1000 Health Tips

Ragi Mudda: Helth Benfits రాగి ముద్ద ప్రతిరోజు తింటే ఈ ప్రయోజనాలు మీసొంతం..!

 Ragi Mudda: రాగి ముద్ద ప్రతిరోజు తింటే ఈ ప్రయోజనాలు మీసొంతం..!


Ragi Mudda Health Benefits: రాగి ముద్ద అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక సాంప్రదాయకమైన ఆహార పదార్థం.

దీనిని రాగి పిండితో తయారు చేస్తారు. రాగి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగి ముద్దలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా రాగి ముద్ద చాలా మంచిది.


రాగి ముద్దను సాధారణంగా సాంబార్, పప్పు, కూర, చట్నీతో కలిపి తింటారు. ఇది చాలా రుచికరమైన, పోషకమైన ఆహారం. రాగి ముద్దను తయారు చేయడం కూడా చాలా సులభం. కావలసిన పదార్థాలు రాగి పిండి, నీరు. రాగి పిండిని నీటిలో కలిపి ఉడికించి ముద్దలా తయారు చేస్తారు.రాగి ముద్దను తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి కావలసిన అన్ని పోషకాలను అందిస్తుంది, అనేక రోగాల నుంచి కాపాడుతుంది.


డయాబెటిస్‌ ఉన్న వారికి రాగి ముద్ద ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. రాగి ముద్దలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. రాగి ముద్దలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చక్కెరను నెమ్మదిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


రాగి ముద్దలో కాల్షియం, ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా అవసరం. రాగి ముద్దలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచడం డయాబెటిస్ ఉన్నవారికి చాలా ముఖ్యం. రాగి ముద్ద ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగి ముద్దను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.


బరువు తగ్గాలనుకునే వారికి రాగి ముద్ద ఎంతో సహాయపడుతుంది. రాగిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా రాగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రాగి ముద్దలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చాలా మంచిది. రాగి ముద్దను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది, బరువు కూడా తగ్గుతుంది. రాగి ముద్దను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. దీనిని సాంబార్, కూర లేదా చట్నీతో కలిపి తినడం వల్ల రుచిగా ఉంటుంది, పోషకాలు కూడా అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో రాగి ముద్దను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.


Fat Burning: helth tipsకొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?

 Fat Burning: కొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?


వ్యాయామం అనే ప్రక్రియలో వాకింగ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఇది మీ కేలరీలను సునాయాసంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మెటబాలిజం పెంచి, కండరాలను మంచి షేప్ లోకి మారుస్తుంది.

మీ వెయిట్ లాస్ జర్నీలో వాకింగ్ అనేది మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.


వాకింగ్ చేయడంలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. కొందరు ఖాళీ కడుపుతో నడిస్తే, మరికొందరు తిన్న తర్వాత నడుస్తారు. మీరెప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి ఏ సమయంలో వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుందనేది? ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడు వాకింగ్ చేసినా కూడా కేలరీలు ఖర్చవుతాయి. కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏది ఉత్తమమనేది ఓసారి చూసేద్దామా?


ఎవరైనా బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు, ఉపవాసంతో ఉండి నడవటం మంచిది. దీన్ని 'ఉపవాస కార్డియో' అని కూడా పిలుస్తారు. ఒకరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటే, తక్కువగా తిన్న తర్వాత నడవడం వారి రోజువారీ అలవాట్లలో భాగంగా ఉండవచ్చు.


ఉపవాసంతో నడక ఎలా సహాయపడుతుంది..

నడవడం మొదలుపెడితే శరీరం నిల్వ అయిన కొవ్వును శక్తిగా ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. మామూలుగా ఆహారంలో ఉండే గ్లూకోజ్ అందుబాటులో లేకపోవడం వల్ల, కొవ్వును కరిగించుకొని గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే, కాలేయం గ్లైకోజన్ ను గ్లూకోజ్ గా విడదీస్తుంది. ఇది మజిల్స్‌కు శక్తిని అందిస్తుంది. నిద్రలో కూడా కాలేయం గ్లూకోజ్ ను రక్తప్రసరణలో విడుదల చేస్తుంది. అందువల్ల, శరీరంలో గ్లైకోజన్ నిల్వలు ఉదయానికి తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఉపవాస స్థితిలో వ్యాయామం చేసినప్పుడు శరీరం మరింత కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది. ఇలా కొవ్వు కరగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


భోజనం తరువాత నడక

భోజనం తరువాత నడక కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం తరువాత నడిస్తే, ఆహారంతో తీసుకున్న గ్లూకోజ్ ను శరీరం శక్తిగా ఉపయోగిస్తుంది. అందువల్ల, ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ లేదా ఇన్సులిన్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.


