1000 Health Tips

కరక్కాయ వలన శరీరానికి ఎన్ని ఉపయోగాలు తెలుసా.

 ఆయుర్వేదములో కరక్కాయ  కూడా ఒక మూలికా ఇంకా జీర్ణక్రియకు సంబందించి వాడతారు. రోగనిరోధక శక్తీ ని పెంచడం లో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కరక్కాయ లో కలిగి ఉంది. కరక్కాయ ను పొడి చేసుటకొని, గోరువెచ్చని నీరు లో కొంచెం తేనే కలిపి  వలన మలబద్దకం,జీర్ణ సమస్యలు ఇంకా దంత సమస్యలకు ఇంకా కొన్ని  రకాల  సమస్య వ్యాధులకు ఉపయోగిస్తారు. 


  1. జీర్ణ సమస్యలు: కరక్కాయ పొడి ఇది పెద్దప్రేగు ను శుబ్రము చేసే పదర్దము. ఇది మలబద్దకం,అపానవాయువు,పూతలా,మూలా వ్యాధి ఇంకా ఆహార విషప్రయోగానికి కరక్కాయ సహాయపడుతుంది. 
  2. దంత సంరక్షణ: దంత చిగుళ్లు వదులుగా ఉండటం లేక రక్తస్రావం రావటం ఇటువంటి దంత సమస్యలు పరిష్కరిస్తుంది. 
  3. బరువు తగ్గటం: బరువు తగ్గటానికి కరక్కాయ పొడి చాల మంచిది. 
  4. రోగ నిరోధక శక్తీ.: రోగ నిరోధక వ్యవస్దను మెరుగుపరచడంలో కరక్కాయ పొడి ఉపయోగిస్తారు. 
  5. చర్మము జుట్టు స,సమస్యలు : 

చలికాలంలో వాడిపోయిన కరివేపాకు మొక్కకు తిరిగి జీవం నింపే చిట్కాలు, పాటిస్తే ఏపుగా, గుబురుగా పెరుగుతుంది

 కరివేపాకు.. ప్రతి వంట్లో ఉండాల్సిందే. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని కరివేపాకుల్ని నమిలితే జీర్ణక్రియ మెరగవుతుంది.

జీవక్రియ వేగవంతం అవుతుంది. కాలేయం క్లీన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక, కరివేపాకు మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు. కరివేపాకు మొక్క సరిగ్గా పెరగకపోతే కొన్ని చిట్కాలు బాగా పనిచేస్తాయి.



శీతాకాలంలోని వాతావరణం మొక్కలకు సవాల్‌తో కూడుకుంది. అందుకే మొక్కలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెరిగిన చలి, తక్కువ సూర్యకాంతి, తేమ లేకపోవడం వల్ల మొక్కలు త్వరగా వాడిపోతాయి. మొక్కల ఆకులు రంగు మారిపోవడం, ఎండిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక, కరివేపాకు మొక్క కూడా చలికాలంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. ప్రతి ఇంట్లో దాదాపు ఉండే మొక్క ఏదైనా ఉందంటే అది కరివేపాకే.


మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో కరివేపాకు మొక్క పసుపు రంగులోకి మారుతుంది. ఆకులు రాలిపోవడం లేదా అస్సలు పెరగకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మీ పెరట్లో లేదా ఇంట్లోని మొక్క కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటుంటే.. కొన్ని చిట్కాలు బాగా పనికొస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తగినంత సూర్యకాంతి ముఖ్యం 

శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల కరివేపాకు మొక్క ఎక్కువగా ప్రభావితమవుతుంది. మొక్క నిరంతరం నీడలో ఉంటే, దాని ఆకులు బలహీనంగా, పసుపు రంగులోకి మారి, రాలిపోవడం ప్రారంభిస్తాయి. మొక్కను కనీసం 5-6 గంటల సూర్యరశ్మి లభించే ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నించండి.


మీ ఇంటి బాల్కనీకి తక్కువ సూర్య రశ్మి లభిస్తే అలర్ట్ అవ్వండి. మొక్కను ప్రతిరోజూ కొన్ని నిమిషాలు టెర్రస్ లేదా తగినంత సూర్యరశ్మి ఉన్న మరొక ప్రదేశానికి మార్చండి. సూర్యరశ్మి లభించిన తర్వాత, మొక్కలో కొత్త ఎనర్జీ వస్తుంది.



