1000 Health Tips

Cuard Butter Helth Benfits పెరుగు వల్ల కలిగే ఆరోగ్యం ఉపయోగలు

 Cuard Helth Benfits పెరుగు వల్ల కలిగే ఆరోగ్యం ఉపయోగలు


పెరుగు మరియు మజ్జిగ


పెరుగు మరియు మజ్జిగ కడుపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచడం ద్వారా మరియు కడుపులో మంటను తగ్గించడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.


ప్రతిరోజూ భోజనంతో పాటు ఒక కప్పు పెరుగు తినడం కడుపు ఆరోగ్యానికి మంచిది. పెరుగులో కొద్దిగా నల్ల ఉప్పు లేదా వేయించిన జీలకర్ర కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఓంకాలు, నల్ల ఉప్పు కలిపి మజ్జిగ తాగడం వల్ల జీర్ణ సమస్యలు అన్నీ నయమవుతాయి.

Alert Danger Time Heart:ప్రమాదకరమైన గుండెపోటులన్నీ ఆ రోజునే వస్తాయంట..99 శాతం మందికి తెలియని రహస్యం



 గతంలో గుండెపోటు అంటే చాలా పెద్ద వయసున్న వారికి వచ్చేదని ఒకప్పుడు వింటుండేవాళ్లం.. కానీ ఇప్పడు చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

హాయిగా నవ్వుతూ తిరుగుతున్నవాళ్లు సడన్ గా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్న ఘటనలో అనేకం చూస్తున్నాం. సెకన్ల వ్యవధిలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి వీడియోలను ఇటీవల సోషల్ మీడియాలో అనేకం చూస్తూనే ఉన్నాం. ఇదిలాఉంటే మాంచెస్టర్‌లో 2023 లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్కులర్ సొసైటీ (BCS) సమావేశంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం గుండెపోటులను ప్రజలు అర్థం చేసుకునే విధానాన్ని మార్చివేసింది.


ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్ల నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో..వారంలోని ఇతర రోజుల కంటే సోమవారాల్లో తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2013 నుంచి 2018 మధ్య 10000 మందికి పైగా వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఈ అధ్యయనంలో వారంలోని మొదటి రోజున STEMI రేట్లలో పెరుగుదలను డాక్టర్లు కనుగొన్నారు. అంటే సోమవారాల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.


శీతాకాలంలో, తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, స్ట్రోక్ రేట్లలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తుందని అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ తెలిపారు. ఈ వైవిధ్యాలకు ఖచ్చితమైన సమాచారం తెలియదు కానీ గుండెపోటు, స్ట్రోక్‌ ను ప్రభావితం చేసే ప్రసరణ హార్మోన్లను సిర్కాడియన్ లయలు ఎలా ప్రభావితం చేస్తాయనే దానితో ఇది సంబంధం కలిగి ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.


ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం పనికి తిరిగి రావడం వల్ల కలిగే ఒత్తిడి వల్ల ఇది జరగవచ్చు అని తెలిపారు..పెరిగిన ఒత్తిడి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని ఆయన అన్నారు.


లక్షణాలను సకాలంలో గుర్తించండిలా


గుండెపోటు ప్రారంభ సంకేతాలను తెలుసుకోవడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. గుండెపోటు సాధారణ లక్షణాలలో.. ఛాతీలో అసౌకర్యం ఉంటుంది. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు ఒత్తిడి లేదా నొప్పిలా అనిపించవచ్చు, ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది లేదా తరచుగా వచ్చి పోతుంది.


ఇతర హెచ్చరిక సంకేతాలలో చేతులు, మెడ, దవడ, వీపు లేదా కడుపు వరకు నొప్పి కూడా ఉంటుంది. ఇది తరచుగా కండరాల తిమ్మిరి లేదా అజీర్ణం అని భావిస్తుంటాం. కానీ అసలు విషయం మనం గుర్తించలేం. అధిక చెమట, తలతిరగడం, వికారం, విపరీతమైన అలసట కూడా గుండెపోటు ప్రధాన లక్షణాలు..ముఖ్యంగా మహిళలు ఈ లక్షణాలను ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. ఈ లక్షణాలని ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ లక్షణాలను అనుభవిస్తే మీరు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి.



Watermelon: మగవారిలో sex కోరికలు పెంచేందుకు ఎంతో మేలు చేస్తోన్న పుచ్చకాయ తొక్క..?



