1000 Health Tips

ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అసలు ఏ ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రెగ్నెంట్స్

pregnancy

​ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీట్‌రూట్ తినడం మంచిది. అయితే, ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకుని అంతే పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలొస్తాయి.

పిల్లలకి

child

మంచి కూరగాయలు అని చాలా మంది పిల్లలకి తినిపిస్తుంటారు. అయితే, నెలల వయసున్న పిల్లలకి బీట్‌రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజనింగ్‌లా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లల అంతేకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్‌రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

అలర్జీ

infection

ప్రతి ఒక్కరికీ అన్నీ కూరగాయలు పడవు. కొంతమందికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్‌రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలొచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ కాదు. కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదే విధంగా, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, అజీర్ణ సమస్యలున్నవారు ఈ వెజిటేబుల్‌ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

క్యాన్సర్ ఉన్నవారికి

cancer

బీట్‌రూట్ క్యాన్సర్స్‌కి ముఖ్యంగా, బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే, ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదే విధంగా, షుగర్ ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

లివర్ ప్రాబ్లమ్స్

liver problem

అదే విధంగా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం, బీట్‌రూట్‌లో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. అదే విధంగా, కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లోబీపి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి ట్యాబ్లెట్స్ వాడేవారు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీలో రాళ్లు

kidney stone

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆక్సలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల పెరిగేలా చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌ని అసలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మన చేతుల్తో చాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చేతుల పై క్రిములు మరియు బాక్టీరియా చేరుతుంటాయి. చేతులో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

మన చేతుల్తో చాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చేతుల పై క్రిములు మరియు బాక్టీరియా చేరుతుంటాయి. చేతులో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 

helth tips caress

మానవ శరీరం ఎంతో ప్రత్యేకమైంది. శరీరంలో ప్రతి భాగం తన పనిని నిర్వరిస్తుంది. అయితే, శరీరంలోని చాలా భాగాల్ని మనం చేతులతో తాకుతుంటాం. అది ఏ భాగమైనా సరే మనకు తెలియకుండానే చేతులతో టచ్ చేస్తుంటాం. అది అలవాటు లేదా పొరపాటు వల్ల కావచ్చు. అయితే, శరీరంలో కొన్ని భాగాలను చేతులతో పదే పదే తాకకూడదు. నిజానికి మన చేతులతో చాలా పనులు చేస్తుంటాం. తెలిసో లేదా తెలియక చాలా వస్తువుల్ని పట్టుకుంటాం. దీంతో చేతులపై క్రిములు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. ఈ చేతులతో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేతులతో శరీరంలోని ఏ భాగాల్ని తాకకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ముఖం:

శరీరంలో ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, దురద లేదా దదర్లు సమస్యలు రావడానికి కారణం పదే పదే మీరు చేతులతో ముఖంపై తాకుతున్నారని అర్తం. ఇది ఒక కారణం కావచ్చు. నిజానికి చేతులపై చాలా క్రిములు, ధూళి, బ్యాక్టీరియా ఉంటాయి. వీటి కారణంగా ముఖంపై అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. చేతుల్లో ఉండే సహజ నూనె ముఖం యొక్క రంధ్రాల్ని మూసివేసే ప్రమాదం ఉంది. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకుంటే చేతులతో పదే పదే తాకడం మానుకోండి.

చెవులు:

చాలా మంది చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం, చేతులతో చెవుల్ని టచ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే, ఈ చిన్న అలవాటు చాలా హానికరం. చెవుల లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలా చేతుల వేళ్లు పెట్టడం వల్ల ఏదైనా హాని జరిగే ప్రమాదం ఉంది. చేతులపై బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు గొంతు వరకు వ్యాపించి మరింత ప్రమాదాన్ని కలిగించవచ్చు. అందుకే చేతులతో పదే పదే చెవుల్ని టచ్ చేయకండి.

