1000 Health Tips: Black Heads:మచ్చలు పోవాలంటే..చిట్కాలు..Helth Tips. Articleshow

Black Heads:మచ్చలు పోవాలంటే..చిట్కాలు..Helth Tips. Articleshow


మచ్చలు పోవాలంటే..చిట్కాలు..

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన

ఆకులను తీసుకోవాలి. ఇవి ఒక్కోటి వంద గ్రాములుండాలి. అందులో చిటికెడు పసుపు వేసుకుని పొడిగా మిక్సీ చేసుకోవాలి. వాడే సమయంలో రెండు స్పూన్ల పొడికి తగినంత పన్నీరు వేసుకుని కలుపుకుని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అర టీ స్పూన్ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. తులసి ఆకు ఎంతో శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. తులసీ ఆకుల్లో కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.