1000 Health Tips

Neck Black Removal. Helth Tips Articelshow



మెడ నల్లగా ఉంటే

చాలా మంది ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. మెడ శుభ్రం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో సమస్య తీవ్రతరమౌతుంది. దీనితో ఇతర మందులు.. బ్యూటీషియన్స్ ను సంప్రదిస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు..

మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది కదా. ఈ మురికి వదిలించుకోవడానికి చాలా సార్లు సబ్బు పెడుతుంటారు. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో బియ్యం పిండి వేసి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయండి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మీ మెడ మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ తో మెడను శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.

మెడ మీద నలుపును నివారించుకోవడం కోసం నిమ్మరసానికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి, దీన్ని మెడచుట్టు అప్లై చేసి 15 నిముషాల తర్వాత స్క్రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

BachPain Treatment Articelshow

వెన్నునొప్పికి పరిష్కారం..

శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం అని పేర్కొన్నవచ్చు. ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ లు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజి బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయావాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్ను ముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. గంటల కొద్ది కంప్యూటర్స్..ఇతర పనులు చేయడం దీనికి కారణమౌతున్నాయి.


వెన్నునొప్పి వస్తే ఆముదాన్ని వేడి చేసి రాసి చూడండి. అలాగే వెల్లుల్లి పాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి చూడండి. కారు.. బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం..పాలు..సమపాళ్లుగా తీసుకుని సేవించాలి. వెన్ను నొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. పిల్లల స్కూలు బ్యాగుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.


బ్యాగులకు పట్టీలు..బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. ఒకే పొజిషన్లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకొనే విధంగా చూసుకోండి.

Knee పెయిన్.మోకాళ్ల నొప్పులు relief Articleshow



మోకాళ్ల నొప్పులు

మోకాళ్ల నొప్పులతో చాలామంది విపరీతంగా బాధపడుతుంటారు. మన శరీరం బరువును మోసే ప్రక్రియలో అత్యంత కీలకమైనది మోకాలు. చాలా ఎక్కువగా దెబ్బలు తగిలే అవకాశం ఉన్న అవయవం కూడా మోకాలే. మనం నిలబడటానికి, కూర్చోవడానికి, పక్కలకు తిరగడానికి, నడవడానికి, పరుగెత్తడానికి ఉపయోగపడే అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్న మోకాళ్లకు నొప్పులు వస్తే, మన శరీరం మొత్తం మూలపడినట్లుగా అవుతుంది. అందుకే మోకాళ్ల నొప్పులను విస్మరించకూడదు.

మోకాళ్లనొప్పి... కారణాలు: మోకాలి జాయింట్

కింద ఉండే ఎముకల్లో పటుత్వం తగ్గడం లేదా అరిగిపోవడం కొన్ని సందర్భాల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ మ్యారో క్యాన్సర్ వంటి జబ్బులు ప్రమాదాల్లో మోకాళ్లకు తీవ్ర గాయాలు కావడం స్థూలకాయం కారణంగా మోకాళ్లపై అదనపు బరువు పడటం వల్ల మోకాలి ఎముకలు త్వరగా అరుగుదలకు గురికావడం ఆధునిక జీవనశైలి వల్ల మోకాళ్లకు తగిన వ్యాయామం లేకపోవడం ఆధునిక జీవనశైలి వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల వినియోగం అధికం కావడంతో ఇటీవల తరచూ గౌట్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా పెరగడం.


పైన పేర్కొన్న కారణాలతో మోకాళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎముక చివరన ఉండే కణాలు ప్రతి 40 రోజులకు ఒకసారి చనిపోయి ఆ ప్రాంతంలో కొత్త కణాలు పుడతాయి. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఉన్నవారిలో జబ్బు ఉన్నచోట కణాలు పుట్టవు. కానీ జబ్బు లేనిచోట కణాలు online casinos పెరుగుతాయి. ఫలితంగా కణాలు అసమానంగా పెరగడం... పెరిగిన చోట కణాలు ఒరిపిడికి గురి కావడం, ఫలితంగా ఒరిపిడి కలిగిన చోట నొప్పి కలగటం జరుగుతుంది.