పెదవులు, నోటి లోపల భాగం

చాలా మందికి తెలియకుండానే చేతులు పెదవులు, నోటి లోపల భాగాలకు వెళుతుంటాయి. తినేటప్పుడు సాధారణంగా మనం చేతుల్ని శుభ్రపర్చుకుంటాం. కానీ, మిగతా సమయాల్లో అంతగా క్లీన్ చేసుకోం. కానీ, నోటిలోకి వేళ్లు పెట్టుకుంటారు. చాలా మంది తిన్న తర్వాత నోటిలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి చేతి వేళ్లను ఉపయోగిస్తారు. అయితే, ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా నోటిలో వేళ్లు పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు కడుపులోకి చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కళ్లు:

కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగం. అందుకే వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది వ్యక్తులు తమ చేతులతో పదే పదే కళ్ళను తాకుతుంటారు. అంతేకాకుండా దురద వల్ల కళ్లను రుద్దుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్లలోకి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. నిజానికి చాలా కంటి ఇన్ఫెక్షన్లు ఇలా పదే పదే చేతులతో తాకడం వల్ల వస్తాయి.

ముక్కు:

ముక్కులో వేలు పెట్టడం చెడుగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. ముక్కును పదే పదే టచ్ చేసే వ్యక్తులు ఎక్కువగా అనారోగ్యంతో ఉంటారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చేతి వేళ్లతో ముక్కును శుభ్రపర్చుకోవడం మానుకోండి. ముక్కును శుభ్రం చేసుకోవలసి వస్తే శుభ్రమైన గుడ్డ లేదా రుమాలు సాయం తీసుకోండి. ఇలా ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల స్టెఫిలోకాకస్ అరియస్ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మలద్వారం:

చేతులతో మలద్వారాన్ని కూడా టచ్ చేయకూడదంటున్నారు నిపుణులు. దురద పుట్టడం వల్ల లేదా చెమట పట్టడం వల్ల చాలా మంది మలద్వారాన్ని టచ్ చేస్తుంటారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం. చేతులతో మలద్వారాన్ని టచ్ చేయడం ద్వారా చేతులపై బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మలద్వారాన్ని చేతులతో తాకడం మానుకోండి.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.



Pumpkin Seeds benefits of eating pumpkin seeds include boosting bone health, sexual gumadi kaaya ginjalu

 Pumpkin Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా సరైన టైమ్ కి ఆహారమైన నిద్ర అయినా ఉండడం లేదు. దీనికి గల కారణం వారి బిజీ లైఫ్ లో వచ్చే జీవనశైలిలో మార్పులు.

gumadi kaaya
helthtipscaress


మరి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. వీటన్నిటికీ సమాధానం… గుమ్మడికాయ గింజలు. అవును… గింజలను తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నాణ్యత మైన నిద్రను కూడా పొందవచ్చు. ఈరోజుల్లో నాణ్యతమైన నిద్ర ఎవరికి కూడా లేదు. కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అటువంటి సుఖమైన నిద్రనివ్వగలిగే శక్తి. ఈ గుమ్మడి గింజలకు ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలలో గుమ్మడి గింజలు కూడా మొదటి స్థానం దక్కింది. కా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గుమ్మడి గింజలు సహాయపడతాయి. శరీరాన్ని నిర్విషికరణ చేయటానికి కూడా ప్రత్యేకంగా సహాయపడుతుంది. గింజలలో ఎన్నో పోషకాలు కూడా దాగి ఉన్నాయి. తీసుకుంటే ఒక నిద్ర కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…


Pumpkin Seeds : మంచి నిద్ర కావాలా… అయితే నిద్రకు ముందు ఒక్క స్పూన్ ఈ గింజలు తిన్నారంటే… హాయిగా నిద్రిస్తారు…?

