1000 Health Tips

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా చికెన్ ఎక్కువగా తినకూడదు.. ఇలా తింటేనే ఆరోగ్యం సేఫ్

చికెన్.. చాలా మంది ఇష్టంగా తినే ఫుడ్. కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా, చికెన్ సూప్, తందూరి చికెన్ ఇలా రకరకాల పేర్లుతో చికెన్ తింటున్నారు. ఇక, ఆల్కహాల్ తాగేవారు చికెన్‌ను స్టఫ్‌గా తింటున్నారు.

చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఫారం కోళ్లను ఎక్కువగా తింటే అనర్థం తప్పదంటున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు. వారమంతా చికెన్ లాగిస్తే ప్రమాదం. అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు. ఇంతకీ వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.


అధిక కొలెస్ట్రాల్..

ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం చికెన్‌ ఎక్కువగా తింటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు చికెన్ తక్కువ మోతాదులో తింటేనే మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చికెన్ తక్కువ తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

అధిక బరువు..

ప్రతిరోజూ చికెన్‌ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. చికెన్‌లో ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో... శరీరం బర్న్‌ చేయలేని అదనపు ప్రోటీన్ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. అందుకే ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడే వారు చికెన్ ఎక్కువగా తినకూడదు.ఒక స్టడీ ప్రకారం, మనం తీసుకునే డైట్‌కు, బరువు మధ్య సంబంధం ఉంటుంది. శాఖాహారుల కంటే నాన్-వెజ్ తినే వారి శరీర ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది.

హైపర్ టెన్షన్ సమస్యలు..

కుటుంబంలో హైపర్‌టెన్షన్‌ హిస్టరీ ఉంటే.. అలాంటి వారు తినే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతృప్త కొవ్వు, ట్రాన్స్-ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. డైరీ ఉత్పత్తులు, రెడ్‌ మీట్‌, చికెన్‌ స్కిన్‌‌లో ట్రాన్స్‌ - ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు చికెన్ తక్కువ మోతాదులో తినాలి. ఎక్కువ తింటే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది.


మూత్రనాళ ఇన్ఫెక్షన్..

ఈ రోజుల్లో రకరకాల చికెన్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఏ చికెన్ పడితే ఆ చికెన్ తింటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ (UTI) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. MBio, అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చికెన్ ఎక్కువగా తింటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌‌‌‌తో సహా మరికొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే.. తాజా చికెన్‌ కొనడం, చికెన్‌ తక్కువగా తీసుకోవడం చేయాలి. చికెన్‌ను బాగా ఉడికించి తింటే ఈ సమస్యలు రావంటున్నారు.


అధిక యూరిక్ యాసిడ్..

​అధిక యూరిక్ యాసిడ్ స్థాయి ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిన తర్వాత, క్రమంగా ఈ యూరిక్ యాసిడ్ గట్టిపడటం ప్రారంభిస్తుంది. ఈ స్ఫటికాలు (యూరిక్ యాసిడ్ స్ఫటికాలు) చేతి వేళ్లు, కాలి వేళ్లు, వేరే కీళ్లలో పేరుకుపోతాయి. దీంతో.. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడతారు. మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదు. ఇలా చికెన్ ఎక్కువగా తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగే ప్రమాదముంది.

చికెన్ ఎలా తినాలి..

చికెన్ ఎలా పడితే అలా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ ఫ్రై, డీప్ ఫ్రై, చికెన్ పకోడి, చికెన్ బర్గర్లు లాంటి వాటికి దూరంగా ఉండాలి. తాజా చికెన్ కొని వండి తినడం మంచిది. అంతేకాకుండా చికెన్‌ను ఎక్కువగా ఉడికించి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వండి తింటే బెస్ట్. బయట దొరికే చికెన్ ఐటమ్స్‌కి దూరంగా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు.

గమనిక..

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ

ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ తన డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ని యాడ్ చేయడం వల్ల 20 కిలోల బరువు తగ్గానని చెబుతోంది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటారు. కానీ, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ కేవలం 30 శాతమే. కచ్చితంగా బరువు తగ్గాలంటే ఫుడ్ చేంజెస్ చేయాలి. ఈ నేపథ్యంలోనే రిది శర్మ కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

బరువు తగ్గిన రిధి శర్మ..

బంగాళాదుంప, మజ్జిగ..

బంగాళాదుంప తింటే బరువు పెరుగతారని అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని తీసుకునే విధంగా తీసుకుంటే చాలావరకూ బరువు తగ్గుతారు. బంగాళాదుంపల్లో ఎక్కువగా పొటాషియం, ఫైబర్‌లు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇక మజ్జిగ.. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బీన్స్, పప్పులు, జుకిని..

బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. బీన్స్, పప్పులు, జుకిన్ వెజిటేబుల్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జుకిని వెజిటేబుల్ ఇది చూడ్డానికి కీర దోసకాయలా ఉంటుంది. కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేసే బీన్స్, పప్పులు, జుకినీలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. బరువు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తాయి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


కాలీఫ్లవర్, ఆపిల్..