కీళ్లజబ్బు నిర్ధారణ: ఎక్స్రే, ఎమ్మారై, రక్త, మూత్ర

పరీక్షలు, సీటీ స్కాన్, సైనోవియల్ కల్చర్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

చికిత్స: వైద్య పరీక్షల ద్వారా మోకాలునొప్పికి

అసలు కారణం తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధునిక హోమియో చికిత్స ద్వారా అలాంటి ఆపరేషన్స్ ఏవీ లేకుండానే మంచి చికిత్స అందించవచ్చు. హోమియో మందులు మోకాళ్లలో వ్యాధి లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏర్పడే టాక్సిన్స్ను బయటకు పంపి నొప్పిని తగ్గిస్తాయి. గాయం వల్ల దెబ్బతిన్న బాగాలకు రకసరపరాను పునరుద్దరించి గాయం. త్వరగా మానడానికి ఉపకరిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నిర్ధారణ తొలిదశలోనే జరిగితే దెబ్బతిన్న కార్టిలేజ్ను తిరిగి రూపొందేలా చేయగల అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులకు హోమియోలో రస్టాక్స్, లెడమ్పాల్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక: సోషల్ హెల్త్ టిప్స్ మాత్రమే పూర్తి వివరాలు నిపుణలు అడిగి తెలుసుకోగలరు 

Migrain Head Pain Articleshow

 మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు వల్ల మెదడులో కణతుల వల్ల, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల వస్తుంది.



పార్శ్వపు తలనొప్పికి కారణాలు:

పార్శ్వపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.


డిప్రెషన్, నిద్రలేమి వల్ల వస్తుంది.

కొంతమంది బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.

అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.

స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వసుంది. ఋతుచకం ముందు గాని. తర్వాత గానివచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.

oral contraceptive pills వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది.


మైగ్రేన్ దశలు - లక్షణాలు:

చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుండి 72 గంటలు ఉన్నట్లయితేStatus Migrainosus అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది


ప్రాడ్రోమ్ ఫేస్: ఇది నొప్పికి ముందు 2గం||నుండి 2

రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.


ఆరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల

ముందు ఉంటుంది. దృష్టిలో చూపు కాస్త మందగించినట్లవడం, చూపులోZigzag lines రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవడం, మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉండటం

నొప్పి దశ: ఈ నొప్పి దశ 2గం.ల నుండి 3 రోజుల


వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతు లు ఉంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి వారు సెన్సిటివ్గా ఉంటారు. చాలా


పోస్ట్ డ్రోమ్ ఫేస్: నొప్పి తగ్గిన తర్వాత, కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది.


వ్యాధి నిర్ధారణ:

రక్త పరీక్షలు - CBP, ESR

రక్తపోటును గమనించడం

EEGపరీక్ష

సి.టి. స్కాన్ (మెదడు)

MRI

మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి


మైగ్రేన్ తలనొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...

మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.


అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం, యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా

మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తలకు నూనెతో మసాజ్ చేయించుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి.

తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.


హోమియో వైద్యం:

మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. తలనొప్పి... ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచు తలనొప్పి అధికంగా వస్తే - నేట్రమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నేట్రమ్ మూర్, ట్యుబర్కులినమ్ ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలనొప్పి వస్తే - ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే కాల్కేరియాఫాస్, నేట్రమ మూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి.

Kindy Stones. కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స

 కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తేఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.


కారణాలు: శారీరకశ్రమ తక్కువగా ఉండటం,

తగినన్ని నీళ్లు తాగకపోవడం, కుటుంబచరిత్ర, స్థూలకాయం, మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుంచి ఒకటే కిడ్నీ లేదా చిన్నకిడ్నీలు ఉండటం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడేవారిలోనూ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.



లక్షణాలు: తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి


రావడం, మూత్రం తక్కువపరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.


నివారణ: రోజూ శారీరక వ్యాయాయం, నడక,

నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు.

చికిత్స: హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు.

ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్:Oka Pathakam Prakaaram Review-articleshow

 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్దార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) డ్రగ్స్ బానిస అవుతాడు. తనకు సన్నిహితురాలైన దివ్య (భానుశ్రీ) హత్య కేసులో నిందితుడిగా ఇరుక్కుపోతాడు. దాంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదా నుంచి కోర్టు తొలగిస్తుంది. తాను నిరపరాధిని అని కోర్టులో డిఫెన్స్ లాయర్ చినబాబు (కళాభవన్ మణి)తో పోటీ పడలేకపోతాడు. ఈ పరిస్థితుల్లో డిఫెన్స్ లాయర్ భార్య శ్వేత హత్యకు గురి అవుతుంది. ఆ నేరం కూడా సిద్దార్థ్‌పైనే పడుతుంది. ఇలా సీరియల్ మర్డర్స్‌తో సిద్దార్థ్ లైఫ్ అగమ్యగోచరంగా మారిపోతుంది.



