Migrain Head Pain Articleshow

 మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు వల్ల మెదడులో కణతుల వల్ల, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల వస్తుంది.



పార్శ్వపు తలనొప్పికి కారణాలు:

పార్శ్వపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.


డిప్రెషన్, నిద్రలేమి వల్ల వస్తుంది.

కొంతమంది బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.

అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.

స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వసుంది. ఋతుచకం ముందు గాని. తర్వాత గానివచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.

oral contraceptive pills వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది.


మైగ్రేన్ దశలు - లక్షణాలు:

చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుండి 72 గంటలు ఉన్నట్లయితేStatus Migrainosus అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది


ప్రాడ్రోమ్ ఫేస్: ఇది నొప్పికి ముందు 2గం||నుండి 2

రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.


ఆరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల

ముందు ఉంటుంది. దృష్టిలో చూపు కాస్త మందగించినట్లవడం, చూపులోZigzag lines రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవడం, మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉండటం

నొప్పి దశ: ఈ నొప్పి దశ 2గం.ల నుండి 3 రోజుల


వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతు లు ఉంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి వారు సెన్సిటివ్గా ఉంటారు. చాలా


పోస్ట్ డ్రోమ్ ఫేస్: నొప్పి తగ్గిన తర్వాత, కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది.


వ్యాధి నిర్ధారణ:

రక్త పరీక్షలు - CBP, ESR

రక్తపోటును గమనించడం

EEGపరీక్ష

సి.టి. స్కాన్ (మెదడు)

MRI

మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి


మైగ్రేన్ తలనొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...

మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.


అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం, యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా

మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తలకు నూనెతో మసాజ్ చేయించుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి.

తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.


హోమియో వైద్యం:

మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. తలనొప్పి... ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచు తలనొప్పి అధికంగా వస్తే - నేట్రమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నేట్రమ్ మూర్, ట్యుబర్కులినమ్ ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలనొప్పి వస్తే - ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే కాల్కేరియాఫాస్, నేట్రమ మూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి.

Kindy Stones. కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స

 కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తేఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.


కారణాలు: శారీరకశ్రమ తక్కువగా ఉండటం,

తగినన్ని నీళ్లు తాగకపోవడం, కుటుంబచరిత్ర, స్థూలకాయం, మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుంచి ఒకటే కిడ్నీ లేదా చిన్నకిడ్నీలు ఉండటం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడేవారిలోనూ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.



లక్షణాలు: తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి


రావడం, మూత్రం తక్కువపరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.


నివారణ: రోజూ శారీరక వ్యాయాయం, నడక,

నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు.

చికిత్స: హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు.

Movie:Salaar Songs Lyrics

 

  •  Movie:  Salaar

1.     Sooreede

2 .    Vinaraa

Movie: Jai Shree Ram Anthem Song: Jai Shree Ram Anthem

 

  •  Movie:  Jai Shree Ram Anthem
  •  Song:  Jai Shree Ram Anthem


జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం
 నరనరమున శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం
  శివధనుసే ఎత్తి
 విలుతాడు కడుతుంటే
 నీ కండ సత్తువకి
 ఫెళఫెళ విరిగిందే
  కోదండం ఎత్తి నారిని మోగిస్తే
 ఆ హిందు సాగరమే
 భయపడి వణికిందే
  సరదాగా నువ్వే బాణాన్ని వేస్తే
 ఒక దెబ్బకే ఏడు చెట్లే కూలాయే
 ధర్మంగా నువ్వే అస్త్రం సంధిస్తే
 దశకంఠుడే కూలి ఇతిహాసమయ్యే
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం శ్రీరాం
  నిను గన్న పుణ్యం ఈ భారతం
 నీ దారిలోనే తరం తరం
 యుగాలు కదిలి పోతున్నగాని
 శ్రీరామే ఘోషే నిరంతరం
  నీ నామమేలే మా ఆయుధం
 నీ పేరు చెబితే ఓ పూనకం
 ఏ కాలమైనా ఏ నాటికైనా
 దేశాన్ని ఏలును నీ సంతకం
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం
  కనతండ్రి మాట పాటిస్తూ రామా
 రాజ్యాధికారాన్నే వదిలెళ్లినావే
  నువ్విచ్చి మాట సుగ్రీవునికానాడు
 ఒక బాణంతో రాజ్యం గెలిచిచ్చినావే
  మాటంటే మాట ధర్మం నీ బాట
 మా జాతికే నువ్వు చిరునామావంటా
 సర్వం ఓ మిథ్య సత్యం అయోధ్య
 నీ ఆలయం మాకు శ్రీరామరక్ష
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం శ్రీరాం
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం శ్రీరాం

Movie: YeMayaUndo 2024 Song: YeMayaUndo

 