కాలీఫ్లవర్‌లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అదే విధంగా, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ పండ్లని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. బాడీకి పోషకాలు అందుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్‌ని తీసుకుని బరువు తగ్గించుకోగలిగానని రిధి శర్మ చెబుతోంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వీటిని వీలైనంతగా వారి డైట్‌లో చేర్చుకోవాలి. అయితే, ఏ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.


డార్క్ చాక్లెట్, మష్రూమ్స్..

డార్క్ చాక్లెట్స్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిని తినడం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. దీంతో పాటు మష్రూమ్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.

టోఫు, నట్స్..

టోఫు కూడా బరువు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. నట్స్‌లో పోషకాలు, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

గుండెను పదిలంగా ఉంచే ఆహారాలు, ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలో తెలుసా?

 

ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది లైఫ్ స్టైల్(Life Style) మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో గుండె పోటు, అధిక బరువు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి.

ఫైబర్ రిచ్ ఆహారాల్ని డైట్‌లో భాగం చేసుకుంటే చాలా వ్యాధుల్ని కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి, బరువును అదుపులో ఉంచడానికి ఫైబర్ సాయపడుతుంది. రోజూవారి ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ డైట్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంతకీ ఫైబర్ రిచ్ డైట్‌లో ఉండే ఆహారాలేంటి? వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

* బాదం, చియా, అవిసె వంటి గింజలు
* ఓట్స్, బీన్స్
* తృణధాన్యాలు (బార్లీ, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, కొర్రలు, జొన్నలు)
* అవకాడో
* బ్రకోలి, క్యారెట్, బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలు
* బఠానీలు, పాలకూర, చిరుధాన్యాలు
* తాజా పండ్లు, పప్పు ధాన్యాలు

ఫైబర్ రిచ్ డైట్‌తో ప్రయోజనాలు

బరువు తగ్గుతారు

​ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఫైబర్ రిచ్ డైట్ బెస్ట్ ఆప్షన్. ఫైబర్ లేదా పీచు పదార్థం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో.. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. అతిగా తినకుండా కంట్రోల్‌లో ఉండవచ్చు. ఫైబర్‌ శరీరంలోని కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది, బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుంది. దీంతో బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు.


రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి


ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మానవ శరీరం ఫైబర్‌ను గ్రహించుకోలేదు, అలా అనీ విచ్ఛిన్నం చేయలేదు. రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. వైద్యులు సాధారణంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ 22-35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.

గుండెకు మేలు

ఫైబర్ రిచ్ డైట్ గుండెకు మేలు చేస్తుంది. నీటిలో కరగని ఫైబర్ ఆహారాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు ముప్పు కలుగుతుంది. అదే ఫైబర్ రిచ్ డైట్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కరగని ఫైబర్ ఎక్కువగా విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాల్లో లభిస్తుంది. వీటిని డైట్‌లో భాగం చేసుకోండి. రెగ్యులర్‌గా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గుతాయి. మంట, వాపు రాకుండా చూసుకుంటుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

చిక్కుళ్లు, బ్రకోలి, బ్రస్సెల్స్ మొలకలు, తృణధాన్యాల్లో లభించే ఫైబర్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో లభించే ఫైబర్ నీటిలో కరుగుతుంది. నీటిలో కరిగే ఫైబర్ లేదా పీచు పదార్థం చాలా మృదువుగా ఉంటుంది. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో కొలొరెక్టర్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలి?

ఫైబర్ ఎంత తీసుకోవాలన్నది జీర్ణ వ్యవస్థ పరిమాణం బట్టి ఉంటుంది. పెద్దగా ఉంటే ఎక్కువ ఫైబర్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు 50 కిలోల బరువు ఉన్నవారికి 20 నుంచి 25 గ్రాముల ఫైబర్ అవసరం. అదే 75 కిలోల బరువుంటే సుమారు 30 నుంచి 35 గ్రాముల ఫైబర్ కావాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.


గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.


బత్తాయి జ్యూస్ తాగితే బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు, అయితే ఎప్పుడు తాగాలంటే

 వింటర్ సీజన్‌లో మనకు బత్తాయి పండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మార్కెట్లలో, రోడ్లపై వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయితే, చలికాలంలో బత్తాయి, బత్తాయి జ్యూస్ తీసుకోకూడదని కొందరు చెబుతుంటారు. బత్తాయి జ్యూస్, బత్తాయి తీసుకోవడం వల్ల జలుబుతో పాటు దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే, ఇది సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. సీజనల్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో బత్తాయి జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

​బత్తాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను ఇది నివారించడంలో సహాయపడుతుంది. బత్తాయిలో ఉండే పోషకాలు అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అలసటను తగ్గిస్తాయి. నీరసం లేకుండా చేస్తాయి. బత్తాయి పండు తినడం ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. ఆస్థియో, ఆర్థరైటిస్ వంటి సమస్యలు బారినపడకుండా ఉంటారని నిపుణులు తెలిపారు. అయితే బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి బూస్టర్

బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ ఒక గ్లాసు బత్తాయి జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. బత్తాయి జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం

బత్తాయిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి బత్తాయి జ్యూస్ బెస్ట్ ఆప్షన్. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు బత్తాయి జ్యూస్ తాగాలంటున్నారు.

