1000 Health Tips

Tiffin idli dosa daily food?

 టిఫిన్ గా ఇడ్లి దోస వడ తింటునారా ? అయితే ఆ వ్యాధి భారిన పడక తప్పదు 



మూడు పూటలా అన్నం తింటే లావుగా అవుతాం. కాబట్టి ఉదయం రాత్రికి టిఫిన్స్ చేశామ అనుకోండి కొంత అయినా పెరిగిన బరువు తగ్గించుకోవచ్చు. 

చాలా మంది బరువు తగ్గడానికి ఆలోసించే విధానం ఇదే. అయితే కొందరు సమయం దొరికినపుడల్లా టీ. కాఫి మీదే ఆధారపదాతారు. అయితే టీ. కాఫి  బాగా అలవాటు వలన  మన  శారీరం లో పెద్ద నష్టం జరుగుతుంది,

. ప్రతి రోజు ఇడ్లి. వడ. దోస తినటం వలన జీర్ణవ్యవస్ద దెబ్బతింటుంది 

మన పూర్వికులు పాత కాలంలో మన పెద్దలు అయితే ఉదయంనే శరీరానికి మంచి పోషకాలను, కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. 

ఉదయం పెరుగు లో చద్దన్నం, జొన్న రొట్టె , రాగి సంగటి  అటువంటివెన్నె పోషకాల వరంగా వెలకట్టలేని ఆహారాలు ఉన్నాయ్.  ఇక  అందరూ మూడు పూటలా అన్నం తినడం అలవాటయ్యింది. 

ఇప్పుడు ఉదయమే టిఫిన్లు , మాద్యహ్నం అన్నం. రాత్రి కి టిఫిన్స్ తినటం చేస్తున్నారు, మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లి మంచిదే. కానీ అందులో సాంబారు, చెట్నీ,అల్లంచెట్నీ,కారపోడి, నెయ్యి   ఇలా అన్నింటిని తినటం వలన కడుపులో     ఎ సి డి టి  పెరుగిపోతింది 

బియ్యం కంటే మినపప్పు లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 

అలాగే ఇవి షుగర్ ను పెంచుతాయి. ఇలా ప్రతి రోజు టిఫిన్స్ చేయటం వలన పేగులు తన శక్తీని కోల్పోతాయి. 

అల్లాగే జీర్ణవ్యవస్ద పూర్తిగా దెబ్బ తింటుంది. తరువాత వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లి,దోస,వడ,పూరి,పరోటా వంటి టిఫిన్స్ దీర్ఘకాలంగా అంటే పది నుండి పదిహేను సవత్సరాలుగా తింటున్న వారికి షుగర్ బారిన పడవచ్చు. కాబ్బట్టి వారానికి ఒకటి లేక రెండు సార్లకే టిఫిన్స్ కి పరిమితం చేయాలి. 

ఉదయం వేళ పెరుగుఅన్నం కలిపి పెట్టుకొని ఉదయం తినడం. లేక మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జురామ్ వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్దీ రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. 

అలాగే మద్య్హనాంకి బిర్రుగా కడుపునిండా తినాలి  కొంతమంది ఉపవాసం. పేరుతో రాత్రి వేళ అన్నం మానేస్తారు. 

అటువంటి అలవాట్లు ఉన్నవాళ్లు తిరిగి ఆ సమయంలో ఇడ్లి, దోస, బొండాలు, చపాతి, పరోటాలు వంటివి లాగిస్తుంటారు. 

కానీ ఆలా చేయటం వలన సాధారణంగా అన్నం తిన్నదానికంటే ఎక్కువే శరీరానికి నష్టం. అలాగే రాత్రి పూట తేలికగా తినటం వలన ఆరోగ్యం గా ఉంటారంట మంచి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. 




chemata yekuvaga vastunda. Helth Tips. Articlesshow

చెమట అధికంగా వస్తుందంటే..


ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

*. ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.

*. రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.

*. టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.

*. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.. నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.

Mutram lo ee rangu kanipiste doctor ni sampradinchandi

   మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే 



మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే
 ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.

Cough Remedies Helth Tips Articles

దగ్గు తగ్గడానికి చిట్కాలు..

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 



గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దీనితో తరచూ వైద్యులు దగ్గరకు పరుగెడుతూ వారు ఇచ్చిన మందులను వేసుకుంటుంటారు. తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇంట్లోనో దొరికే వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పావు కప్పు గ్లిజరిన్ లో పావు కప్పు తేనె కలపండి. అందులోనే పావు కప్పు నిమ్మసరం కూడా కలిపేయండి. అన్నింటినీ బాగా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ మోతాదులో రోజంతా తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య త్వరగా తగ్గే అవకాశాలున్నాయి.

Waking daily benefits helth tips articleshow

వాకింగ్.. ఏ సమయంలో..ఎలా చేస్తే మంచిదో తెలుసా..!


మీకాళ్లకు పని చెబితే..అవి మీ హృదయ భారం తగ్గిస్తాయి. చాలా మంది వైద్యులు చెప్పే సలహా ఇది. వాకింగ్ తో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాకింగ్ శరీరానికే కాదు..
మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. మీ గురించి మీరు సమీక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ వాకింగ్ ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఓసారి చూద్దాం.

