ఎక్కువ గా AC గదుల్లో గడుపుతున్నారా! తస్మాత్ జాగ్రత్త
ఎండ కాలం వస్తే చాలు ప్రతి ఒక్కరు ఎండలో బయటకు రాకుండా AC గదుల్లో నే సమయం గడిపేస్తారు.
అయితే మనకు తెలియని విషయం తెలుసుకుందాం. AC గదుల్లో ఎక్కువ సమయం గడుపుతున్నపుడు మనకు తెలియకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, వాటి గురుంచి సాధ్యమైనంత వరకు తెలుసుకుందాం.
- AC గదుల్లో ఎక్కువగా సమయం గడపటం వలన చర్మము పొడిగా మారుతూ ఉంటుంది.
- ఎక్కువ సేపు AC గదుల్లో ఉంది ఒక్కసారిగా ఎండ లోకి వెళ్ళటం వలన చర్మము పొడిగా అవుతుంది, చర్మము పొడి తత్త్వం కలవారు ఉంటె ఈ సమస్య ఇంకా ఎక్కువ గా ఉంటుంది.
- AC గదుల్లో కళ్ళు పొడిగా ఉండేవారు AC గదుల్లో ఎక్కువ సేపు ఉండకూడదు.
- AC గదుల్లో ఉండటం వల్ల కంటీ లో ద్రవాలు పొడి బారి పోయే సమస్య ఉన్నవారు అసలు AC లో ఎక్కువ సేపు ఉండకూడదు. అలాగని ఎక్కువ సేపు సమయం గడపటం వలన సమస్య ఎక్కువగా అవుతుంది.
- AC గదుల్లో తేమ శాతం తక్కువగా ఉండటం వలన శరీరం డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. విపరీతమైన దాహం అవుతూ ఉంటుంది.
- AC గదుల్లో ఎక్కువగా ఉండటం వలన ముక్కు,గొంతు,కళ్ళు ఇంకా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
- ముక్కు రంద్రాలు మూసుకుపోయి. ముక్కు లోపలి భాగం లో ఉండే మ్యూకస్ పోరా వాపు కు గురి అయి ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. AC గదుల్లో ఆస్తమా ఇంకా ఎలర్జీ ఉండేవారు అసలు ఉండకూడదు. కాదు అంటే సమస్య మరి ఎక్కువ గా అవుతాయి.
- AV గదుల్లో గడిపే వారికి ఎక్కువగా తల నొప్పి వస్తుంటుంది. అది ఎక్కువగా మేగ్రోన్ కి దారి తీసే అవకాశం ఉంది.