బరువు తగ్గడం

బత్తాయిలో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బత్తాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బత్తాయి జ్యూసుని డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.బత్తాయిలో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బత్తాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బత్తాయి జ్యూసుని డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ వల్ల ఒత్తిడితో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి బత్తాయి జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. బత్తాయి పండులో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. మీరు ఒత్తిడితో బాధపడుతుంటే రోజూ ఒక గ్లాస్ బత్తాయి జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు.

చర్మానికి మేలు

బత్తాయిలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మోసంబి జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. మెటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

జ్యూస్ ఎప్పుడు, ఎలా తాగాలి?


బత్తాయి జ్యూసుని బయట తాగడం మానేయండి. బత్తాయి జ్యూసుని ఇంట్లోని తయారు చేసుకుని తాగండి. ఫ్రెష్‌గా చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పంచదార బదులు బత్తాయి జ్యూసులో తేనె కలిపి తాగితే మంచిది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే. డైరెక్ట్‌గా తాగితే మంచిదంటున్నారు నిపుణులు. ఇక, బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట లేదా గంట తర్వాత బత్తాయి జ్యూస్ తాగితే బెస్ట్. అయితే, ఎసిడిటీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు వైద్యుణ్ని సంప్రదించి తర్వాత బత్తాయి జ్యూస్ తాగండి.

గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

బరువు తగ్గేందుకు రుచిగా తింటూ హెల్దీగా బరువు తగ్గించే ఫుడ్స్, రోజూ తింటే తేడా మీకే తెలుస్తుంది

శరీరా బరువు తగ్గడమనేది కాస్తా కష్టమైన పనే . రుచిలేని ఫుడ్స్ తీసుకుంటారు. దీంతో చాలా మంది మొదట్లో ఇష్టంగా తిన్నా.. రాను రాను  బోర్ కొడుతుంది. అందుకే, దీనిని కంటిన్యూ చేయలేరు. కొంతమంది బరువు తగ్గేందుకు ఎలా అయినా తింటుంటారు. కానీ, మరికొంతమంది తినడానికి ఇష్టపడరు. అందు కోసమే, కాస్తా రుచిగా  ఉండే ఫుడ్స్‌ని ఎంచుకుంటే ఈ వెయిట్‌ లాస్ జర్నీని మనం మనం కంటిన్యూ చేయగలం.

అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని మనం రెగ్యులర్‌గా తింటే బోరింగ్ ఉండదు. అయితే, తినేటప్పడు పోర్షన్ కంట్రోల్ అనేది ముఖ్యమని తెలుసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫుడ్స్‌ని ఒకేసారి మొత్తంగా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి. దీంతో ఆకలి వేయదు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. వెయిట్ లాస్ జర్నీ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

కాటేజ్ చీజ్

ఇది కూడా చాలా టేస్టీగా ఉండే ఫుడ్. దీనిని మీరు ఏ ఫుడ్స్‌తో కలిపి అయినా తీసుకోవచ్చు. దీనిని మసాలా కూరల్లో, లేదా మసాలాలు యాడ్ చేసి ఫ్రై చేసి తినొచ్చు. దీని వల్ల పోషకాలు పెరుగుతాయి. పైగా ఆహారం రుచిగా ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. ఇందులో కేలరీలు కాస్తా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తక్కువ మోతాదులో తినండి.

హోల్ గ్రెయిన్ బ్రెడ్

ఈ బ్రెడ్ తింటే బరువు తగ్గుతారని చెబుతారు. కానీ, దీనిని హెల్దీ వేలో చేసుకుని తినాలి. ముఖ్యంగా, హోల్‌గ్రెయిన్స్‌తో చేసి తీసుకోండి. దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో, ఈవెనింగ్ స్నాక్‌లా తినొచ్చు. దీంతో త్వరగా కడుపు నిండుతుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది టేస్టీగా కూడా ఉంటుంది.

చీజ్

చీజ్ అది కూడా ఫుల్ ఫ్యాట్ చీజ్ తినడం అలవాటు చేసుకోండి. ఇందులో పోషకాలు ఉంటాయి. దీనికోసం మీరు తీసుకునే ఫుడ్స్‌పై చీజ్ వేయండి. దీనిని తురుములా చేసి తినొచ్చు. ఏదైనా ఫ్రై, చికెన్ వంటివి తిన్నప్పుడు దానిపై చీజ్ ముక్కల్ని వేసి తినండి. దీని వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

పాప్‌కార్న్

చాలా మంది ఇష్టంగా తినే స్నాక్స్‌లో పాప్‌కార్న్ ఒకటి. ఈ స్నాక్ హెల్దీ. అయితే, మితంగానే తీసుకోవాలి. నేరుగా పాప్‌కార్న్ కాకుండా ప్రోటీన్స్‌తో కలిపి తినండి. దీంతో కడుపు నిండుతుంది. దీనిని ఎంజాయ్ కూడా చేస్తారు. కాబట్టి, రెగ్యులర్‌గా తినండి.


