1000 Health Tips

క్రమం తప్పకుండ 30 రోజుల పాటు Orange Fruits తినడం వలన మన శరీరం లో వచ్చే మార్పులు..

 నెలరోజుల పాటు రోజుకొక ఆరెంజ్ పండు తినడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం:

  •  రోగనిరోధక శక్తి పెరుగుదల:
  •  ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
  • ఇది జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
  •  చర్మ ఆరోగ్యం:
  •     ఆరెంజ్‌లో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
  •     ఇది చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
  •   జీర్ణక్రియ మెరుగుదల:
  •    ఆరెంజ్‌లో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  •     మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
  •   గుండె ఆరోగ్యం:
  •     ఆరెంజ్‌లోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
  •     ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  •   కంటి ఆరోగ్యం:
  •     ఆరెంజ్ లో విటమిన్ ఎ ఉండుట వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  •   బరువు నిర్వహణ:
  •    ఆరెంజ్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
  •   మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు:
  •     ఆరెంజ్‌లో ఫోలేట్, కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
  •     ఆరెంజ్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండుట వలన క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

Orange Fruits, ప్రతిరోజు ఒక ఆరెంజ్ పండు తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Orange Fruits లో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  ఒక నెల పాటు క్రమం తప్పకుండా Orange Fruits తింటే, ఎన్నో  ప్రయోజనాలు మీరు పొందుతారు. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా Orange Fruits మనం Orange Fruits  తీసుకోవటం  వల్లన  ఎటువంటి,  ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.


Orange Fruits ఒక నెల పాటు క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులను అదుపులో ఉంటాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా  ఒక Orange Fruit తినడం ద్వారా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు వాటి బారిన పడకుండా  కాపాడుకోవచ్చు.

 

Orange Fruits విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

 బరువు తగ్గించే ప్రక్రియలో Orange Fruits చాలావరకు అద్భుతాలు చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా  ఉంటాయి . అంతేకాకుండా, ప్రతి రోజు క్రమం తప్పకుండా  ఒక Orange Fruit తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. Orange Fruits లో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. Orange Fruits చర్మ సంరక్షణకు కి కూడా అద్భుతముగా శరీరానికి మెరుగుపరుస్తుంది. 


ఇక శరీర చర్మాన్ని  సహజమైన హైడ్రేషన్ అందిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చర్మం  ఆరోగ్యంగా ఉంటుంది. Orange Fruits తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. Orange Fruits లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 క డుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.


అటువంటి వారు ఏది తిన్నా కూడా వారి లక్షణాలు ఇంకా తీవ్రవాలుతాయని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అల్సర్స్ రావడానికి ప్రధాన కారణం కడుపులో అల్సర్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ బుక్ ప్రోఫిన్ స్టెరాయిడ్ వంటి యాంటీ ఇంఫ్లమెంటరీ మందులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.


రెండవ కారణం పైలోరి అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరిలో ధూమపానం చేసేవారు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసే తీసుకునేవారు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు. ఈ సమస్య ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అల్సర్ ఉన్నవారు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలిఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు- కడుపులో అల్సర్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.


ముఖ్యంగా ఆకుకూరలు, బ్రకోలి, వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇది మీ కడుపులోని అల్సర్ తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం ద్వారా మీకు అల్సర్ రాకుండా ఉంటుంది. పెరుగు- పెరుగులో ప్రోబయోటిక్ ఇది కడుపులో ఉన్న అల్సర్ తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా హెలికా బ్యాటర్ పైలోరి బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు.


ఈ ప్రోబయాటిక్ రిచ్ గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీ జీర్ణ వ్యవస్థ సమతుల్యమై అల్సర్స్ ను తగ్గిస్తుంది. పండ్లు- బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఇది మీ కడుపులో ఉన్న అల్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష పండు వంటివి తీసుకోకూడదు. ఇందులో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండటం ద్వారా ఇది కడుపులోని అల్సర్ ఎక్కువగా చేస్తుంది.


దీని ద్వారా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా చేపలు- చేపలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో ఏర్పడ్డ అల్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపల్లో సాల్మన్ మాకే రైల్ వంటి చేపలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది.