వాకింగ్ అంటే చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి.. తిని నడవాలా.. పరగడపున నడవాలా.. ఇలాంటివి.. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిది. ఎందుకంటే.. ఉదయం కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది. అలాగని పరగడుపున నడవాల్సిన అవసరం లేదు సుమా..

కాస్త లైట్ గా టిఫిన్ చేసి కూడా మార్నింగ్ వాకింగ్ చేయొచ్చు. మీకు షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు.

నడకలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. రోజుకు 10 వేల అడుగులు నడవడం. కాబట్టి.. ఇది ఎక్కడ నడిచామన్నది ప్రధానం కాదు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. డాబాపైనో.. సెల్లార్ లోనో.. ఎక్కడైనా సరే. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. కాకపోతే ఉదయం నుంచి పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. నడక అంత ఉత్సాహంగా అనిపించదు. ఇక రాత్రి పూట నడక వృద్ధులకు అంత మంచిది కాదు. కంటి చూపు మూలంగా ప్రమాదాలకు గురవచ్చు. ఏదైనా తగిలి కింద పడిపోవచ్చు. అసలే వృద్దాప్యం కారణంగా ఎముకల సమస్యలు కూడా ఉంటాయి.

Munagaaku:మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...helth tips Articleshow

Moringa Powder:ఈ చిట్టి చిట్టి ఆకుల పొడి చిటికెడు తిన్నా చాలు..!



మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది.

ఆ ఆరోగ్యం సరిగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా మన డైట్ లో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహారం ఒకటి ఉంది. అదే మునగాకు. చూడటానికి చిట్టి చిట్టిగా ఉండే ఈ ఆకులు మన ఆరోగ్యంపై మ్యాజిక్ చేస్తాయి. ఈ మునగాకులను పొడి రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

 
మునగాకులను సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా కొద్దిగా మునగాకు పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రక్తం శుద్ధి చేస్తుంది. చర్మం, జుట్టూ రెండూ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుతస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరకుండా కూడా సహాయపడుతుంది.

 
మునగాకులో పోషకాలు..
మునగాకులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

2 గ్రాముల ప్రోటీన్
విటమిన్ B6 : 19%
విటమిన్ C 12 శాతం
ఐరన్ 11%
రిబోఫ్లావిన్ (B2) : 11%
బీటా-కెరోటిన్ విటమిన్ A:9%
మెగ్నీషియం: 8 శాతం

 
రెగ్యులర్ గా మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త పోటు సమస్య ఉండదు. అంతేకాదు.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల... ఈ మునగాకులో విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఫలితంగా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా, అందంగా కనపడేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మునగాకులోని బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్యాలు , ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో శరీరానికి సహాయపడుతుంది. క్వెర్సెటిన్ , క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ముఖ్యమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

 
మెదడును పదునుపెడుతుంది

మీరు మతిమరుపుకు గురైతే మునగాకు తినండి. మునగాకులో కనిపించే సమ్మేళనాలు అభిజ్ఞా , జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపరుస్తాయి. దీని అధిక ప్రోటీన్, ఐరన్ కంటెంట్ మెదడు ఆక్సిజన్‌ను స్వీకరించడానికి సహాయపడుతుంది, ఇది ఏకాగ్రత, మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది. మునగాకులో కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.



High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?helth tips Articleshow

High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?


Blood Pressure: ప్రతి భారతీయుల ఇంటిలో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఉండే వాటిలో పసుపు ప్రధానమైంది. దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా పసుపును ఉపయోగిస్తుంటాం.
కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రక్తపోటును తగ్గించడంలో కూడా పసుపు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బిపి స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

అధిక రక్తపోటుకు ముఖ్యమైన కారణాల్లో శరీరంలో వాపు పెరగడం ఒకటి. పసుపులోని కర్కుమిన్ రక్తనాళాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడి, బిపి స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. పసుపులోని కర్కుమిన్‌ రక్తనాళాల విస్తరణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక పసుపులోని యాంటీఆక్సిడెంట్లు, రక్తనాళాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. కర్కుమిన్ రక్తనాళాలను విశ్రాంతి తీసుకునేలా చేయడం ద్వారా, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ధమనుల గోడలపై ఒత్తిడిని తగ్గించడంతో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పసుపును టీ లేదా పాలలో కలుపుకుని తీసుకోవడం ద్వారా బీపీ అదుపులో ఉంటుంది. వేడి నీటిలో 1 టీ స్పూన్ పసుపును కలపాలి. అలాగే ఇందులో చిటికెడు నల్ల మిరియాల పొడి, తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా రోజు ఒకసారి మరీ ముఖ్యంగా ఉదయం తీసుకుంటే క్రమంగా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. పాలు పసుపు కలుపుకొని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని గోల్డెన్‌ మిల్క్‌గా చెబుతుంటారు. గోరు వెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగాలి. రోజూ ఉదయం ఇలా తాగితే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.