పెరుగు

పెరుగు చాలా హెల్దీ. కానీ, నేడు మార్కెట్లో దొరికే పెరుగులో ఎన్నో పదార్థాలను కలుపుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు. కాబట్టి, ఇందులో పంచదార లేకుండా కేవలం నేచురల్ పెరుగుని తినండి. ఇందులో గ్రనోలా, నట్స్, సీడ్స్, బెర్రీస్ కలపండి. మరింత టేస్టీగా ఉంటుంది. హెల్దీగా కూడా మారుతుంది.

గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రోజుకి 10 నిమిషాల నుంచి అరగంటలోపు ఎంత వీలైత అంతగా వర్కౌట్స్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా జిమ్‌కి వెళ్లి ఫిట్‌గా మారిన బాడీని పొందొచ్చు. అలాంటి రిజల్ట్స్‌ని ఇచ్చే వర్కౌట్స్ గురించి తెలుసుకోండి.

 వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. దీనికోసం ఇంట్లోనే వర్కౌట్స్ చేయొచ్చు. ఇలా ఇంట్లో చేసే ఎక్సర్‌సైజెస్‌కి ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఇతర కష్టాలు అవసరం లేకుండానే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. రోజుకి 15 నిమిషాల నుంచి అరగంటలోపు ఎంత వీలైత అంతగా వర్కౌట్స్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా జిమ్‌కి వెళ్లి fitt గా మారిన body  పొందొచ్చు. అలాంటి రిజల్ట్స్‌ని ఇచ్చే వర్కౌట్స్ గురించి తెలుసుకోండి.

లంజెస్


లంజెస్ కూడా కాళ్లు, పిరుదులకి మంచి ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల స్టేబిలిటీ పెరుగుతుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా నిల్చోవాలి. ఓ కాలిని ముందు పెట్టాలి. తర్వాత కిందకి వంగాలి. మరో కాలుతో ఇలానే రిపీట్ చేయండి. ఇలా వీలైనన్నీ చేయండి. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

మౌంటెయిన్ క్లైంబింగ్

మౌంటెయిన్ క్లైంబింగ్ కూడా మంచి కోర్ ఎంగేజ్ చేసే ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల కేలరీలు త్వరగా burn అవుతాయి. దీనికోసం ప్లాంక్ పొజిషన్‌లో ఉండాలి. తర్వాత ఒక్కో కాలుని ముందుకు తీసుకురావాలి. ఓ రకంగా పరుగెత్తినట్లుగా ఉండాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ work out చేయాలి.

బాడీవెయిట్ స్క్వాట్స్

ఈ స్క్వాట్స్ కూడా బాడీని టోన్ చేసే బెస్ట్ వర్కౌట్. దీనిని చేయడం వల్ల తొడలు, బ్యాక్ పార్ట్స్ టోన్ అవుతాయి. ఇవి మజిల్స్‌ని బలంగా చేసి కేలరీలని బర్న్ చేస్తాయి. దీనికోసం కాళ్లని దూరంగా పెట్టి నిలబడాలి. తర్వాత మోకాళ్లని వంచి లోయర్ బాడీని కిందికి వంచుతూ కూర్చున్నట్లుగా వంగి పైకి లేవాలి. ఇది 15 నుంచి 25 times చేయాలి. ఏదైనా బరువు ఉంచి చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

ప్లాంక్స్


ప్లాంక్స్ కూడా లో ఇంపాక్ట్ వర్కౌట్. ఈ ప్లాంక్స్ చేయడం వల్ల కోర్ స్ట్రెంథ్ పెరుగుతుంది. దీని వల్ల పోశ్చర్, body balancing పెరుగుతుంది. దీనికోసం మనం బోర్లా పడుకోవాలి. ఇప్పుడు పాదాలు, మోచేతుల్ని నేలపై ఉంచి వాటి బ్యాలెన్స్‌తో body ని పైకి లేపాలి. ఇదే పొజిషన్‌లో ఉండగలిగేంత సేపు ఉండాలి. మొదట్లో 20, 50 సెకన్లు సరిపోతాయి.

హై నీ మార్చెస్

ఇది కూడా పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్. దీనిని చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. lower body, కోర్ బలం పెరుగుతుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా నిల్చోవాలి. కాళ్లని దూరంగా పెట్టాలి. ఒక్కొక్కటిగా మార్చింగ్ పొజిషన్‌లో పైకి లేవాలి. ఈ work out  మీ fitness ప్రకారం speed ని పెంచుకోవాలి.