ఎంత సేపు నడవాలి?

బరువు తగ్గడంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు, ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాలు నడవండి. మొత్తంగా, బరువు తగ్గేందుకు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా కొనసాగించాలి. మంచి నిద్ర పొందడం, క్యాలరీలను ఖర్చు చేయడం కూడా అవసరం. ఉపవాసంతో ఉన్నప్పటి నడక కొవ్వును ఎక్కువగా కరిగించవచ్చు.


నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


వాకింగ్ చేయాలనుకుంటే, సరైన బూట్లు లేదా పాదరక్షలు ధరించాలి.

నడవడానికి వెళ్లే ముందు పాలు లేదా నీరు వంటి పానీయాలను తీసుకోవడం మంచిది. తద్వారా హైడ్రేట్ గా ఉండగల్గుతారు.

నడవడానికి వెళ్లే ముందు వార్మప్ చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మజిల్స్ లూజ్ అవుతాయి.

నడక వేగాన్ని మితంగా ఉంచుకుని, శ్వాసను నియంత్రణలో ఉంచుకోండి. ఫలితంగా శరీరంపై ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉంటుంది.

Sleeping Tips: రాత్రి పూట ఎడమవైపు పడుకుంటే ఏం జరుగుతుంది? ఇది వింటే ఆశ్చర్యపోతారు!

 


Sleeping Tips: రాత్రి పూట ఎడమవైపు పడుకుంటే ఏం జరుగుతుంది? ఇది వింటే ఆశ్చర్యపోతారు!

ఆరోగ్యకరమైన జీవితానికి (Healthy Life) పౌష్టికరమైన ఆహరంతో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. రాత్రి సమయాల్లో గంటలు గంటలు ఫోన్లు చూస్తూ సరైన నిద్రలేకపోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి.

కనీసం 7-8 గంటల నిద్ర ఉంటేనే రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొంతమంది త్వరగానే నిద్రపోతారు.. కానీ సరిగ్గా నిద్రపట్టదు. దీనికి ప్రధాన కారణం సరైన స్థితిలో నిద్రపోకపోవడమే అని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు ఎడమ వైపు పడుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడమ వైపు పడుకోవడం ద్వారా మంచి నిద్రతో పాటు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎడమ వైపు పడుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఎడమ వైపు ఎందుకు పడుకోవాలి?

హెల్త్లైన్ నివేదిక ప్రకారం.. రాత్రి సమయాల్లో ఎడమ వైపు పడుకోవడం (Sleeping) వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఎడమ వైపు పడుకోవడం ద్వారా తగ్గిపోతుంది. అంతేకాదు కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల ఫుడ్ పైప్ క్లియర్ అవుతుంది.


గురక నుంచి ఉపశమనం

ఎడమ వైపు పడుకోవడం గురక నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ భంగిమలో గాలి వాయునాళం ద్వారా మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. గాలి ప్రవాహానికి ఆటంకం లేనప్పుడు గురక వచ్చే అవకాశాలు తగ్గుతాయి.


మలబద్ధకం

మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి ఎడమ వైపు పడుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా మలబద్ధకం, అపానవాయువు, గుండెల్లో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.


మెరుగైన నిద్ర

అధ్యయనాలు ఎడమ వైపు పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా శ్వాస సమస్యలు లేదా గురక సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.


గుండె సమస్యలు

గుండె సంబంధింత సమస్యలు ఉన్నవారు.. రాత్రి సమయాల్లో ఎడమ వైపు తిరిగి పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు.


జీర్ణక్రియను

ఎడమ వైపు పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ పెరిగి జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే అజీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.


గమనిక:ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.




Vaaraniki yeni sarlu sex cheyali?

 శారీరక సంబంధం: వారానికి ఎన్నిసార్లు సెక్స్ చేయాలి? సమాధానం ఆశ్చర్యకరంగా ఉంది.



