వేసవిలో పుచ్చకాయ అధికంగా తీసుకుంటారు. వాటర్ మిలన్‌లో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. కాగా పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు.
పుచ్చకాయ తినడం వల్ల గుండెపోటు, ఆస్తమా అండ్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి.. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం, ACDTకి చెక్ పెట్టాలంటే పుచ్చకాయ ముక్కలు తినాలని చెబుతుంటారు. గ్లూకోజ్, తేనె, నిమ్మరసంతో కలిపి తింటే ఎక్కువ మేలు. కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలకు చెక్ పెట్టొచ్చు. పుచ్చకాయ గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ వీటి గింజల్లో దట్టంగా ఉంటాయి.
ఇవి ఇమ్యూనిటి పవర్ ను పెంచడంలో.. వాపును తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడంలో తోడ్పడుతాయి. రక్తపోటును నియంత్రించడం అండ్ హృదయ సంబంధ వ్యాధులను నివారించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది. పుచ్చకాయ గింజలు ఫోలేట్, ఇనుము, జింక్, రాగి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఈ విత్తనాలు అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్‌లలో కూడా సమృద్ధిగా ఉండటం వల్ల అధిక పోషకాలను కలిగి ఉంటాయి.
అయితే పుచ్చకాయ తొక్క తింటే కూడా మరిన్ని లాభాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. దీని తొక్కలో సిట్రులైన్ పుష్కలంగా ఉంటుంది. కాగా కండరాలను ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, రక్తనాళాల విస్తరణను పెంచడంలో మేలు చేస్తుంది. పుచ్చకాయ తొక్క తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తక్షణ శక్తి వస్తుంది. వాటర్ మిలన్ తొక్కలో ఉండే లైకోపీన్, పలు ఫ్లేవనాయిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ముడతల్ని తగ్గిస్తాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే మగవారిలో లైంగిక కోరికలు పెరుగుతాయట. పుచ్చకాయ తొక్కలో ఉండే అమైనో ఆమ్లాలు లైంగిక కోరికల్ని పెంచేందుకు ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.
No comments:
Post a Comment