Dandruff Simple Techniques Helth Tips Articleshow

చుండ్రు..సింపుల్ టెక్నిక్స్..


చుండ్రు...ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఎవో షాంపులు వాడుతూ జుట్టు సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చుండ్రు సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలు..

*. ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెకు 5-10 చుక్కల ట్రీ ఆయిల్ కలపాలి. అనంతరం దీనిని మాడుకు పట్టించాలి.

*. నిమ్మరసం మాడుకు పట్టించి ఒక నిమిషం అనంతరం స్నానం చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకోవాలి.

*. ముందుగా షాంపు.. తక్కువ గాఢతో ఉన్న షాంపూను సెలక్ట్ చేసుకోవాలి. కండీషనర్ రాసుకొనే అలవాటు ఉంటే మాడకు అంటకుండా రాసుకొంటె బెటర్.

*. కొంత వేపాకు తీసుకుని 4-5 కప్పుల వేడి నీటిలో వేయాలి. ఇలా రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోవాలి.

*. వేపాకు పేస్టును తలకు పట్టించినా చుండ్రు సమస్య తగ్గుతుంది.

*. పెరుగును తలకు పట్టించాలి. ఓ గంట పాటు అలాగే ఉండాలి. అనంతరం గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడుక్కోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే మారుతుంది.

No comments:

Post a Comment