1000 Health Tips: Does eating nepaka on a regular basis reduce inflammation of the gums?:పరగడపున వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందా, డాక్టర్స్ చెప్పే నిజాలు తెలుసుకోండి

Does eating nepaka on a regular basis reduce inflammation of the gums?:పరగడపున వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందా, డాక్టర్స్ చెప్పే నిజాలు తెలుసుకోండి

 వేపాకుల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఈ నేపత్యంలోనే వేపాకులు తింటే చిగురువాపు తగ్గుతుందని ఓ వార్త హల్ చల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలుసుకోండి.







దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్నే కాపాడుతుంది. దంతాల ఆరోగ్యం బాగుంటే చిగుళ్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకూ దరిచేరవనే చెప్పొచ్చు. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలకి పరిష్కారంగా సోషల్ మీడియాలో చాలా నివారణలు ఉన్నాయి. వీటిలో ఒకటే.. ఉదయం పరగడపున వేపాకులు తినడం. ఇలా వేపాకులు తింటే చిగుళ్ల ఆరోగ్యం మెరుగ్గా మారుతుందని యూట్యూబ్‌లో ఓ వీడియోలో చెబుతున్నారు. ఇందులో నిజాలు తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ డాక్టర్‌ని సంప్రదించారు.

డాక్టర్ చెప్పేదేంటంటే

వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందన్న టిప్ గురించి డా.కరుణ మల్హోత్రా, కాస్మోటాలజిస్ట్ మాట్లాడుతూ వేపాకులు సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాల కారణంగా చిగుళ్ల ఆరోగ్యానికి కొన్ని రోజులుగా వాడుతున్నారు. దీనిని వాడడం వల్ల చిగురు వాపు తగ్గుతుంది. కానీ, చిగుళ్లు, దంతాలకు సంబంధించిన సమస్యల్ని వేపాకులు పూర్తిగా హెల్ప్ చేస్తాయనేది నిజం కాదని చెబుతున్నారు.


వేప బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీంతో వాపు తగ్గుతుంది. కానీ, చిగురువాపు అనేది పాచి, ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల వస్తుంది. ఇలాంటి వాటిని త్వరగా గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దీనికోసం వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో నోటిని క్లీన్ చేయడం, వేపనూనె రాయడం వల్ల కాస్తా రిలాక్స్ ఉంటుంది. కానీ, ట్రీట్‌మెంట్ చేయకపోవడం సరికాదు. కచ్చితంగా ట్రీట్‌మెంట్ చేసుకుంటే సమస్య తగ్గుతుందని డాక్టర్ చెబుతున్నారు


దంతాలు, చిగుళ్ల రక్షణలో వేపాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది డాక్టర్ ట్రీట్‌మెంట్ బదులు చేయడం సరికాదు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రొఫెషనల్ చెకప్స్, ట్రీట్‌మెంట్ ముఖ్యమైన డాక్టర్ కరుణ చెబుతున్నారు. ఇలాంటి చిగుళ్ల, దంత సమస్యలకి కేవలం వేపాకులు మాత్రమే పరిష్కారమని భావించొద్దొని డాక్టర్ చెబుతున్నారు.

ఇలాంటి వార్తల్ని నమ్మే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. వేపాకులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, అవే ట్రీట్‌మెంట్‌లా వాడొద్దు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్న సమయంలో ఇలాంటివి నమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేదంటే చాలా సమస్యలొస్తాయి. ఇక పరగడపున వేపాకుల్ని తీసుకుంటే చిగుళ్ల వాపు పూర్తిగా తగ్గుతుందనే వార్తలు నిజం కాదు. కానీ, దాని వల్ల రిలీఫ్ ఉంటుంది. కాబట్టి, ఇలాంటి విషయాల్లో కాస్తా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఏ వార్తలైనా సరే నమ్మే ముందు డాక్టర్స్, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.