కాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కాలు తెలుసుకుందాము.
సహజముగా వయస్సు పెరిగే కొద్దీ కాళ్ళు నొప్పులు రావటము సహజము. అలాగే యుక్త వయస్సు లో కూడా ఎక్కువ సేపు నిలబడటం. అంటే కాకా బాగా నడవటం వ్యాయామము ఎక్కువగా చేయటం వంటి కారణములతో కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశములు ఎక్కువ గా ఉన్నాయి.
అంతే కాకా పోషక ఆహార లోపాలు ఉన్న కాళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు ఎలా వచ్చిన సరే కొన్ని సహజసిద్దమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.
కాళ్ళ నొప్పులు తగ్గటానికి అద్భతమైన ఇంటి చిట్కాలు తెలుసుకుందాము.
- కాళ్ళ నొప్పులు,ఇంకా కీళ్ల నొప్పులు లవంగ నూనె చాల అద్భుతముగా పని చేస్తుంది. నొప్పి ఉన్న ప్రతములో లవంగ నూనె ను రాసి పది నిముషాలు పాటు మసాజ్ చేయాలి.
- ఐస్ ముక్కలు చిన్నగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసి నొప్పి ఉన్న ప్రాంతములో మసాజ్ చేయాలి.
- ఈ విధముగా పది నిముషాలు పాటు చేస్తే సరిపోతుంది. ఐస్ ముక్కలు నొప్పులకు తగ్గించటంలో చాల చక్కగా పనిచేస్తుంది.
- ఒక్క బకెట్ లో వేడి నీటిని తీసుకొని నుండి మూడు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ కలపాలి. ఆ బకెట్ లో కళ్ళను 10 నుండి 16 నిముషాలు పాటు ఉంచాలి.
- కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే మాయిశ్చరైజేడ్ క్రీం లను పాదాలకు రాయాలి. దింతో పాదాలు మృదువు మారటమే కాకా కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో రెండు స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ మిశ్రములో దాదాపు ఒక 20 నిముషాలు పాటు కళ్ళను నానబెట్టాలి.
ఈ విధముగా చేయటము వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.