Cough Remedies Helth Tips Articles

దగ్గు తగ్గడానికి చిట్కాలు..

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 



గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దీనితో తరచూ వైద్యులు దగ్గరకు పరుగెడుతూ వారు ఇచ్చిన మందులను వేసుకుంటుంటారు. తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇంట్లోనో దొరికే వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పావు కప్పు గ్లిజరిన్ లో పావు కప్పు తేనె కలపండి. అందులోనే పావు కప్పు నిమ్మసరం కూడా కలిపేయండి. అన్నింటినీ బాగా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ మోతాదులో రోజంతా తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య త్వరగా తగ్గే అవకాశాలున్నాయి.

Waking daily benefits helth tips articleshow

వాకింగ్.. ఏ సమయంలో..ఎలా చేస్తే మంచిదో తెలుసా..!


మీకాళ్లకు పని చెబితే..అవి మీ హృదయ భారం తగ్గిస్తాయి. చాలా మంది వైద్యులు చెప్పే సలహా ఇది. వాకింగ్ తో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాకింగ్ శరీరానికే కాదు..
మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. మీ గురించి మీరు సమీక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ వాకింగ్ ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఓసారి చూద్దాం.

వాకింగ్ అంటే చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి.. తిని నడవాలా.. పరగడపున నడవాలా.. ఇలాంటివి.. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిది. ఎందుకంటే.. ఉదయం కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది. అలాగని పరగడుపున నడవాల్సిన అవసరం లేదు సుమా..

కాస్త లైట్ గా టిఫిన్ చేసి కూడా మార్నింగ్ వాకింగ్ చేయొచ్చు. మీకు షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు.

నడకలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. రోజుకు 10 వేల అడుగులు నడవడం. కాబట్టి.. ఇది ఎక్కడ నడిచామన్నది ప్రధానం కాదు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. డాబాపైనో.. సెల్లార్ లోనో.. ఎక్కడైనా సరే. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. కాకపోతే ఉదయం నుంచి పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. నడక అంత ఉత్సాహంగా అనిపించదు. ఇక రాత్రి పూట నడక వృద్ధులకు అంత మంచిది కాదు. కంటి చూపు మూలంగా ప్రమాదాలకు గురవచ్చు. ఏదైనా తగిలి కింద పడిపోవచ్చు. అసలే వృద్దాప్యం కారణంగా ఎముకల సమస్యలు కూడా ఉంటాయి.

Munagaaku:మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...helth tips Articleshow

Moringa Powder:ఈ చిట్టి చిట్టి ఆకుల పొడి చిటికెడు తిన్నా చాలు..!



మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది.

ఆ ఆరోగ్యం సరిగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా మన డైట్ లో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహారం ఒకటి ఉంది. అదే మునగాకు. చూడటానికి చిట్టి చిట్టిగా ఉండే ఈ ఆకులు మన ఆరోగ్యంపై మ్యాజిక్ చేస్తాయి. ఈ మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

 
మునగాకులను సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా కొద్దిగా మునగాకు పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రక్తం శుద్ధి చేస్తుంది. చర్మం, జుట్టూ రెండూ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుతస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరకుండా కూడా సహాయపడుతుంది.

 
మునగాకులో పోషకాలు..
మునగాకులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

2 గ్రాముల ప్రోటీన్
విటమిన్ B6 : 19%
విటమిన్ C 12 శాతం
ఐరన్ 11%
రిబోఫ్లావిన్ (B2) : 11%
బీటా-కెరోటిన్ విటమిన్ A:9%
మెగ్నీషియం: 8 శాతం

 
రెగ్యులర్ గా మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త పోటు సమస్య ఉండదు. అంతేకాదు.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల... ఈ మునగాకులో విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఫలితంగా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా, అందంగా కనపడేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మునగాకులోని బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్యాలు , ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో శరీరానికి సహాయపడుతుంది. క్వెర్సెటిన్ , క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ముఖ్యమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

 
మెదడును పదునుపెడుతుంది

మీరు మతిమరుపుకు గురైతే మునగాకు తినండి. మునగాకులో కనిపించే సమ్మేళనాలు అభిజ్ఞా , జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపరుస్తాయి. దీని అధిక ప్రోటీన్, ఐరన్ కంటెంట్ మెదడు ఆక్సిజన్‌ను స్వీకరించడానికి సహాయపడుతుంది, ఇది ఏకాగ్రత, మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది. మునగాకులో కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.



High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?helth tips Articleshow

High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?