సిద్దార్థ్ డ్రగ్స్‌కు ఎందుకు బానిస అయ్యాడు? తన భార్య సీత (ఆషిమా నర్వాల్)‌కు ఏమైంది? అదృశ్యమైన సీత కోసం సిద్దార్థ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దివ్యను ఎవరు హత్య చేశారు? మర్డర్ కేసులను ఏసీపీ కవిత (శృతి సోది), రఘురామ్ (సముద్రఖని) ఎలా దర్యాప్తు చేశారు. హత్య కేసుల్లో సిద్దార్థ్‌ను పక్కా పథకం ప్రకారం ఇరుకించే ప్రయత్నం చేశారు? చివరకు హంతకుడిని సిద్దార్థ్ పట్టుకొన్నాడా? తాను నిర్దోషినని సిద్దార్థ్ ఎలా నిరూపించుకొన్నాడు? హత్యలకు పాల్పడుతున్న హంతకుడి ఆట ఎలా కట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఒక పథకం ప్రకారం సినిమా కథ.

దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ విషయానికి వస్తే.. మర్డర్ మిస్టరీ పాయింట్ రాసుకొన్న విధానం.. దానిని ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా సన్నివేశాలను డిజైన్ చేసుకొన్న విధానంతో సక్సెస్ సాధించాడు. ఫస్టాఫ్‌లో ఆయన టేకింగ్ విషయంలో కొంత తడబాటు కనిపించినా..సెకండాఫ్‌లో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో స్టోరిని గ్రిప్పింగ్‌గా నేరేట్ చేయడమే కాకుండా సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. సాయిరాం శంకర్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా సిద్దార్థ్ పాత్రను డిజైన్ చేసి ఆయన నుంచి మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్నాడు. కేవలం మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గానే కాకుండా మంచి లవ్ స్టోరీతో, సిద్ శ్రీరామ్‌తో ఫీల్ గుడ్ పాటలతో ఆడియెన్స్ మంచి అనుభూతిని పంచారు.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సాయిరాం శంకర్ యాక్టింగ్ బాగుంది. లాయర్‌గా, భార్యను మిస్ అయి డ్రగ్స్ బానిసైన భర్తగా, మర్డర్ మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటర్‌గా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించారు. సినిమా భారాన్నంత తన భుజాల మీద వేసుకొని పూర్తిగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక సముద్రఖని ఓ పెక్యులర్ డైలాగ్ డెలివరీతో కామెడీ పండిస్తే.. శృతి సోది, కళాభవన్ మణి, ఆషిమా నర్వాల్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

అలాగే సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు కూడా మంచి ఫీల్‌తో తెర మీద కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గోపి సుందర్ సెకండాఫ్‌లో చాలా సీన్లను భారీగా ఎలివేట్ చేశారు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లేకు తగినట్టుగా సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు చక్కటి సహకారం అందించారు. నిర్మాతలు వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్, సహనిర్మాతలు జీను మల్లి, స్వాతి కల్యాణి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు చాలా మంది నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి.

ఒక పథకం ప్రకారం సినిమా గ్రిప్పింగ్‌గా, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సాగే లవ్, ఎమోషనల్ డ్రామా. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్టాఫ్‌లో కొంత నిదానంగా నడిచినప్పటికీ.. సెకండాఫ్ రేసీగా సాగి మంచి అనుభూతిని పంచుతుంది. స్క్రీన్ ప్లేలో ఉండే దమ్ముతోనే కథలో విలన్ గుర్తించడానికి పట్టుకొంటే పదివేలు అనే పోటీని పెట్టడం వారికి సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఒక పథకం ప్రకారం తప్పకుండా నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ పక్కాగా ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. ఈ వారం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చూడాలనుకొనే వారు ఈ సినిమాను థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ మూవీ.


పట్టుదల' మూవీ రివ్యూ - Pattudala Review

 


కథ

అర్జున్ (అజిత్), కయాల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పన్నెండేళ్ల తరువాత వైవాహిక బంధానికి కయాల్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. కయాల్‌కు వివాహేతర సంబంధం ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించిన కయాల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అర్జున్. కానీ కయాల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో కయాల్ తన పుట్టింటికి వెళ్దామని నిశ్చయించుకుంటుంది. కయాల్‌ను తన పుట్టింట్లో దిగబెట్టేందుకు అర్జున్ వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా.. తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని అర్జున్ అంటాడు. ఈ ప్రయాణంలో అర్జున్, కయాల్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? కయాల్‌ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? అసలు కయాల్‌, అర్జున్‌లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఈ ప్రయాణంలో దీపిక (రెజీనా), రక్షిత్ (అర్జున్ సర్జా)ల పాత్ర ఏంటి? చివరకు తన భార్యను కాపాడుకునేందుకు పట్టుదలతో అర్జున్ చేసిన పోరాటాలు, ప్రయత్నాలు ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.