దీని ద్వారా మీ కడుపులో ఏర్పడ్డ అల్సర్ తగ్గుతాయి. మీకు ఈ సమస్య అధికంగా ఉంటే డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకొని వాడాల్సి ఉంటుంది. Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

Radish is an elixir for health.. కానీ వీటితో కలిపి తింటే విషంతో సమానం..

 ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే, ముల్లంగితో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


మారుతున్న వాతావరణం, జీవన శైలితో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక, ఈ సీజన్‌లో ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది. ముల్లంగిని సాంబారు, సలాడ్, కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు ముల్లంగితో పచ్చడి కూడా చేసుకుంటారు. ఇది అద్భుత రుచిని ఇస్తుంది. అయితే, రుచి మాత్రమే కాకుండా ముల్లంగిలో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూరగాయ ఆరోగ్యానికి అమృతం. ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధక సమస్య తగ్గించడంలో ముల్లంగి ఎంతో సహాయపడుతుంది.

ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. జీర్ణక్రియకు దివ్యౌషధం. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని తీసుకోవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా ముల్లంగిని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఫోలేట్ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి ముల్లంగిని తీసుకునేటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగితో కలిపి కొన్ని ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో అనేక రకాల సమస్యలు పెరుగుతాయి. ముల్లంగితో పాటు ఏ ఫుడ్స్ తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

పాలు..


ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహారాలు వ్యతిరేక లక్షణాల్ని కలిగి ఉంటాయి. ముల్లంగి, పాలు కూడా అలాంటి కోవకి చెందినవే. ఈ రెండు కలిపి తీసుకుంటే మీ జీర్ణక్రియ పాడవుతుంది. ముల్లంగితో పాటు పాలు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. మీరు ముల్లంగి తింటే, దానితో పాటు పాలు తీసుకోకండి. ముల్లంగి, పాలు రెండూ మీ శరీర వ్యవస్థను పాడు చేసే యాంటీ ఫుడ్స్. మీరు ముల్లంగితో లేదా తిన్న తర్వాత పాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పొట్లకాయ..

ముల్లంగితో పాటు పొట్లకాయ తీసుకోకూడదు. ఈ రెండు వ్యతిరేక ఆహారాలు. ఇవి మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ముల్లంగితో పాటు పొట్లకాయ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా అజీర్తి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు.

కాకర కాయ..

మీరు ముల్లంగి తింటుంటే, దానితో పాటు చేదుగా ఉంటే కాకర కాయను తినకండి. ముల్లంగి, కాకరకాయ కాంబినేషన్ చాలా డేంజర్. ముల్లంగితో పాటు చేదు కలిపి తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు కూరగాయలను కలిపి తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. అంతేకాకుండా.. మీ జీర్ణక్రియపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

Radish: ముల్లంగి ఆరోగ్యానికి అమృతం.. కానీ వీటితో కలిపి తింటే విషంతో సమానం..


ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే, ముల్లంగితో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.మారుతున్న వాతావరణం, జీవన శైలితో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక, ఈ సీజన్‌లో ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది. ముల్లంగిని సాంబారు, సలాడ్, కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు ముల్లంగితో పచ్చడి కూడా చేసుకుంటారు. ఇది అద్భుత రుచిని ఇస్తుంది. అయితే, రుచి మాత్రమే కాకుండా ముల్లంగిలో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూరగాయ ఆరోగ్యానికి అమృతం. ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధక సమస్య తగ్గించడంలో ముల్లంగి ఎంతో సహాయపడుతుంది.


ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. జీర్ణక్రియకు దివ్యౌషధం. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని తీసుకోవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా ముల్లంగిని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఫోలేట్ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి ముల్లంగిని తీసుకునేటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగితో కలిపి కొన్ని ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో అనేక రకాల సమస్యలు పెరుగుతాయి. ముల్లంగితో పాటు ఏ ఫుడ్స్ తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.  

పాలు..

ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహారాలు వ్యతిరేక లక్షణాల్ని కలిగి ఉంటాయి. ముల్లంగి, పాలు కూడా అలాంటి కోవకి చెందినవే. ఈ రెండు కలిపి తీసుకుంటే మీ జీర్ణక్రియ పాడవుతుంది. ముల్లంగితో పాటు పాలు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. మీరు ముల్లంగి తింటే, దానితో పాటు పాలు తీసుకోకండి. ముల్లంగి, పాలు రెండూ మీ శరీర వ్యవస్థను పాడు చేసే యాంటీ ఫుడ్స్. మీరు ముల్లంగితో లేదా తిన్న తర్వాత పాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


పొట్లకాయ..

ముల్లంగితో పాటు పొట్లకాయ తీసుకోకూడదు. ఈ రెండు వ్యతిరేక ఆహారాలు. ఇవి మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ముల్లంగితో పాటు పొట్లకాయ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా అజీర్తి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు.

కాకర కాయ..

మీరు ముల్లంగి తింటుంటే, దానితో పాటు చేదుగా ఉంటే కాకర కాయను తినకండి. ముల్లంగి, కాకరకాయ కాంబినేషన్ చాలా డేంజర్. ముల్లంగితో పాటు చేదు కలిపి తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు కూరగాయలను కలిపి తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. అంతేకాకుండా.. మీ జీర్ణక్రియపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.నారింజ..

ముల్లంగి, నారింజ రెండూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు. రెండు వేర్వేరుగా తీసుకుంటే మన శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే నారింజ, ముల్లంగి రెండూ కలిపి తీసుకుంటేనే అసలు సమస్య వస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రెండింటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. రెండు కలిపి తీసుకోవడం వల్ల మీ జీర్ణశక్తిపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అంతేకాకుండా అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది.

తేనె..

మీరు మీ ఆహారంలో ముల్లంగిని తీసుకుంటే, దానితో పాటు తేనె తీసుకోకండి. తేనె, ముల్లంగి కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి. తేనెను ముల్లంగితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

టీ తాగకూడదు..

ముల్లంగి తిన్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీ తాగకండి. అది మీ జీర్ణక్రియను పాడు చేస్తుంది. ఈ రెండింటి కలయిక మలబద్ధక సమస్యను తీవ్రం చేస్తుంది. ఈ రెండు ఆహారాలు యాంటీ ఫుడ్స్, ఇవి ఎసిడిటీని పెంచుతాయి. ముల్లంగి తిన్న తర్వాత టీ తాగడం మానేయాలి. వాపుల సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది.


గమనిక..

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

Does eating white bread cause diabetes and obesity?

 ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెడ్, బ్రెడ్ పకోడా, బ్రెడ్ జామ్ రకరకాలు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. అయితే, ఓ యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో నిజనిజాలు తెలుకోవడానికి నిపుణుల్ని సంప్రదించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే..







ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక, మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్స్ కూడా ఉన్నాయి. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే కచ్చితంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. ఇక, ఈ రోజుల్లో డయాబెటిస్, ఊబకాయం సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అయితే, వైడ్ బ్రెడ్‌ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది వైడ్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వైడ్ బ్రెడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వస్తాయని ఓ యూట్యూబ్ వీడియోలో ఉంది. ఇందులో నిజం తెలుసుకోవడానికి మా ఫ్యాక్ట్ చెక్ బృందం నిపుణుల్ని సంప్రదించింది. ఈ విషయంపై నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.



యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు. వైడ్ బ్రెడ్‌ని 100 శాతం మైదాతో తయారు చేస్తారని.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుతుందని తెలిపారు. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ లేదంటే ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి ఇంటి టిఫెన్స్ చేయడం మేలని పేర్కొన్నారు. అంతేకానీ వైడ్ బ్రెడ్‌తో పకోడా, జామ్‌తో తినడం, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తినవద్దని తెలిపారు. అయితే, ఇందులో నిజమెంత? డాక్టర్ ఏం చెప్పారు?

డాక్టర్ ఏం చెప్పారంటే..
యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం నిజమో లేదో తెలుసుకోవడానికి ది డైట్ ఎక్స్‌పర్ట్స్‌ సీఈవో, హెడ్ డైటీషియన్ అయిన సిమ్రమ్ కతురియాను సంప్రదించడం జరిగింది. వైట్ బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో పోషకాలేమీ లేవని సిమ్రమ్ కతురియా తెలిపారు. వైట్ బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో ఆకస్మిక మార్పులకు కారణమన్నారు.

