ఉల్లిపాయ తొక్కలు పారవేస్తున్నారా!వాటి వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయే మీకు తెలుసా.
ప్రతి రోజు మనము ఉల్లిపాయలు వాడుతూ ఉంటాము. కూరల్లో ఉల్లిపాయ కూరలో లేకుండా అసలు గడవదు. అదేవిధముగా కొంత మందిని పచ్చి ఉల్లిపాయను పచ్చడిలో నంచుకుని తీసుకుంటూ ఉంటారు. మరి కొంత మందిలో మజ్జిగ లో ఉల్లిపాయను వేసుకొని త్రాగుతూ ఉంటారు.
అయితే ఉల్లిపాయ తొక్కలు పారవేయడం చేస్తూ ఉంటాము. వాటివలన ఎన్ని లాభాలు ఉన్నాయే మీకు తెలుసా. వాటి గురుంచి తెలిస్తే చాల ఆశ్చర్యపోతారు. వాటి గురుంచి వివరంగా తెలుసుకుందాము.
ఉల్లిపాయ తొక్కలను రాత్రి అంత నీటిలో నానబెట్టిన మరుసటి రోజు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఈ నీటిని చర్మానికి రాసుకొని ఒక అరగంట అయినాక స్నానము చేస్తే శరీర చర్మము సమస్యలు తగ్గిపోతాయి.
ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిలో ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు మరియు గుమ్మాలు వద్ద పెడితే దోమలు ఇంటిలోకి రావు ఉల్లి ఘాటుకు దోమలు పారిపోతాయి.
ఉల్లిపాయ తొక్కలను మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తలకు పట్టించి ఒక పావు గంట తరువాత తేలికపాటి షాంపూ తో స్నానము చేస్తే తలకు చుండ్రు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఉల్లిపాయ తొక్కలతో సూప్ చేసుకొని త్రాగటం వలన శరీరములో చేదు కొలస్ట్రాల్ తొలగిపోతుంది.
దాంతో గుండె జబ్బులు రాకుండా ఉండటానికి అధిక బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. ఈ సూప్ యాన్తి బయోటిక్,యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేయటం వలన ఇన్ఫెక్షన్స్ రావు.