 వేసవిలో పుచ్చకాయ అధికంగా తీసుకుంటారు. వాటర్ మిలన్‌లో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. కాగా పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు.

పుచ్చకాయ తినడం వల్ల గుండెపోటు, ఆస్తమా అండ్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి.. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం, ACDTకి చెక్ పెట్టాలంటే పుచ్చకాయ ముక్కలు తినాలని చెబుతుంటారు. గ్లూకోజ్, తేనె, నిమ్మరసంతో కలిపి తింటే ఎక్కువ మేలు. కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలకు చెక్ పెట్టొచ్చు. పుచ్చకాయ గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ వీటి గింజల్లో దట్టంగా ఉంటాయి.


ఇవి ఇమ్యూనిటి పవర్ ను పెంచడంలో.. వాపును తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడంలో తోడ్పడుతాయి. రక్తపోటును నియంత్రించడం అండ్ హృదయ సంబంధ వ్యాధులను నివారించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది. పుచ్చకాయ గింజలు ఫోలేట్, ఇనుము, జింక్, రాగి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఈ విత్తనాలు అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్‌లలో కూడా సమృద్ధిగా ఉండటం వల్ల అధిక పోషకాలను కలిగి ఉంటాయి.


అయితే పుచ్చకాయ తొక్క తింటే కూడా మరిన్ని లాభాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. దీని తొక్కలో సిట్రులైన్ పుష్కలంగా ఉంటుంది. కాగా కండరాలను ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, రక్తనాళాల విస్తరణను పెంచడంలో మేలు చేస్తుంది. పుచ్చకాయ తొక్క తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తక్షణ శక్తి వస్తుంది. వాటర్ మిలన్ తొక్కలో ఉండే లైకోపీన్, పలు ఫ్లేవనాయిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ముడతల్ని తగ్గిస్తాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే మగవారిలో లైంగిక కోరికలు పెరుగుతాయట. పుచ్చకాయ తొక్కలో ఉండే అమైనో ఆమ్లాలు లైంగిక కోరికల్ని పెంచేందుకు ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Mango Leaves Benefits : ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టారు.

 Mango Leaves Benefits : ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా ఈ రోజే తినటం ప్రారంభిస్తారు



వాటి గురించి మనకు తెలియక వాటి గురించి పెద్దగా పట్టించుకోము. వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాల ఆశ్చర్యం కలుగుతుంది.


మామిడి ఆకుల రహస్యం తెలిస్తే డాక్టర్లతో పనుండదు.. మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని

 ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మామిడి చెట్ల ఆకులు పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని అంటున్నారు. మామిడి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు.


మామిడి ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫెవోనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ , యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

 

అలాగే బొప్పాయి పండులో ఉండే ‘పాపిన్’ అనే ఎంజైమ్ ను కూడా మామిడి ఆకులలో ఉంటుంది. మామిడి ఆకులలో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టే పండుగలకు, శుభకార్యాలు జరిగినప్పుడు తప్పనిసరిగా గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టటంసంప్రదాయంగా మన పెద్దలు పెట్టారు. మనలో చాలా మందికి మామిడి పండు,మామిడికాయల గురించి తెలుసు.




కానీ మామిడి ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు . మామిడి ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఎన్నో రుగ్మతల నివారణకు వాడుతూ ఉంటారు. మామిడి ఆకును నీటిలో మరిగించి లేదా పొడిరూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. మామిడి ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

 

ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మామిడి ఆకులు నోటి దుర్వాసనను సమర్ధవంతంగా తొలగిస్తుంది. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చిన పొగను పీల్చితేగొంతు సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రెండు మామిడి ఆకులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక గ్లాస్ నీటిలో కలిపి త్రాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

 

కిడ్నీలో రాళ్లను తొలగించుకోవడానికి మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. కొంత మంది విశ్రాంతి లేకుండా విపరీతంగా పనిచేసి తరచూ అలసిపోయి ఒత్తిడికి గురిఅవుతూ ఉంటారు. అలాంటి వారు మామిడి ఆకులతో తయారుచేసిన టీ త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులో ఉండే పోషకాలు నాడీవ్యవస్థను రిలాక్స్ చేసి రీ ఫ్రెష్ గా ఉండేలా చేస్తాయి.