  •  Movie:  Ye Maya Undo
        Song:  Ye Maya Undo


కంటి రెప్పే వెయ్యకుండా
 కొంటె చూపే గుచ్చావే
 కళ్ళనిండా రంగు రంగు
 కలలు రేపావే
  చప్పుడైనా చెయ్యకుండా
 గుండెలోకి వచ్చావే
 గుండెల్లోనా చప్పుడంతా
 నువ్వై పోయావే
  నీలో నీలో
 నేనేమా నిదురించడం
 నాలో నాలో
 నువ్వేననుకోవడం
  ఎంతలా బాగున్నదో
 మనలోనా ఈ సంబరం
 ప్రేమలో పడనోళ్ళకి తెలియదులే
  ఏ మాయ ఉందో ఏ మైకముందో
 ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
 ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  నువ్వంటే ఎంతో ఇష్టం ఇష్టం
 ఎంతంటే తెలుపుట కష్టం
 నువ్వు లేని ఒక్కో నిమిషం
 అయిపోదా ఒక్కో నరకం
  గుండెలో నీ ప్రేమని
 కళ్ళలో చూసానులే
 అందుకే నీ చేతిలో
 ఒదిగి పొయాలే
  నువ్విలా ఓ నావలా
 దారినే చూపావులే
 ఎప్పుడూ నీ నీడలో
 సాగిపోతాలే
  లోకంలో ఎవ్వరి పేరు పేరు
 గురుతైనా రానే రాదూ
 నీ పేరే నీ పేరే
 మరువాలన్నా మరువాలన్నా
 ఆ విషయం గురుతే రాదూ
  ఇంతలో ప్రేమించితే
 మనసులో చోటుంచితే
 జన్మలో నీ చేయిని విడిచిపోనంటా
  నువ్విలా ఏడడుగులే
 కలిసి వేస్తావే ఇటే
 ప్రాణమే నీ తోడుగా
 పంపుతానంటా
  ఏ మాయ ఉందో ఏ మైకముందో
 ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
 ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే

Bottle Gourd :1 గ్లాస్ తాగితే చాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ ,అధిక బరువు, కొలెస్ట్రాల్ అనేవి జీవితంలో ఉండవు


 Bottle Gourd health benefits:1 గ్లాస్ తాగితే చాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ ,అధిక బరువు, కొలెస్ట్రాల్ అనేవి జీవితంలో ఉండవు.. సొరకాయను సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

సొరకాయలో విటమిన్ బి, ఫైబర్, నీరు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో జీవక్రియ రేటును పెంచటంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరు వుండేలా చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.


అంతేకాకుండా ఆకలిని నియంత్రించడంలో చాలా బాగా సహాయ పడటం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన బరువు తగ్గటమే కాకుండా అలసట., నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

సొరకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. నిమ్మరసం, తేనె వంటి వాటిని కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనెను వాడకూడదు. ప్రతిరోజు ఉదయం సమయంలో ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే అధిక బరువు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి పోతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి.


యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒక 15 రోజులు ఈ జ్యూస్ తాగితే తేడా మీరే గమనించి చాలా ఆశ్చర్యపోతారు. సొరకాయ 365 రోజులు మనకి సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగి ఆరోగ్యంగా ఉండండి.


గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Sex స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

 స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?


ఎవరైనా సరే తమకు నచ్చిన వారు పక్కనే ఉంటే ఒకలా ప్రవర్తిస్తారు, నచ్చని వారు పక్కన ఉంటే ఇంకోలా ప్రవర్తిస్తారు. నచ్చని వారు మన పక్కనే ఉంటే మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది.

అయితే స్త్రీలు మాత్రం నచ్చే మగవాడు పక్కనే ఉంటే కొన్ని సంకేతాలను ఇస్తారట. వారి ప్రవర్తనను బట్టి వారు ఆ పురుషున్ని ఇష్ట పడుతున్నారని తెలుసుకోవచ్చట. ఇక ఇష్టమైన మగవారితో స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎక్కువ దృష్టి పెట్టడం…. తరచుగా కళ్ళలోకి చూడటం, మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం. చిరునవ్వులు చిందించడం…. జోకులకు ఎక్కువగా నవ్వడం, సహజంగా లేని సందర్భాల్లో కూడా నవ్వడం. తరచుగా మాట్లాడటానికి ప్రయత్నించడం…. సంభాషణ ప్రారంభించడానికి కారణాలు వెతకడం, మెసేజ్ లు, కాల్స్ ద్వారా తరచుగా సంప్రదించడం. శారీరక స్పర్శ పెంచడం…. భుజం తట్టడం, చేతిని తాకడం వంటి చిన్న స్పర్శలు, దగ్గరగా కూర్చోవడం లేదా నిలబడటం.


శ్రద్ధగా వినడం, ప్రశ్నలు అడగడం…. చెప్పేది ఆసక్తిగా వినడం, వారి అభిప్రాయాలు, అనుభవాల గురించి అడగడం. బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆసక్తి చూపించడం…. శరీరాన్ని తిప్పి ఉంచడం, చేతులు, కాళ్ళు ముడుచుకోకుండా ఓపెన్ పొజిషన్ లో ఉంచడం. కాంప్లిమెంట్లు ఇవ్వడం…. రూపం, తెలివితేటలు, నైపుణ్యాలపై మెచ్చుకోలు, చిన్న విజయాలను గుర్తించి ప్రశంసించడం. సహాయం అడగడం లేక అందించడం….. చిన్న పనుల్లో సహాయం అడగడం, ఏదైనా సహాయం కావాలా అని అడగడం.


సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కావడం…. పోస్ట్ లకు లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఆసక్తికరమైన కంటెంట్ షేర్ చేయడం. ఉమ్మడి ఆసక్తులు కనుగొనడం…. వారి హాబీలు, ఆసక్తుల గురించి తెలుసుకోవడం, ఉమ్మడి కార్యకలాపాలు ప్రతిపాదించడం. అందరి స్త్రీలలో ఈ వ్యక్తీకరణలు ఉండకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా వ్యక్తీకరించవచ్చు. పరస్పర ఆసక్తి, గౌరవం ఉన్నప్పుడే వారి సంబంధాలు బలపడతాయి.