1000 Health Tips: Heart Stroke :వడదెబ్బ safety Treatment HelthTips Articleshow

Heart Stroke :వడదెబ్బ safety Treatment HelthTips Articleshow

వడదెబ్బ..చికిత్స..జాగ్రత్తలు..
Heat stroke


ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల లాంటి లవణాలు తిరగడం లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని చెమటరూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు. దీనికి చికిత్స చేస్తే సరిపోతుంది. శరీష ఉష్ణోగ్రత తగ్గే విధంగా చూడాలి. మెడ.. ఇతర భాగాల్లో ఐస్ ప్యాక్ లు పెట్టారు. వడ దెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకరావాలి. బట్టలను వదులు చేయాలి. నీటితో శరీరాన్ని తడపాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం. బయటకు వెళ్లిన సందర్భంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.