ఇప్పుడు చాలామంది కూడా ఒబేసిటీ తో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ గుమ్మడి గింజలు ఒక అద్భుతమైన ఔషధం. వీటిల్లో చియా గింజలు, అవిసె గింజలు, జనపనార గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు అన్నీ కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా శరీరాన్ని బరువు తగ్గించుకొనుటకు, ఇంకా శరీరాన్ని నిర్వీకరణ చేయటానికి ఎంతో దోహదపడుతుంది. వీటన్నిటిలో కూడా గుమ్మడి గింజలు చాలా పోషకాలను కలిగి ఉన్నాయి. తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విత్తనాలను రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ తింటే చాలు మీ శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ గింజలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల వల్ల రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది. ఉండే సక్రమంగా పనిచేయగలదు.


ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉంటాయి. (LDL) వంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్ట్ ఆఫ్ ఆన్ అనే ఏమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది సెరటోనిన్, మెలతోనిన్ అనే శరీరం సహజనిద్ర హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజు కూడా పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తింటే మంచి నాణ్యత మైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇందులో మెగ్నీషియం కండరాలు, నరాలను మరింత సడలింప చేస్తుంది. ఈ విత్తనాలలో జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి కూడా పెంచబడుతుంది. ముఖ్యంగా జింకు నరాల సిగ్నలింగ్, మెదడు అభివృద్ధిలో కూడా ముఖ్యపాత్రను పోషించగలదు. గుమ్మడికాయ గింజల్లో జింక్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. జింకు గాయాలను నయం చేయగలదు. ఇంకా జలుబుతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. ఇంకా విటమిన్ E ఏంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాపులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

vitaminD hair fall sun set sweat pain శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

 శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి రోజుకు 20-40 ఎంజీ/ఎంఎల్ విటమిన్ డి అవసరం. ఈ స్థాయి తక్కువగా ఉంటే, అది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు.

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

helthtipscaress


భరించలేని కండరాల నొప్పి.

విటమిన్ డి లోపం వల్ల కండరాల నొప్పి వస్తుంది. చాలా మంది దీనిని అలసిపోతున్నట్టుగా భావిస్తారు. ఇది సహజమే అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అది మీరనుకునేంత తేలికైనది కాకపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే, మీరు వెంటనే అప్రమత్తం కావాలి.


ఆందోళన, ఒత్తిడి కలుగుతుందా..

వేసవిలో చెమటలు పట్టడం సహజమే, కానీ మామూలు సమయాల్లో మీ నుదిటిపై అనుకోకుండా చెమట కనిపించడం గమనించినట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి మరియు మెదడు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన మరియు నిరాశ కలుగుతాయి.


జుట్టు రాలడం:

విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. చాలామంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు. అయితే, ఇది విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవించవచ్చు. ఈ విటమిన్ లోపం తలపై ఫోలికల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా, జుట్టు సమస్యలు మొదలవుతాయి. విటమిన్ డి లోపం యొక్క లక్షణాలలో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం వల్ల ఉబ్బరం, విరేచనాలు మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.


విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి..

విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుందని దాదాపు అందరికీ తెలుసు. రోజుకు 15-30 నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. ఉదయం 7-10 గంటల మధ్య వచ్చే సూర్యకాంతి మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, మీరు మీ ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే చేపలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్డు సొనలు మరియు తృణధాన్యాల ఆహారాలు. సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

Gangavalli kura Benefits in Helthy Food.ఈ ఆకుకూరను తింటే ఎన్నో వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

 Gangavalli kura Benefits in Telugu : మనలో కొంతమందికి గంగవాయిల కూర గురించి తెలుసు. దీనిని కూర, పచ్చడిగా చేసు కుంటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఈ ఆకుకూరను తింటే ఎన్నో వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

 Gangavalli helth tips

ఈ మొక్క పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకు కూరలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తినని వారు కూడా తింటారు. ఈ మొక్కను ఒకసారి వేసుకుంటే సులభంగానే పెరిగిపోతుంది. పెద్దగా సంరక్షణ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకులలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.


అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఆరోగ్యకరమైన కణ విభజనకు మద్దతు ఇస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి కొల్లజెన్ రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచటానికి సహాయపడుతుంది. దీనిలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ ని తరిమి కొట్టడానికి సహాయపడుతుంది

 

దాంతో ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాల్షియం,మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు పెళుసుగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం ఎముకల కణాల పెరుగుదలను ప్రభావితం చేసి ఎముకలు బలహీనంగా లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

 

వారంలో రెండుసార్లు ఈ ఆకు కూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది. చాలా తక్కువ ఖర్చులో ఎన్నో పోషకాలు కలిగిన ఈ ఆకుకూరను తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఈ కాలంలో చాలా విరివిగా లభ్యం అవుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఈ కూరను తినటానికి ప్రయత్నం చేయండి.


గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

raagulu jonnalu sajjalu helty food protins/ రాగి, జొన్నలు, సజ్జలు - ఈ మూడూ చిరు ధాన్యాలు , ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు. కానీ మనం వాటిని ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే, వాటి పోషక విలువలు భిన్నంగా ఉంటాయి.

 రాగి, జొన్నలు, సజ్జలు - ఈ మూడూ చిరు ధాన్యాలు , ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు. కానీ మనం వాటిని ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే, వాటి పోషక విలువలు భిన్నంగా ఉంటాయి.

ఈ మూడు ధాన్యాలలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

raagulu jonnalu sajjalu helth tips


రాగులు (ఫింగర్ మిల్లెట్): రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ధాన్యం కాబట్టి డయాబెటిక్ రోగులు కూడా దీనిని తినవచ్చు. అలాగే, మీరు బరువు తగ్గాలనుకుంటే, రాగులు తీసుకోవడం మంచిది. చనుబాలివ్వడం వల్ల తల్లిపాలు ఇస్తున్న మహిళలకు కూడా ఈ ధాన్యం మంచి ఎంపిక.

జొన్న: ఫైబర్,ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే జొన్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ధాన్యంగా చెప్పువచ్చు. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ముఖ్యం. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అలెర్జీలను నివారించడంలో సహాయపడుతుంది.

పెర్ల్ మిల్లెట్:పెర్ల్ మిల్లెట్ ఇనుము, మెగ్నీషియం అధికంగా ఉండే ధాన్యం. దీన్ని తినడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. ఇది రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. ఇది చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీని వినియోగం మధుమేహంలో ప్రయోజనకరంగా ఉంటుంది.


ఏ ధాన్యం అత్యంత ఆరోగ్యకరమైనది?

కాల్షియం అధికంగా ఉండే రాగులు ఎముకలకు ఉత్తమ ఎంపిక. జొన్నలు (జొన్నలు) మధుమేహ రోగులకు ప్రయోజనకరమైన ధాన్యం. అదేవిధంగా, శక్తి , రక్తహీనత కోసం మిల్లెట్ తినాలి. బరువు తగ్గడానికి రాగి, జొన్న ధాన్యాలు రెండింటినీ తీసుకోవడం మంచి ఎంపిక. ఇనుము, శక్తి అవసరమైతే, మిల్లెట్ మంచిది. అంటే ఈ మూడు ధాన్యాలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఈ మూడింటినీ ఆహారంలో కలిపి తినడం చాలా ప్రయోజనకరం.

hair fall helth tips articles sleeping men woman

 జుట్టు రాలుటకు కారణాలు: పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం.

hair fall helthtips


నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాలడం జరుగుతుంది.


నివారణకు జాగ్రత్తలు: జుట్టు నిర్మాణానికి, అది ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే అధికంగా ఉంటుంది. కావున ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. సబ్బులను డాక్టర్‌ సలహామేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్ళలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.


బయటకు వెళ్ళేటప్పుడు తలకు టోపీ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసు కోకూడదు. మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలుటపై ప్రభావం చూపు తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగా, వ్యాయామం విధిగా చేయాలి.