కాలి పాదాలు ఆకర్షణీయంగా అందముగా కనపడటానికి ఇంట్లోనే మంచి చిట్కాలు.
చాల మంది మహిళలు ముఖానికి తీసుకునే జాగ్రత్తలు పాదాలకు తీసుకోరు. అలాగే చేతులకు కూడా శ్రద్ద బాగానే పెడతారు. పడాల దగ్గరకు వచ్చే సరికి సరైన శ్రాధ పెట్టారు. కానీ రోజువారీ పనులకి బిజీగా ఉండటం వలన పాదాలపై పెద్దగా శ్రద్ధగా పెట్టారు.
పాదాలు ఆకర్షణీయముగా అందముగా కనపడటానికి ఇంటి చిట్కాలు.
పాదాల పై శ్రాధ పెట్టకపోతే తేమ తగ్గిపోయి రఫ్ గా కనిపిస్తాయి. అందువలన పాదాలపై కొంత శ్రద్ధ పెడితే మంచిది. ఇప్పుడు పాదాలు అందముగా ఆకర్షణీయముగా కనపడటానికి ఇంటి చిట్కాలు గురించి తెలుసుకుందాం. మజ్జిగలో కొంచెం పసుపు రాసి రెండు పాదాలకు రాసి నిర్ణ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చేసుకుంటే మంచి ఫలితాలు కనపడుతాయి.
అయితే ఈ విధముగా వారములో రెండు సార్లు చేస్తూ ఉండాలి.
ఒక స్పూన్ శనగపిండి లో అరస్పూన్ తేనే ఒక అర స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి పస్తేగా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుబ్రము చేసుకోవాలి. ఈ విధముగా వారములో మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితాలు కనబడుతాయి.
రెండు స్పూన్ల పైనాపిల్ జ్యూస్ లో ఒక అరస్పూన్ తేనే కలిపి పాదాలకు రాసి అయిదు నిముషాలు పాటు సున్నితముగా మసాజ్ చేసి పాదాలకు బాగా రక్త ప్రసరణ జరిగి పాదాలు ఆరోగ్యగముగా అందముగా కనబడతాయి.
బేకింగ్ సోడా పాదాలు మురికిని వదిలించటానికి చాల సమర్ధవంతముగా పనిచేస్తుంది.
బేకింగ్ సోడా లో నీటిని పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసి ఆరిన తరువాత చల్లని నీటిలో శుభ్రం చేసుకోవాలి.