 

కాలిన గాయాలు త్వరగా నయం కావటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చినబూడిదను కాలిన గాయాలపై జల్లితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులతో తయారుచేసిన టీ త్రాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. మధుమేహాన్ని నివారించడంలో మామిడి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది.

 

మామిడి ఆకుల్లో ఉండే టానిన్స్, యాంతో సైనిన్స్ మధుమేహం ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని , అలాగే వ్యాస్కులర్ రిలేటెడ్ సమస్యలను కూడా నివారిస్తుందని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఒక కప్పు మామిడి ఆకుల టీ త్రాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

 

రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు సమస్యలు లేకుండా చేస్తుంది. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు మామిడి ఆకుల టీ త్రాగితే ప్రయోజనం ఉంటుంది. మామిడి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.

Sambogam samyam lo yela undaali telusukundam?

 సంభోగం సమయంలో స్కలనం రావడానికి ఎంత సమయం పడుతుంది? సరైన సమయం మరియు దానిని పెంచడానికి మార్గాలను తెలుసుకోండి!


లైంగిక సంపర్కం యొక్క వ్యవధి పురుషునికి పురుషునికి మారుతుంది, కానీ సరైన సమయం ఉందా? ఈ ప్రశ్న చాలా సంఖ్యలో పురుషులను ఆందోళనకు గురిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగటున, 5 నుండి 7 నిమిషాలలోపు స్కలనం సాధారణమైనదిగా పరిగణించబడుతుంది.

కానీ చాలా మంది పురుషులు 1-2 నిమిషాల్లోనే డిశ్చార్జ్ అవుతారు, దీనిని అకాల స్ఖలనం (PE) అంటారు. కొంతమంది పురుషులు 10-15 నిమిషాలు కూడా ఉండగలరు.


స్కలనానికి సరైన సమయం ఏది?

సగటున, 5-7 నిమిషాలలోపు స్కలనం సాధారణమైనదిగా పరిగణించబడుతుంది.

1-2 నిమిషాల్లో స్కలనం జరిగితే, అది అకాల స్కలన సమస్య కావచ్చు.

కొంతమంది పురుషులు 10-15 నిమిషాలు సంభోగం కొనసాగించవచ్చు, ఇది ఆదర్శంగా పరిగణించబడుతుంది.

మహిళలు సగటున 13-15 నిమిషాల్లో భావప్రాప్తి పొందుతారు, కాబట్టి పురుషులు తమ సమయాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి.


లైంగిక సంపర్క వ్యవధిని ఎలా పెంచాలి?

స్టాప్-స్టార్ట్ టెక్నిక్ - మీరు స్కలనం చేయబోతున్నప్పుడు, కొన్ని సెకన్ల పాటు ఆగి, మళ్ళీ ప్రారంభించండి.

లోతైన శ్వాసలు తీసుకోండి - మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల స్ఖలనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

కెగెల్ వ్యాయామాలు చేయండి - పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడం వల్ల స్కలనం ఆలస్యం అవుతుంది.

సరైన భంగిమను ఎంచుకోండి - స్పూనింగ్ పొజిషన్ వంటి కొన్ని భంగిమలు స్ఖలనాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

లూబ్రికేంట్ వాడండి - ఇది సున్నితత్వాన్ని కొద్దిగా తగ్గిస్తుంది మరియు సంభోగ సమయాన్ని పెంచుతుంది.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి - ఆందోళన మరియు నిరాశ అకాల స్కలనానికి కారణమవుతాయి.


వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ప్రతిసారీ 1-2 నిమిషాలలోపు స్కలనం సంభవిస్తే మరియు భాగస్వామి సంతృప్తి చెందకపోతే.

మానసిక ఒత్తిడి, అలసట లేదా కొన్ని మందుల కారణంగా లైంగిక సంపర్క వ్యవధి తగ్గుతుంటే.

హార్మోన్ల అసమతుల్యత లేదా నాడీ సంబంధిత సమస్యల కారణంగా అకాల స్కలనం సంభవిస్తుంటే.

Turmeric Cumin Seeds : పసుపు, జీలకర్ర కలిపిన నీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండ తాగితే…ఈ వ్యాధులన్నీ పరార్…?