వైట్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ తగ్గుతుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ వస్తుందని తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆకలి పెరుగుతుందని.. దీంతో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.


చివరికి ఏం తేలిందంటే..మా ఫ్యాక్ట్ చెక్ విచారణలో యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం దాదాపు నిజమని తేలింది. వైట్ బ్రెడ్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు తెలిపారు. వైడ్ బ్రెడ్ బదులు గింజలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారంలో చేర్చుకోవాలని వారు పేర్కోన్నారు.





Check for paralysis. helth tips

 పక్షవాతానికి చెక్!

పక్షవాతం వస్తే ఎంత నరకమో తెలిసిందే! మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలతో పక్షవాతం రాకుండా చూసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ శరీరానికి సరిపడా మెగ్నీషియం తీసుకుంటే పక్షవాతం దరిచేరదట. අධි ఆషామాషీగా చెప్పింది కాదు. పరిశోధనల్లో వెల్లడయిన విషయం ఇది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటం ద్వారా పక్షవాతం ముప్పు తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియం 100 మి.గ్రా మోతాదు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, బీన్స్, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.

Does eating nepaka on a regular basis reduce inflammation of the gums?:పరగడపున వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందా, డాక్టర్స్ చెప్పే నిజాలు తెలుసుకోండి

 వేపాకుల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఈ నేపత్యంలోనే వేపాకులు తింటే చిగురువాపు తగ్గుతుందని ఓ వార్త హల్ చల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలుసుకోండి.







దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్నే కాపాడుతుంది. దంతాల ఆరోగ్యం బాగుంటే చిగుళ్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకూ దరిచేరవనే చెప్పొచ్చు. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలకి పరిష్కారంగా సోషల్ మీడియాలో చాలా నివారణలు ఉన్నాయి. వీటిలో ఒకటే.. ఉదయం పరగడపున వేపాకులు తినడం. ఇలా వేపాకులు తింటే చిగుళ్ల ఆరోగ్యం మెరుగ్గా మారుతుందని యూట్యూబ్‌లో ఓ వీడియోలో చెబుతున్నారు. ఇందులో నిజాలు తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ డాక్టర్‌ని సంప్రదించారు.

డాక్టర్ చెప్పేదేంటంటే

వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందన్న టిప్ గురించి డా.కరుణ మల్హోత్రా, కాస్మోటాలజిస్ట్ మాట్లాడుతూ వేపాకులు సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాల కారణంగా చిగుళ్ల ఆరోగ్యానికి కొన్ని రోజులుగా వాడుతున్నారు. దీనిని వాడడం వల్ల చిగురు వాపు తగ్గుతుంది. కానీ, చిగుళ్లు, దంతాలకు సంబంధించిన సమస్యల్ని వేపాకులు పూర్తిగా హెల్ప్ చేస్తాయనేది నిజం కాదని చెబుతున్నారు.


వేప బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీంతో వాపు తగ్గుతుంది. కానీ, చిగురువాపు అనేది పాచి, ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల వస్తుంది. ఇలాంటి వాటిని త్వరగా గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దీనికోసం వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో నోటిని క్లీన్ చేయడం, వేపనూనె రాయడం వల్ల కాస్తా రిలాక్స్ ఉంటుంది. కానీ, ట్రీట్‌మెంట్ చేయకపోవడం సరికాదు. కచ్చితంగా ట్రీట్‌మెంట్ చేసుకుంటే సమస్య తగ్గుతుందని డాక్టర్ చెబుతున్నారు


దంతాలు, చిగుళ్ల రక్షణలో వేపాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది డాక్టర్ ట్రీట్‌మెంట్ బదులు చేయడం సరికాదు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రొఫెషనల్ చెకప్స్, ట్రీట్‌మెంట్ ముఖ్యమైన డాక్టర్ కరుణ చెబుతున్నారు. ఇలాంటి చిగుళ్ల, దంత సమస్యలకి కేవలం వేపాకులు మాత్రమే పరిష్కారమని భావించొద్దొని డాక్టర్ చెబుతున్నారు.

