Post Office Schemes: ఒకేసారి చేతికి రూ.16 లక్షలు.. రోజుకు రూ.100 పొదుపు చేస్తే చాలు.. పోస్టాఫీస్‌లో అదిరే పథకం!
పోస్ట్ ఆఫీస్ అంటేనే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ఉంటాయి. చాలామంది ఎలాంటి పథకం చేస్తే లాభం చేకూరుతుందో తెలియదు. ఇందులోనే భాగంగా ఈ మధ్య రికరింగ్ రిటర్న్స్ అనే స్కీమ్ వచ్చింది.
దీనిపైన పోస్ట్ మాన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా హెడ్ పోస్ట్ మాన్ మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్‌లో ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయని, రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. దీనికి ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ ఉంటుందన్నారు. ఉదాహరణకి నెలకి రూ.1000 చొప్పున ఒక వ్యక్తి జమ చేస్తే ఐదు సంవత్సరాలకు 60000 అవుతుంది. దానికి గవర్నమెంట్ 11,300 రూపాయలు కలిపి ఐదు సంవత్సరాల తర్వాత 71000 ఆ వ్యక్తికి అందిస్తుందన్నారు.
ఇదే కాకుండా అనేక రకాలైన పొదుపు పథకాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న పథకం సుకన్య యోజన. ఈ పథకం కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు వర్తిస్తుందన్నారు. ఈ పథకం 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకాన్ని 15 సంవత్సరాల వరకు డబ్బులు కట్టాలని దీనికి ఎక్కువ మొత్తంలో 8.2 శాతం వడ్డీ వస్తుందన్నారు.ఈ పథకంలో 250 నుండి మొదలుకొని ఏడాదికి 1,50,000 వరకు కట్టవచ్చు అన్నారు.
మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత దీన్ని వడ్డీతో కలిపి చాలా మొత్తం వరకు తిరిగి అందిస్తారన్నారు. ఉదాహరణకు రోజుకు రూ.100 పొదుపు చేసి.. పోస్టాఫీస్‌కు వెల్లి ఆ డబ్బులు నెల చివరిలో పొదుపు చేస్తే.. నెలకు రూ. 3 వేలు కట్టినట్లు అవుతుంది. ఇలా చేస్తే మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.16 లక్షలకు పైగా వస్తాయి. ఇది ఆడపిల్ల తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడే స్కీమ్ అని, దీని ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతాయని హెడ్ పోస్ట్ మాస్టర్ తిరుపతి లోకల్ 18 కు వివరించారు.
No comments:
Post a Comment