SwineFlu:వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగర్తలు

 స్వైన్ ఫ్లూ - swine flu


స్వైన్ఫ్లూ వ్యాధిని సంక్రమింపజేసే వైరస్సూ, పందులలోని శ్వాసకోశ వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్కు పోలికలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్వైన్ఫ్లూ అన్నారు.ఇదీ సాధారణ ఫ్లూ లాంటిదే. కాకపోతే ఇది కాస్త తీవ్రమైనది కావడంతో డయాబెటిస్, హైబీపీ, ఆస్తమా, సీఓపీడీ వంటి మరికొన్ని వ్యాధులతో బాధపడుతూ రోగ నిరోధకత తగ్గినవారిలో మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు/ టిష్యూపేపర్ అడ్డుపెట్టుకోవడం, చేతులు అడ్డుపెట్టుకుని తుమ్మడం, దగ్గడం వంటివి చేశాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రాంతాల్లో దగ్గు, తుమ్ములను ఆపుకోవడం, పరిశుభ్రతను పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని చాలా తేలిగ్గా నివారించవచ్చు. వీటిని పాటించకపోతే అది మన స్వయంకృతాపరాధమై అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. అలా స్వైన్ఫ్లూ బారిన పడకుండా ఉండటంతో పాటు దాని గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ కథనం.


ఎందుకీ పేరు... ఏమిటా కథ?


స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా విభాగానికి చెందిన వైరస్లతో వ్యాపించే జలుబు. తొలుత ఈ వైరస్ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశవ్యాధికి కారణమయ్యే ఒక వైరస్లోని జన్యువులతో పోలి ఉంది. అందుకే దీనికి హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అనే పేర్లు పెట్టారు. ఇన్ఫ్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్లలో ఒకటి

జన్యుమార్పులకు లోనైంది. సాధారణంగా వైరస్లు అన్నీ ఇలా తమ జన్యుస్వరూపాలను మార్చుకుంటుంటాయి. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటిజెనిక్ స్వరూపాన్ని మార్చుకొని మనుషుల్లోకి వ్యాప్తిచెందడం వల్ల స్వైన్ ఫ్లూగా పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. ఫ్లూను సంక్రమింపజేసే వైరస్లలో అనేక రకాలు ఉంటాయి. అందులో 'ఇన్ఫ్లుయెంజీ ఏ' 'ఇన్ఫ్లుయెంజా 'బీ', 'ఇన్ఫ్లుయెంజా సీ’ అనేవి ముఖ్యమైనవి. స్వైన్ఫ్లూ వైరస్ అన్నది ఇన్ఫ్లుయెంజా ఏ రకానికి చెందిన వైరస్తో దగ్గరి పోలికలు కలిగి ఉంది. ఈ వైరస్లోని జీన్స్ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన పందుల్లోని వైరస్తోనూ, యూరప్కు చెందిన పందుల్లోని వైరస్లతోనూ, ఆసియా దేశాల్లోని మరికొన్ని పక్షుల్లోని వైరస్లతోనూ, మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుయెంజా వైరస్లలతోనూ... ఇలా నాలుగు రకాల వైరస్లు కలగలసినట్లుగా ఉండటంతో సైంటిస్టులు దీన్ని 'క్వాడ్రాపుల్ రీ అసార్టెంట్’ వైరస్గా పిలుస్తారు. అంటే నాలుగు రకాల వైరస్లు రూపు మార్చుకుని ఏర్పడ్డ కొత్త (మ్యూటెంట్) రూపం అన్నమాట. అందుకే పేరుకు స్వైన్ ఫ్లూ అయినా పందుల వల్ల ఇది సంక్రమించదు. కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యావహారిక భాషలో స్వైన్ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో


'హెచ్1ఎన్1 ఫ్లూ' అని అంటారు.

ఈ సమయంలోనే ఎందుకు?


సాధారణంగా చలికాలం ಜಲುಬು వైరస్లు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువ. అదే కోవకు చెందినది కావడంతో ఈ 'హెచ్1ఎన్1' ఫ్లూ సైతం చలికాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చలికాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఈ చలికాలంలో మనదేశాన్ని గడగడలాడిస్తోంది. చలి వాతావరణం దీనికి అనుకూలం (హై విరులెంట్) కావడంతో ఇది ఈ సీజన్లో విస్తృతంగా వ్యాపిస్తోంది.


ఎలా వ్యాపిస్తుంది...?


ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఫ్లూ. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించిన ఈ వైరస్... ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చేరితే అతడూ ఈ వ్యాధి బారిన పడతాడు. ఒక్కోసారి వ్యాధిగ్రస్తుల ముక్కు స్రావాలు తమ చేతికి అంటిన వారు... అదే చేత్తో తలుపు గొళ్లెం తాకి వెళ్లాక... దాన్ని మరొకరు తాకితే... వారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ దాదాపు 2 -8 గంటల వరకు జీవించి ఉండి, వ్యాధిని వ్యాప్తి చేసేంత క్రియాశీలంగా ఉంటుంది. ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద పడి, అక్కడ ఆరోగ్యవంతులెవరైనా చేతులు పెట్టి... వాటిని తమ ముక్కు, కళ్లు, నోటికి అంటించుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తుమ్మే సమయంలో వ్యాధిగ్రస్తులు తమ చేతులు అడ్డుపెట్టుకుని, ఆ తర్వాత అదే చేత్తో వేరేవారికి

షేక్ హ్యాండ్ ఇస్తే... వైరస్ ఆరోగ్యవంతునికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు లిఫ్ట్ వంటి క్లోజ్ ప్రదేశాల్లోనూ, క్రౌడెడ్ ప్రదేశాల్లో ఉన్నప్పుడూ, పబ్లిక్ ప్లేసెస్లో ఒకే బాత్రూమ్ తలుపును, కొళాయినాబ్ను వ్యాధిగ్రస్తులు తాకిన తర్వాత... ఆరోగ్యవంతులు అదే తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్ను తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది.


