ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.
సాధారణంగా చాల మందిలో ఉందయం లేవగానే టీ కానీ కాఫి కానీ తీసుకుంటారు. మరి కొంత మంది టీ లేక కాఫి బదులుగా మజ్జిగ తీసుకుంటారు. అయితే మజ్జిగ తీసుకునే వారిలో శరీరములో జరిగే మార్పులు కలిగే ప్రయోజనాలు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.
ప్రతి రోజు ఉదయం పరగడుపున మజ్జిగ తీసుకోవటం వలన మంచి ఫలితాలు. ఉంటాయి. ప్రతి రోజు ఉదయం పూట మజ్జిగ త్రాగటం వల్లన జీర్ణ సమస్యలు లేకుండా రోజు అంత హాయిగా గడిపోతుంది. అస్సలు కడుపులో మంట గ్గా ఉండటం,గ్యాస్ ACDT ,అల్సర్ సమస్యలు ఉన్నవారు ఉదయం పరగడుపున మజ్జిగ త్రాగటం వలన సమస్యలు ఇబ్బందులు పడుతున్నవారికి సమస్య లు చాల వరకు తగ్గే అవకాశం ఉంది.
మజ్జిగ లో ఉన్న పోషకాలు మన శరరీరానికి అన్ని రకాలుగా ఉపయోధపడతాయి.
మజ్జిగ తీసుకోవటం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టరియా నశించి మంచి బ్యాక్టరియా వృద్ధి చెందుతుంది. జీర్ణశయంలో సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఇంకేకాక మలబద్దకం.అజీర్ణం, గ్యాస్ సమస్యలు చాల వరకు తగ్గు ముఖము పడతాయి.
మజ్జిగలో ఒక అరస్పూన్ మిరియాలు పొడి మూడు కరివేపాకులు వేసుకొని త్రాగితే రక్తములో చెక్కరస్ధాయి తగ్గటమే కాకుండా శరీరం లో అధికముగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.
మజ్జిగలో ఒక అరస్పూన్ అల్లం రసం కలుపుకొని త్రాగటం వలన విరోచనాలు తగ్గుతాయి.
ఇదేకాక ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమస్య కూడా చాలావరకు తగ్గిపోతుంది. కాబ్బటి మజ్జిగను త్రాగటం వలన మాత్రం మరిచిపోవద్దు.
రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ త్రాగటం వల్లన రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు ఉన్నవారు మాత్రమే ఉప్పు మజ్జిగలో వేసుకోకూడదు. మిగతావారు మజ్జిగలో ఉప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం రక్తపోటు పెంచుకుంటుంది.