి లభిస్తుంది. ఫలితంగా వికారం.. తలనొప్పి వంటి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

*. గులాబీ రేకులను ఎండబెట్టి.. వాటితో టీ తయారు చేసుకుని తాగాలి. వేడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.