నిర్ధారణ...


అది సాధారణ ఫ్లూనా లేక స్వైన్ఫ్లూ (హెచ్1ఎన్1)నా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి రోగి గొంతు నుంచి, ముక్కు నుంచి స్రావాలను సేకరించి, వాటిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కు పంపుతారు, అక్కడ పీసీఆర్ అనే పరీక్ష నిర్వహించి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అయితే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండానే లక్షణాలను బట్టే చికిత్స ప్రారంభిస్తారు. పరీక్షలో అది స్వైన్ఫ్లూ అని నిర్ధారణ అయితే వ్యాధి ఏ దేశంలో వ్యాపించినా, చికిత్సను అందించడానికి అంతర్జాతీయ సంస్థలు తమ వైద్యబృందాలతో ముందుకు వస్తాయి.


లక్షణాలివే...


సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే ఈ వ్యాధిలోనూ కనిపిస్తాయి. అంటే... జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు-ముక్కు ఎర్రబారడం. కడుపులో నొప్పి... లాంటిలక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపించినప్పుడు వైద్యులు దాన్ని స్వైన్ఫ్లూగా అనుమానిస్తారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల్లో, పెద్దల్లో కనిపించే లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. అవి... పిల్లల్లో... వేగంగా శ్వాసతీసుకోవడం, శ్వాసప్రక్రియలో ఇబ్బంది. కొందరిలో చర్మం నీలం రంగుకు మారడం. ఎక్కువగా నీళ్లు గానీ, ద్రవపదార్థాలుగానీ తాగకపోవడం.


► త్వరగా నిద్రలేవలేకపోవడం... ఎదుటివారితో సరిగా సంభాషించకపోవడం.


- కోపం, చిరాకు వంటి భావోద్వేగాలకు త్వరగా గురికావడం.


ఫ్లూ వల్ల వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం.


కొందరిలో జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు (ర్యాష్) కనిపించడం.


పెద్దల్లో... శ్వాసకియలో ఇబ్బంది, విపరీతమైన ఆయాసం. ఛాతీలోపల లేదా పొట్టలో నొక్కేస్తున్నట్లుగా నొప్పిరావడం. అకస్మాత్తుగా నీరసపడిపోవడం అయోమయం ఒక్కోసారి ఆగకుండా అదేపనిగా వాంతులు ఫ్లూ కారణంగా వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడం.

హైరిస్క్ వ్యక్తులు...


65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. ఇక డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్జెక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్న టీనేజర్స్, హెచ్ఐవీ వంటి వ్యాధులుండేవారు హైరిస్క్ గ్రూప్కి చెందినవారు.


వీరికి వచ్చే ఇతర వ్యాధులు...


స్వైన్ఫ్లూ వ్యాధిగ్రస్తులకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటివాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ-రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికిగానీ స్వైన్ ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

నివారణ ఇలా...


ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నందున చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. పైగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే గుణమున్న ఈ వైరస్తో వ్యవహరించడం అన్నది అటు రోగుల తోటివారికీ, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికీ రిస్క్ కాబట్టి నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మేలు.


► దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతి రుమాలు అందుబాటులో లేకపోతే... పొడవు చేతుల చొక్కా వేసుకొని, దాని మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయడం వల్ల వైరస్ అక్కడికే పరిమితమవుతుంది.


> ఒకవేళ ఖాళీ చేతులు అడ్డు పెట్టుకొని దగ్గడమో, తుమ్మడమో చేస్తే ఆ తర్వాత ఆ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు రుద్దుతూ కడుక్కోవాలి.


►ఒకవేళ రుద్ది కడుక్కునేందుకు సబ్బు లేదా నీరు అందుబాటులో లేకపోతే... ఆల్కహాల్ బేస్డ్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ రబ్తో చేతులను శుభ్రంగా రుద్దుకోవాలి.


- దగ్గు, తుమ్ము సమయంలో రుమాలును లేదా టిష్యూ పేపర్ను ఉపయోగించవచ్చు. అయితే ఆ రుమాలునుగానీ/టిష్యూ పేపర్నుగానీ వేరొకరు ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఎవరూ అంటుకోని ప్రదేశంలో దాన్ని పడేయాలి.

జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండటం మంచిది. ಜಲುಬು లక్షణాలు కనిపించినా... అది తగ్గేవరకు పదిమంది మసిలే ప్రదేశాలకూ, ఆఫీసుకు వెళ్లడం సరికాదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.