Blood Pressure: ప్రతి భారతీయుల ఇంటిలో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఉండే వాటిలో పసుపు ప్రధానమైంది. దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా పసుపును ఉపయోగిస్తుంటాం.
కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రక్తపోటును తగ్గించడంలో కూడా పసుపు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బిపి స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

అధిక రక్తపోటుకు ముఖ్యమైన కారణాల్లో శరీరంలో వాపు పెరగడం ఒకటి. పసుపులోని కర్కుమిన్ రక్తనాళాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడి, బిపి స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. పసుపులోని కర్కుమిన్‌ రక్తనాళాల విస్తరణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక పసుపులోని యాంటీఆక్సిడెంట్లు, రక్తనాళాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. కర్కుమిన్ రక్తనాళాలను విశ్రాంతి తీసుకునేలా చేయడం ద్వారా, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ధమనుల గోడలపై ఒత్తిడిని తగ్గించడంతో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పసుపును టీ లేదా పాలలో కలుపుకుని తీసుకోవడం ద్వారా బీపీ అదుపులో ఉంటుంది. వేడి నీటిలో 1 టీ స్పూన్ పసుపును కలపాలి. అలాగే ఇందులో చిటికెడు నల్ల మిరియాల పొడి, తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా రోజు ఒకసారి మరీ ముఖ్యంగా ఉదయం తీసుకుంటే క్రమంగా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. పాలు పసుపు కలుపుకొని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని గోల్డెన్‌ మిల్క్‌గా చెబుతుంటారు. గోరు వెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగాలి. రోజూ ఉదయం ఇలా తాగితే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

Pumpkin Seeds life style helth tips Articleshow

ప్రతి రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?


గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు వీటిలో అధికంగా ఉంటాయి.

ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి

గుమ్మడి గింజలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కణాలు. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల ఈ వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

కండరాలకు మేలు

గుమ్మడి గింజలు కండరాల రిపేర్ కు కూడా సహాయపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత వీటిని తినడం వల్ల కండరాలు త్వరగా కోలుకుంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

సరైన నిద్ర

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ అనేది సెరోటోనిన్ అనే హార్మోన్ గా మారుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గుమ్మడి గింజలు తింటే మంచి నిద్ర వస్తుంది.

గుండె ఆరోగ్యం

గుమ్మడి గింజలు గుండెకు కూడా చాలా మంచివి. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణక్రియకు సహాయం

గుమ్మడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా తినాలి..?

గుమ్మడి గింజలను పచ్చిగా తినవచ్చు. లేదా ఎండబెట్టి పొడి చేసి సలాడ్లో కలుపుకొని కూడా తినవచ్చు. కొంతమంది వీటిని వేయించి కూడా తింటారు.

ఎంత తినాలి..?

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ వాటిని మితంగానే తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

ఎవరు తినకూడదు..?

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైటీషియన్ ని సంప్రదించిన తర్వాతే గుమ్మడి గింజలు తినాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా గుమ్మడి గింజలు తీసుకోకూడదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Paralysis Treatment: helthy tips. Article show

పక్షవాతానికి చెక్!


పక్షవాతం వస్తే ఎంత నరకమో తెలిసిందే! మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలతో పక్షవాతం రాకుండా చూసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ శరీరానికి సరిపడా మెగ్నీషియం తీసుకుంటే పక్షవాతం దరిచేరదట. අධි ఆషామాషీగా చెప్పింది కాదు. పరిశోధనల్లో వెల్లడయిన విషయం ఇది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటం ద్వారా పక్షవాతం ముప్పు తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియం 100 మి.గ్రా మోతాదు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, బీన్స్, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.

Diabetes helthy tips articleshow

మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...

మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాకరకాయ

షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు.
 రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతి

మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే

దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)

అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్క

గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి es నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు గుర్తిస్తారు. మార్పును

పీచు పదార్థాలు
ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.

బీన్స్

బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.

బార్లీ

బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్లఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

క్యారెట్స్

క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు విషయాన్ని గుర్తించాలి. ఉపకరించేదన్న

తోటకూర

రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.
పాలు

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.

ఓట్ మీల్

ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయంతీసుకుంటుంది.

క్యాబేజీ

క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం నిపుణులు. మంచిదంటున్నారు పోషకాహార

కొద్ది కొద్దిగా ఆహారం

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.

నట్స్

నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

పుచ్చకాయ (వాటర్ మెలాన్)

ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలు

డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. _చక్కెర స్థాయులు తక్కువే.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.

జామ

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

నేరేడుపండ్లు (జామూన్)

ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం.కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

యాపిల్స్

యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.

ఉసిరి

ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం

సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది.
ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.

ఈ వేళల్లో తప్పనిసరిగా....

ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

వేకప్ స్నాక్

రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు.ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.

స్నాక్ (11 గంటల సమయంలో)

యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా
పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.

లంచ్

బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్

టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.

డిన్నర్

మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.