ప్రతి వ్యక్తి యొక్క శారీరక, మానసిక మరియు భావోద్వేగ అవసరాలను బట్టి సంభోగం యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రమం తప్పకుండా సెక్స్ చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ దాని అధికం లేదా లోపం కొన్ని దుష్ప్రభావాలకు కారణమవుతుంది.

నిపుణులు ఏమంటున్నారు?


వారానికి 2-4 సార్లు సెక్స్ చేయడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.

అమెరికన్ హెల్త్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం, సమతుల్య లైంగిక జీవితం ఉన్నవారికి మెరుగైన మానసిక మరియు శారీరక ఆరోగ్యం ఉంటుంది.

సెక్స్ యొక్క నాణ్యత దాని ఫ్రీక్వెన్సీ కంటే చాలా ముఖ్యమైనది.


సెక్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలు:


గుండె ఆరోగ్యానికి మేలు: క్రమం తప్పకుండా సెక్స్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.


ఒత్తిడి మరియు నిరాశను తగ్గిస్తుంది: సెక్స్ సమయంలో ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్లు వంటి 'హ్యాపీ హార్మోన్లు' విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పరిశోధన ప్రకారం, వారానికి 1-2 సార్లు సెక్స్ చేసేవారికి మెరుగైన రోగనిరోధక శక్తి ఉంటుంది.


నిద్రను మెరుగుపరుస్తుంది: సెక్స్ తర్వాత, శరీరం విశ్రాంతి తీసుకుంటుంది మరియు గాఢ నిద్రకు సహాయపడుతుంది.


కటి కండరాలను బలపరుస్తుంది: క్రమం తప్పకుండా సంభోగం చేయడం వల్ల కటి మరియు కోర్ కండరాలు బలపడతాయి, ఇది పురుషులు మరియు స్త్రీలలో సంభోగం నాణ్యతను మెరుగుపరుస్తుంది.


జీవితకాలాన్ని పొడిగించడంలో సహాయపడుతుంది: క్రమం తప్పకుండా సెక్స్ చేసే వ్యక్తులు తమ జీవితకాలాన్ని కొన్ని సంవత్సరాలు పొడిగించుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.


చాలా తక్కువ లేదా ఎక్కువ సెక్స్ చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి?


చాలా అరుదుగా సంభోగం (నెలకు ఒకసారి కంటే తక్కువ):


మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

సంబంధంలో అంతరం ఉండవచ్చు.

శరీరం యొక్క సహజ లైంగిక కోరిక తగ్గవచ్చు.

అతిగా సెక్స్ చేయడం (రోజువారీ లేదా రోజుకు అనేక సార్లు):


అలసట మరియు శక్తి కోల్పోయే అవకాశం.

పురుషాంగం మీద మంట, నొప్పి లేదా వాపు ఉండవచ్చు.

హార్మోన్ల అసమతుల్యత సంభవించవచ్చు.

కాబట్టి సరైన మొత్తం ఎంత?


20-30 ఏళ్ల వయస్సు వారు: వారానికి 3-5 సార్లు

30-40 ఏళ్ల వయస్సు వారు: వారానికి 2-4 సార్లు

40-50 ఏళ్ల వయస్సు వారు: వారానికి 1-3 సార్లు

50+ వయస్సు వారు: వారానికి 1-2 సార్లు (శారీరక సామర్థ్యాన్ని బట్టి)


అంతిమంగా, సంభోగం యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతి జంట యొక్క శారీరక మరియు భావోద్వేగ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఆహ్లాదకరమైన, ప్రేమగల మరియు సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని కొనసాగించడమే ప్రధాన ఉద్దేశ్యం.

Heart health : కళ్లల్లో ఈ మార్పు కనిపిస్తే బీ అలర్ట్.. ప్రాణ గండం పొంచి ఉన్నట్టే?

 Heart health : కళ్లల్లో ఈ మార్పు కనిపిస్తే బీ అలర్ట్.. ప్రాణ గండం పొంచి ఉన్నట్టే?



డాన్స్ చేస్తూ వాకింగ్ చేస్తూ కూర్చున్నాచోట్టే 

క్షణాల్లో కుప్పకూలి.. మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతున్నారు..

ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయ్.


ఎందుకలా? అంటే.. ప్రధాన కారణం గుండె పోటు లేదా కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు వైద్య నిపుణులు.


అవును మనిషి బతుక్కి ఇప్పుడు గ్యారెంటీ లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ అనారోగ్యం దాడిచేస్తుందో చెప్పలేం. ఏ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అస్సలు ఊహించలేం. ఇలాంటి పరిస్థితికి అనేక కారణాలున్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి శరీరంలో ప్రతికూల మార్పులకు, గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు దారితీస్తున్నాయి. అయితే చాలా వరకు గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కొన్ని రోజుల ముందు నుంచే శరీరంలో కనిపిస్తుంటాయి. ముందుగానే గుర్తించి అలర్ట్ అయితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే గుండెపోటు రావడానికి నెలరోజుల ముందు మనిషి కళ్లల్లోనూ కొన్ని మార్పులు సంభవిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటంటే..


కలర్ మారుతుంది

మీ కళ్లు ఎప్పటి లెక్క లేకుంటే.. రంగు మారితే అనుమానించాల్సిందే. ఎందుకంటే కనుగుడ్లు నారింజ లేదా పసుపు రంగులోకి మారితే.. ఆ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే.. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పేరుకుపోయిందని అర్థం అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అది రక్త నాళాల్లో అడ్డు పడ్డటంవల్ల బాధితులు ఎప్పుడైనా, ఎక్కడైనా కుప్పకూలి గుండెపోటుకు దారితీసే చాన్స్ ఉంటుంది. అందుకే జర జాగ్రత్త. లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని దావాఖానకు వెళ్లండని సూచిస్తున్నారు నిపుణులు.


కంటి నరాలు ఉబ్బడం

కళ్లల్లో నరాలు ఉబ్బినట్లు కనిపించినా అలర్ట్ అవ్వాలె. అట్లనే రక్త నాళాలు ఎరుపెక్కి ఉబ్బినట్లు ఎక్కువరోజులు ఉంటే కూడా మీ శరీరంలో రక్తపోటు తీవ్రస్థాయికి చేరిందనే సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. అదే టైమ్‌లో తీవ్రమైన అలసట, నీరం వంటివి కనిపిస్తుంటాయి. ఇవి గుండెపోటు వచ్చేకంటే ముందు మనిషి శరీరంలో జరిగే మార్పులే ఇవన్నీ.. కాబట్టి జర పైలం. కళ్లచుట్టూ వాపు కూడా శరీరంలో ద్రవాల సమతుల్యత దారితప్పిందనడానికి సంకేతమేనట.


కంటిలోపలి భాగంలో నొప్పి

ఏ కారణం లేకుండానే కంటి లోపలి భాగంలో మంట లేదా నొప్పి తరచుగా సంభవిస్తుంటే గుండెపోటుకు ముందు వచ్చే సంకేతాలుగా అనుమానించాలంటున్నారు వైద్య నిపుణులు. రక్త నాళాలక్ల బ్లడ్ సప్లయ్ సరిగ్గా లేకపోతే ఇట్లనే జరుగుతుందట. దీంతోపాటు అకారణంగా తలనొప్పి వస్తుండటం తరచుగా జరుగుతున్నా ఆలోచించాల్సిందే. గుండె పనితీరు నెమ్మదించడం, రక్త సరఫరాలో ఆటంకాలు ఇందుకు కారణం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు గుండెపోటుకు దారితీయవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించండి. అయితే పైన పేర్కొన్నది కేవలం కంటికి సంబంధించిన లక్షణాలే.. గుండెపోటు వచ్చే ముందు సంభవించే ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఏ లక్షణాలూ లేకుండానే సైలెంట్‌ హార్ట్ ఎటాక్ వస్తున్న సంఘటనలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు హెల్త్ విషయంలో.. ముఖ్యంగా మీ హార్ట్ విషయంలో కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. 'దిశ' బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Kalabandha Rasam helth benfits

 కలబంద రసం


NIH ప్రకారం, కలబంద రసం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. కలబంద రసం తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలోవెరా జ్యూస్ మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఇంట్లో కూడా కలబంద రసం తయారు చేసుకోవచ్చు. దీని కోసం, కలబంద ఆకుల నుండి గుజ్జును తీసి, బాగా మెత్తగా చేసి, ఒక గ్లాసు నీటితో కలపండి. దీన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


రాత్రిపూట పేగుల్లో చిక్కుకున్న మురికిని బయటకు పంపడంలో సహాయపడే ఆయుర్వేద పానీయాలు

 రాత్రిపూట పేగుల్లో చిక్కుకున్న మురికిని బయటకు పంపడంలో సహాయపడే ఆయుర్వేద పానీయాలు


మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. పేగు ఆరోగ్యం, అంటే జీర్ణవ్యవస్థ బాగా లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి.