పరిసరాల పరిశుభ్రతతో నివారణ సులభం


మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మిగతా వ్యాధులతో పాటు స్వైన్ఫ్లూ నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఉదాహరణకు... మనం పనిచేసే డెస్క్, టేబుల్ ఉపరితలాన్ని, మన ఇంటి గచ్చును, కిచెన్, బాత్రూమ్ గచ్చులను క్లోరిన్, ఆల్కహాల్స్, పెరాక్సిజెన్, డిటెర్జెంట్స్, అయిడోఫార్స్, క్వాటెర్నరీ అమోనియం, ఫీనాలిక్ కాంపౌండ్స్ వంటి డిస్-ఇన్ఫెక్టెంట్లతో శుభ్రపరచుకోవాలి.


అందుబాటులో వ్యాక్సిన్...


మునుపు ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వ్యాక్సిన్ లేదు. కానీ తదుపరి పరిశోధనలతో స్వైన్ఫ్లూ వ్యాక్సిన్ రూపొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్వైన్ ఫ్లూ వచ్చేందుకు ఆస్కారం ఉన్న హైరిస్క్ గ్రూపునకు చెందిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని - సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యూనైజేషన్ ప్రాక్టిసెస్ (ఏసీఐపీ) వంటి సంస్థలు సిఫార్సు చేసున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్డీఏ) సిఫార్సుల మేరకు పదేళ్లు దాటిన వారంతా ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చు. 6 నెలల నుంచి తొమ్మిదేళ్ల వయసున్న వారు రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలన్నది ఎఫీఏ సిఫార్సు.


ఫ్లూకు సంబంధించిన లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్ఫ్లూగా అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీవైరల్ మందులు, ఇందుకోసం ఉద్దేశించిన ఒసెల్టామివిర్ (టామీఫ్లూ) లేదా జనామివిర్ అనే మందు ఉపయోగించడం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణరహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల అంత ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ విచక్షణతో ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆసుపత్రిలో చేరిన వారికీ, ఒకవేళ మందులు ఇవ్వకపోతే పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే డాక్టర్లు ఆ మందులను ఇస్తారు. అలాంటి అవసరం ఉన్నవారికి ఒసెల్టామివిర్ (టామిఫ్లూ), జనామివిర్ లాంటి మందులను కాప్సూల్స్ రూపంలో 5 రోజుల కోర్సుగా ఇస్తారు. పిల్లలకు ఇదే మందును చాక్లెట్సిరప్తో కలిపి ఇస్తారు. ఇక కొందరిలోరెలెంజా వంటి పీల్చే యాంటీవైరల్ మందునూ ఇస్తారు. అయితే శ్వాససంబంధిత వ్యాధులు ఉన్నవారికి, గుండెజబ్బులు ఉన్నవారికి మాత్రం ఈ రెలెంజా వంటి పీల్చే మందులను ఇవ్వరు. ఎందుకంటే... అలాంటి వారికి పీల్చే మందు అయిన రెలెంజా ఇచ్చినప్పుడు మగతగా ఉండటం, ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్లలో ఇన్ఫెక్షన్స్ రావడం (సైనుసైటిస్), ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ వేయడం, దగ్గురావడం, కొందరిలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి సైడ్ఫక్ట్స్ కనిపించవచ్చు.


గర్భిణులకు చికిత్స...


వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భిణులకూ యాంటీరిట్రోవైరల్ మందులు ఇస్తారు. దీనివల్ల కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డపై దుష్ప్రభావాలు కలిగినట్లు ఎలాంటి దాఖలాలూ లేవు.అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా లేకుండా, ఇంటిదగ్గరే వైద్యచికిత్స తీసుకుంటున్నవారు మాత్రం సాధారణ యాంటీబయాటికన్ను వాడుకోవచ్చు. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉన్న కొంతమందికి వైరస్ సోకినప్పటికీ... కొద్దిపాటి లక్షణాలు కనిపించి, ఎలాంటి మందులు వాడకపోయినా అది తగ్గిపోయే అవకాశమూ ఉంది.


కాబట్టి ఈ సీజన్లో వ్యాధి సాధారణ జలుబులాగే అనిపించినప్పటికీ, డాక్టర్ సలహా మేరకు మందులు వాడటమే మంచిది.

చివరగా: సాధారణ జలుబు లక్షణాలే కలిగి ఉండే


కొందరిలో అసాధారణమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రభావం స్వైన్ఫ్లూ వైరస్కు ఉంది కాబట్టి... చికిత్స వరకూ తెచ్చుకోకుండా ముందునుంచే నివారణ చర్యలు చేపట్టడం అటు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఇటు వ్యాప్తినీ నివారిస్తుందని గుర్తుంచుకోండి.


స్వైన్ ఫ్లూ... హోమియో చికిత్


హోమియో వైద్యవిధానంలో రోగలక్షణాలతోబాటు వ్యక్తిగత లక్షణాలను బట్టి మందును సూచిస్తారు. కాబట్టి స్వైన్ ఫ్లూ వ్యాధికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తద్వారా చికిత్సతోపాటు... నివారణ కోసం కూడా ఈ మందులను ఉపయోగించవచ్చు. ఈ వ్యాధి కోసం ఉపయోగించి మందుల్లో ముఖ్యమైనవి...