ఇలాంటి వార్తల్ని నమ్మే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. వేపాకులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, అవే ట్రీట్‌మెంట్‌లా వాడొద్దు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్న సమయంలో ఇలాంటివి నమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేదంటే చాలా సమస్యలొస్తాయి. ఇక పరగడపున వేపాకుల్ని తీసుకుంటే చిగుళ్ల వాపు పూర్తిగా తగ్గుతుందనే వార్తలు నిజం కాదు. కానీ, దాని వల్ల రిలీఫ్ ఉంటుంది. కాబట్టి, ఇలాంటి విషయాల్లో కాస్తా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఏ వార్తలైనా సరే నమ్మే ముందు డాక్టర్స్, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Breathing Exercises Benefits Helth Tips

Breathing Exercises Benefits: లోతైన శ్వాస వ్యాయామాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.













Breathing Exercises Benefits: మెదడులోని శ్వాసకోశ కేంద్రం మన శ్వాసను నియంత్రిస్తుంది, ఇది స్వయం చాలక శారీరక చర్య. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు సంభవించే.. "ఫైట్-ఆర్-ఫ్లైట్ స్పందన" మన శ్వాస విధానాలు, రేట్లలో మార్పులకు కారణం అవుతుంది. అదృష్టవశాత్తూ, మనం శ్వాసించే విధానాన్ని మార్చే సామర్థ్యం మనకు ఉంది. శ్వాస వ్యాయామాలు ఒత్తడి, దానితో సంబంధం ఉన్న అరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి.. సహాయపడతాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. ధ్యానం, యోగా, తాయ్‌ చిలలో అనేక రకాలుగా.. శ్వాసను నియంత్రిస్తూ ఉంటారు. చాలామంది లోతైన శ్వాస వ్యాయామాలు.. ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని పెంపొందించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక రకాల, ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టడానికీ లోతైన శ్వాస వ్యాయమాలు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది..

శ్వాస వ్యాయామాలు రోజూ ప్రాక్టిస్‌ చేస్తే.. ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉందని నిపుణులు అంటున్నారు. డీప్‌ బ్రీత్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థను యాక్టివ్‌ చేస్తాయి. ఇవి శరీరం, మనస్సును శాంతపరచడానికి సహాయపడతాయి


ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది..

శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి, శరీరానికి ఆక్సిజన్ డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ఇది మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది..

లోతైన శ్వాస వ్యాయమాలు.. ఒత్తిడిని తగ్గిస్తాయి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. తద్వారా రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


శక్తి స్థాయిలు పెంచుతుంది..

లోతైన శ్వాస వ్యాయామాలు.. శరీరానికి ఆక్సిజన్‌ ప్రవాహాన్ని పెంచుతాయి. తద్వారా శరీర శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. లోతైన శ్వాస వ్యాయామాలు.. అలసటను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. మొత్తం శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.


దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి..

లోతైన శ్వాసవ్యాయామాలు.. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రోత్సహిస్తాయి, మనస్సును నిశ్చలంగా ఉంచుతాయి. తద్వారా శ్వాస వ్యాయామాలు దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. మానసిక స్పష్టత, శ్రద్ధ అవసరమయ్యే.. పనులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.


రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది..

లోతైన శ్వాసవ్యాయమాలు.. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడానికి తోడ్పడతాయి, తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇవి రోగనిరోధక ప్రతిస్పపందనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.


జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది..

లోతైన శ్వాసవ్యాయామాలు పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇది విశ్రాంతి, జీర్ణక్రియకు బాధ్యత వహిస్తుంది. లోతైన శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది, ఇది మెరుగైన గట్‌ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది..

శ్వాస వ్యాయామాలు కండరాల విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి, శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. దీర్ఘకాలిక నొప్పి, కండరాల దృఢత్వంతో బాధపడేవారికి లోతైన శ్వాసవ్యాయామాలు సహాయపడతాయి.


నిద్రను మెరుగుపరుస్తాయి..

లోతైన శ్వాసవ్యాయామాలు విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. లోతైన శ్వాస వ్యాయామాలు నిద్రవేళకు ముందు మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.