 Turmeric Cumin Seeds :  

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ధనం ఎంత ముఖ్యమో ఆరోగ్యం (Health) కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా work  చేయగలం ఏదైనా సాధించగలం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. శరీరంలో ఏం జరుగుతున్నాయో మనం ముందుగా తెలుసుకోవడం కష్టం. అది ఒక్క లక్షణాలు బట్టి ఆ తరువాత మనం చికిత్సకు వెళ్తాం. ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య నిత్యం వేధిస్తూనే ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేయాలంటే ఇంట్లోనే ఈజీగా చేసుకొనే  కొన్ని చిట్కాలను ఇప్పుడు  మనం తెలుసుకుందాం. ఈ చిట్కా  నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే పచ్చి Turmeric పసుపు, జీలకర్ర Cumin Seeds  Water నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ రోజైతే  అలవాటుగా చేసుకుంటే వ్యాధులన్నీ  మటుమాయం చేసుకోవచ్చు. ఈ పచ్చి పసుపు మరియు జీలకర్ర నీటిని రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు Health Benefits  కలుగుతాయో  మనం తెలుసుకుందా…


Turmeric Cumin Seeds జిలక్రర

జిలకర జీర్ణ క్రియ మరియు పోషకాల ను  మెరుగుపరిచడాం  ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం మరియు సమస్యలు తగ్గుతాయి. పసుపులో యాంటీ ఇన్సోల్  మ్యాటరి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. పచ్చి పసుపు, జీలకర్ర  కలిపిన నీరు తాగడం వల్ల  జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జిలకర పసుపు రోగనిరోధక శక్తి ని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది. జీలకర్ర లో  ఇనుము ఉంటుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పసుపులో కర్క్యుమిన్ ఉంటుంది. కావున ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రక్షణ విధానాలుగా పనిచేస్తాయి. కర్క్యుమెంన్ వాపు, స్వీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు మరియు జీలకర్ర   రెండు సహజ నిర్వేశికరణ కారకాలు. జీలకర్ర కాలయా పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది జీర్ణ క్రియ కు అవసరం. తీరంలో మలినాలను తొలగించి వేస్తుంది. ఎక్కడ మరియు పసుపు నీటిని రోజు తీసుకుంటే శరీరంలో విష వ్యర్ధాలు బయటికి పోతాయి. జీర్ణ వ్యవస్థ కాలయం ఆరోగ్యంగా ఉండుటకు జీలకర్ర పసుపు నీరు చాలా అవసరం.

జీలకర్ర పసుపు జీర్ణ క్రియలను మెరుగుపరచడమే కాదు బరువు నిర్వహణకు సహాయపడుతుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి పసుపు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించుటకు కొవ్వు పేరుకుపోకుండా ఉండుటకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. రెండు మిశ్రమాలను కలిపి తాగడం వల్ల జీవ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. నియంత్రించుటలో కూడా సహాయపడుతుంది. జిలకర మరియు పసుపు నీటిని రోజు తాగడం వల్ల శ్వాస కోశమార్గం శుభ్రపడుతుంది. ఆశ కోశ వ్యవస్థలో వాపు తగ్గుతుంది. శరీరం ఆస్తమా, బ్రో నైకిటిస్, అలా అనుగుణంగా అలర్జీలు వంటి వాటితో పోరాడుతుంది. కఫం మరియు దగ్గు అంటి సమస్యలను తగ్గించుటకు సహజ కాఫ హారకమైనదిగా కూడా పనిచేస్తుంది.

Turmeric Cumin Seeds జీలకర్ర, పసుపు

జీలకర్ర, పసుపు బలమైన శోధక నిరోధక లక్షణాన్ని కలిగి ఉంటాయి. రోజు పచ్చి పసుపు, జీలకర్ర నీరు తీసుకోవడం కీళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆర్థరైటిస్, ఇతర వ్యాధులలో కనిపించే కీళ్లనొప్పి మరియు వాపు వంటి సహజంగా కండరాలను సడలించి నొప్పిని తగ్గిస్తుంది లక్షణాలను తగ్గిస్తుంది.

Akali leka povatam. vaanthulu vikaaram liverdamage semtems

 వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.వికారం, ఆకలి లేకపోవడం


మీకు ఏది తినాలనిపించడం లేదా.. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందా అయితే ఇవి మంచి లక్షణాలు కావు. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే సంకేతం. లివర్ సమస్యతో బాధపడుతున్నట్టుయితే ఆకలి మందగిస్తుంది. చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు. అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి. తరుచుగా వాంతులు అవుతుంటాయి. భోజనం చేసిన వెంటనే వికారం, వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం బెస్ట్.