ఇన్ఫ్లుయెంజినమ్: ఇది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్


ద్వారా తయారైన మందు. స్వైన్ఫ్లూ వ్యాధి నివారణిగా ప్రధానంగా వాడదగిన ఔషధం. ఫ్లూ లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, చలిజ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైన ఫ్లూ జ్వర లక్షణాలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంతకుముందు వచ్చిన సాంక్రమిక వ్యాధుల వల్ల వచ్చే జ్వరం పూర్తిగా తగ్గనప్పుడు ఈమందు బాగా సమయంలో పనిచేస్తుంది. మలవిసర్జన కడుపునొప్పి, మనోవ్యాకులత, మానసికంగా బాధపడటం, గనేరియా వ్యాధి చరిత్ర కలిగి ఉన్నవారికి ఇన్ఫ్లుయెంజినమ్ ఔషధం చక్కగా పనిచేస్తుంది.


జెల్సీమియం: నీరసం, మైకం, మగత ఈ ఔషధ


లక్షణం. కండరాల నొప్పులు, నిరంతర చల్లదనం, అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు తీవ్రంగా ఉండటం, హఠాత్తుగా వచ్చే తుమ్ములు, ముక్కు నుంచి స్రావం, చర్మం ఒరుసుకుపోయినట్లుగా అవడం, ఉదాసీనత వల్ల శ్వాస నెమ్మదిగా ఆడటం వంటి లక్షణాలు ఉన్నవారికి జెల్సీమియం చక్కగా పనిచేస్తుంది.


బాప్టిషియా: ఫ్లూ జ్వరంతో పాటు జీర్ణాశయానికి


సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే బాప్టిషియా ప్రయోజనకరమైన ఔషధం. ముఖ్యంగా విరేచనాలు భరింపరాని, కుళ్లిన వాసన కలిగి ఉండటం, విశ్రాంతి తీసుకున్నా శరీరమంతా పుండులా అనిపించడం, బలహీనత, జ్వరం హఠాత్తుగా పెరగడం, ముఖం కమిలిపోవడం, శారీరక-మానసిక బలహీనత, శ్వాసతీసుకోవడం ఇబ్బంది, వీపు భాగంలో చలి, ద్రవపదార్థాలు తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారికి బాప్టిషియా మందు చక్కగా పనిచేస్తుంది.


ఆర్సినికం ఆల్బమ్: చలి, వేడి ఆవిర్లు, రొంప,


తుమ్ములు, ముక్కు నుంచి స్రావాలు, ఆందోళన, భయం, దాహం, తరచూ నీళ్లు తాగాలనిపించడం,


బలహీనత, ఏదైనా తిన్న లేదా తాగిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, ఆహారం వాసన కూడా వికారం కలిగించడం, మంటతో కూడిన ఒళ్లునొప్పులు ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. ఆర్స్- ఆల్బ్ రోగులు వ్యాధి పట్ల భయం కలిగి ఉంటారు. వ్యాధి తమకే వస్తుందనే భయం, ఆందోళన, ఒక్కచోట కుదురుగా ఉండలేక అటు-ఇటు తిరగడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు.


రస్టాక్స్: ఫ్లూ జ్వరంతో పాటు విపరీతమైన


ఒళ్లునొప్పులు, తుమ్ములు, దగ్గు (ముఖ్యంగా సాయంకాలం ఎక్కువగా ఉండటం), చల్లటి వాతావరణం, తేమ వాతావరణంలో బాధలు ఉద్రేకించడం, నీరసం, మాంద్యం, రోగికి టైఫాయిడ్ జ్వరాన్ని పోలిన లక్షణాలు ఉండటం, ముఖ్యంగా నాలుక మంట, మైకం, పిచ్చిగా మాట్లాడటం, రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం, దగ్గు కారణంగా ఛాతీలో మంట, కొన్నిసార్లు అసంకల్పితంగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉన్నవారికి రస్టాక్స్ చాలా ప్రయోజనకరమైన ఔషధం.


యుపటోరియం: శరీరమంతా


పుండులా విపరీతమైన నొప్పి కలిగినవారికీ, శ్వాసనాళంతో పాటు గొంతు పుండులా మారి గొంతుబొంగురుపోవడం, దగ్గు, రొంపతో పాటు విపరీతమైన దాహం ఉండటం, అయినప్పటికీ ద్రవపదార్థాలు తీసుకుంటే వాంతులు కావడం వంటి

లక్షణాలు ఉన్నప్పుడు యుపటోరియం చక్కగా పనిచేస్తుంది.


అకోనైట్: కొద్దిపాటి ఫ్లూ జ్వరం లక్షణాలు ముఖ్యంగా ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, ఇంకా ఏ ఇతర లక్షణాలు లేనప్పటికీ స్వైన్ఫ్లూ ఉందేమోనని ఆందోళన చెందిన రోగులకు అకోనైట్ వాడదగిన ఔషధం.