Alert Danger Time Heart:ప్రమాదకరమైన గుండెపోటులన్నీ ఆ రోజునే వస్తాయంట..99 శాతం మందికి తెలియని రహస్యం



 గతంలో గుండెపోటు అంటే చాలా పెద్ద వయసున్న వారికి వచ్చేదని ఒకప్పుడు వింటుండేవాళ్లం.. కానీ ఇప్పడు చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

హాయిగా నవ్వుతూ తిరుగుతున్నవాళ్లు సడన్ గా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్న ఘటనలో అనేకం చూస్తున్నాం. సెకన్ల వ్యవధిలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి వీడియోలను ఇటీవల సోషల్ మీడియాలో అనేకం చూస్తూనే ఉన్నాం. ఇదిలాఉంటే మాంచెస్టర్‌లో 2023 లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్కులర్ సొసైటీ (BCS) సమావేశంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం గుండెపోటులను ప్రజలు అర్థం చేసుకునే విధానాన్ని మార్చివేసింది.


ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్ల నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో..వారంలోని ఇతర రోజుల కంటే సోమవారాల్లో తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2013 నుంచి 2018 మధ్య 10000 మందికి పైగా వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఈ అధ్యయనంలో వారంలోని మొదటి రోజున STEMI రేట్లలో పెరుగుదలను డాక్టర్లు కనుగొన్నారు. అంటే సోమవారాల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.


శీతాకాలంలో, తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, స్ట్రోక్ రేట్లలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తుందని అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ తెలిపారు. ఈ వైవిధ్యాలకు ఖచ్చితమైన సమాచారం తెలియదు కానీ గుండెపోటు, స్ట్రోక్‌ ను ప్రభావితం చేసే ప్రసరణ హార్మోన్లను సిర్కాడియన్ లయలు ఎలా ప్రభావితం చేస్తాయనే దానితో ఇది సంబంధం కలిగి ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.


ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం పనికి తిరిగి రావడం వల్ల కలిగే ఒత్తిడి వల్ల ఇది జరగవచ్చు అని తెలిపారు..పెరిగిన ఒత్తిడి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని ఆయన అన్నారు.


లక్షణాలను సకాలంలో గుర్తించండిలా


గుండెపోటు ప్రారంభ సంకేతాలను తెలుసుకోవడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. గుండెపోటు సాధారణ లక్షణాలలో.. ఛాతీలో అసౌకర్యం ఉంటుంది. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు ఒత్తిడి లేదా నొప్పిలా అనిపించవచ్చు, ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది లేదా తరచుగా వచ్చి పోతుంది.


ఇతర హెచ్చరిక సంకేతాలలో చేతులు, మెడ, దవడ, వీపు లేదా కడుపు వరకు నొప్పి కూడా ఉంటుంది. ఇది తరచుగా కండరాల తిమ్మిరి లేదా అజీర్ణం అని భావిస్తుంటాం. కానీ అసలు విషయం మనం గుర్తించలేం. అధిక చెమట, తలతిరగడం, వికారం, విపరీతమైన అలసట కూడా గుండెపోటు ప్రధాన లక్షణాలు..ముఖ్యంగా మహిళలు ఈ లక్షణాలను ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. ఈ లక్షణాలని ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ లక్షణాలను అనుభవిస్తే మీరు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి.



No comments:

Post a Comment