సాధారణంగా ఇటువంటి సమస్యలలో గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం, మలబద్ధకం మరియు కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయి.

న్యూఢిల్లీలోని నుబెల్లా మహిళా ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డా. గీతా ష్రాఫ్ ప్రకారం, పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే, రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది, దీనివల్ల మనం ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పేగు ఆరోగ్యం అంటే మన జీర్ణవ్యవస్థ, కడుపు మరియు ప్రేగులు సరిగ్గా పనిచేయడం. దీనికోసం, కొన్ని ఆరోగ్యకరమైన బాక్టీరియల్ ఎంజైములు అవసరం. మన ప్రేగులలోని బ్యాక్టీరియా సమతుల్యత చెదిరిపోతే, కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.


ప్రేగులను శుభ్రపరిచే ప్రత్యేక పానీయాలు

ఉబ్బరం అంటే కడుపులో బరువుగా, వాపుగా లేదా ఉబ్బరంగా అనిపించడం. ఇది సాధారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, నూనె లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం, తక్కువ నీరు త్రాగడం మరియు జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సంభవిస్తుంది. దీన్ని నయం చేయడానికి, మీరు మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక పానీయాలను జోడించాలి, ఇది కడుపును చల్లబరుస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది మరియు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


వాము నీరు

ఆయుర్వేదంలో, వాము నీటిని చాలా ముఖ్యమైన ఔషధంగా వర్ణించారు. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. ఇది కడుపులో ఉబ్బరం మరియు అపానవాయువు సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 


మెంతులు 

ఇక ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది.


నిమ్మకాయ మరియు పుదీనా టీ

పేగు ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి నిమ్మకాయ నీరు ఒక గొప్ప మార్గం. ఇందులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కడుపు సమస్యలను తగ్గిస్తాయి. కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండుకుని, దానికి కొద్దిగా నల్ల ఉప్పు వేసి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.


పుదీనా ఆమ్లత్వం మరియు ఉబ్బరం సమస్యను తొలగించడం ద్వారా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులను మరిగించి, వడకట్టి, రోజుకు రెండుసార్లు త్రాగాలి. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇది మంచి బ్యాక్టీరియాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. పుదీనా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది మరియు అనేక వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.


తేనె మరియు అల్లం నీరు

తేనె తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది మన కడుపులో ఉబ్బరం మరియు వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. మీరు దీన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఈ హెర్బల్ టీ కడుపు సమస్యలను తొలగిస్తుంది మరియు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు తిన్న తర్వాత కూడా దీన్ని తాగవచ్చు.


కలబంద రసం


NIH ప్రకారం, కలబంద రసం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. కలబంద రసం తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలోవెరా జ్యూస్ మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఇంట్లో కూడా కలబంద రసం తయారు చేసుకోవచ్చు. దీని కోసం, కలబంద ఆకుల నుండి గుజ్జును తీసి, బాగా మెత్తగా చేసి, ఒక గ్లాసు నీటితో కలపండి. దీన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


పెరుగు మరియు మజ్జిగ

పెరుగు మరియు మజ్జిగ కడుపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచడం ద్వారా మరియు కడుపులో మంటను తగ్గించడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ప్రతిరోజూ భోజనంతో పాటు ఒక కప్పు పెరుగు తినడం కడుపు ఆరోగ్యానికి మంచిది. పెరుగులో కొద్దిగా నల్ల ఉప్పు లేదా వేయించిన జీలకర్ర కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఓంకాలు, నల్ల ఉప్పు కలిపి మజ్జిగ తాగడం వల్ల జీర్ణ సమస్యలు అన్నీ నయమవుతాయి.