1000 Health Tips: white rice helthy tips:బియ్యము తో వండుకునే అన్నము వలన కలిగే అపోహలు వాస్తవాలు తెలుసుకుందాము.

white rice helthy tips:బియ్యము తో వండుకునే అన్నము వలన కలిగే అపోహలు వాస్తవాలు తెలుసుకుందాము.

 బియ్యము తో వండుకునే అన్నము వలన కలిగే అపోహలు వాస్తవాలు తెలుసుకుందాము.








మన దేశములో చాల వరకు మనము అన్నము తీసుకుంటాము. అన్నములో కూరలు,ఇంకా పెరుగు కలుపుకొని తీసుకుంటుంటారు. 
అయితే అన్నము పట్ల ఎన్నో అపోహలు వస్తూఉంటాయి. ప్రతి రోజు అన్నము తీసుకోవటం వలన శరీరము లో ఉండే కొవ్వు చేరుతుందా. ఇంకా మధుమేహము ఉన్నవారు ఎక్కువగా అన్నము ని తీసుకోకూడదా. అని ఎన్నో అపోహలు ఉన్నాయి. 
అన్నము పట్ల ఉన్న అపోహలు-వాస్తవాలు,ఇప్పుడే వాటి గురుంచి వివరముగా తెలుసుకుందాము. 
బియ్యములో ఎక్కువగా గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది అని అనుకుంటారు. 
కానీ బియములో గ్లూటెన్ ఉండదు. ఇటువంటి ప్రోటీన్ గోధుమలు,బార్లీ,ఔట్స్ మొదలైన వాటి లో ఉంటుంది. 
ఒక వేళా గ్లూటెన్ ఉంటె ఆ పదార్థం కి నీరు తగిలినప్పుడు సాగుతుంది. అందువలన అన్నమును తీసుకోవచ్చు. అన్నము తీసుకోవటం వలన శరీరానికి కొవ్వు చేరే అవకాశము లేదు. 
బియ్యములో పిండి పదార్దములు మాత్రమే ఉంటాయి. ప్రోటీన్స్ అనేవి ఉండవు అని చాల మంది బావిస్తూఉంటారు. 
అయితే ఒక కప్పు బియములో మూడు నుండి నాలుగు గ్రాములు ప్రోటీన్స్  ఉంటాయి. ఇవి శరీరానికి నిర్మాణానికి దోహదపడతాయి. 
చాల వరకు బియ్యములో ఉప్పు ఎక్కువగా ఉంటున్ది అని అనుకుంటారు. కేవలం కొద్దీ మొత్తదులో సోడియం ఉంటుంది. అయినా అది పెద్దగా లెక్కలోకి రాదు. 
రాత్రి సమయములో అన్నం తీసుకుంటే ఎక్కువ బరువు పెరుగుతామని చాల మంది తీసుకోవటం మానేస్తారు. 
కాకపోతే రాత్రి సమయములో అన్నము తీసుకోవటం వలన లెప్టిన్ అనే హార్మోన్ విడుదల అయి శరీరములో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. దానితో పాటు శరీరములో కొవ్వు కూడా చేరదు. 
అందువలన రాత్రి సమయములో అన్నము తీసుకోవటం వలన ఎటువంటి ప్రమాదం లేదు.