నీరు విషయంలో జాగ్రత్త 

శీతాకాలంలో నీరు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో మొక్కలకు తక్కువ నీరు అవసరం. ఎందుకంటే నేల తేమగా ఉంటుంది. అందుకే మొక్క నేల నెమ్మదిగా ఎండిపోతుంది. దీని వల్ల ఎక్కువగా నీరు పెట్టడం వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోతాయి.


అందుకే నీరు పెట్టేటప్పుడు మట్టిని తనిఖీ చేయండి. నేల పొడిగా ఉంటేనే నీరు పెట్టండి. అధికంగా నీరు పెట్టడం వల్ల మొక్క బలహీనపడి కుంగిపోతుంది. అందుకే అవసరమైన సమయాల్లో తక్కువ మోతాదులో నీరు అందించండి.



సరైన నేల మిశ్రమం చాలా ముఖ్యం 

కరివేపాకు మొక్క పోషకాలు ఎక్కువగా ఉన్న నేలలో బాగా పెరుగుతాయి. అందుకే మట్టిని ఎండిన ఆవు పేడతో కలపండి. కావాలంటే వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేయండి. దీంతో, నేలకు తగిన పోషకాలు లభిస్తాయి. ఇది కరివేపాకు మొక్కకు తగినంత పోషణ అందుతుంది. ఇలా చేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది.



ఎరువులు ముఖ్యం 

కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఐరన్ అవసరం కావచ్చు. దీనిని సేంద్రియ ఎరువులు అందించగలవు. రసాయన ఎరువులు మొక్కను దెబ్బతీయవచ్చు. అందుకే ఇంట్లోనే సహజమైన, సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. బియ్యాన్ని తేలికగా రుబ్బి నీటిలో నానబెట్టండి. నీటిని వడకట్టి, బియ్యాన్ని ఒక కంటైనర్‌లో నిల్వ చేసి, మీ కరివేపాకు మొక్కలకు జోడించండి.


పులియబెట్టిన మజ్జిగను కూడా కరివేపాకు మొక్కకు పోయవచ్చు. వేప ఆకుల్నిఎండబెట్టడం ద్వారా కరివేపాకు మొక్కకు సహజ ఎరువు అందించవచ్చు. ఇందుకోసం ఆకుల్ని పూర్తిగా ఆరబెట్టి పొడిని సిద్ధం చేయండి. ఈ పొడిని మట్టిలో తవ్వి కలపండి. ఇవి మొక్కకు తగిన పోషకాలు అందించి.. ఏపుగా, గుబురుగా పెరిగేలా చేస్తాయి.



తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

​కరివేపాకు మొక్క చిన్న చిన్న తెల్ల పువ్వుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పువ్వులు మొక్క పెరుగుదలను అడ్డుకుంటాయి. మొక్క వాడిపోతుంటే.. ఈ పువ్వుల్ని కత్తిరిచడం చాలా ముఖ్యం.

​కరివేపాకు మొక్క చాలా పొడవుగా పెరుగుతుంటే, ముందుగా కాండం మధ్యలో కత్తిరించండి. దీనివల్ల కాండం రెండుగా విడిపోతుంది. అక్కడ నుంచి కొత్త ఆకులు మొలకెత్తుతాయి. అలాగే, మూడు కొమ్మలు పెరిగే కాండం కత్తిరించండి. ఇది కరివేపాకు మరిన్ని కొమ్మలు మొలకెత్తడానికి ప్రోత్సహిస్తుంది.

గమనిక:-

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. వీటిని పాటించేముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం శ్రేయస్కరం. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.



Health Tips: ప్రపంచంలో కెమికల్స్ ఉండని రెండు పండ్లు ఇవే.. కళ్లు మూసుకుని హాయిగా తినొచ్చు

 


ఇప్పుడు ఉన్న ప్రపంచం లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఒక సవాలుగా మారింది. డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినమని సూచిస్తూ ఉంటారు.

కానీ ప్రస్తుతం మనం కొనుగోలు చేసే చాలా ఆహార పదార్థాలు విషపూరిత రసాయనాలతో నిండి ఉన్నాయి. పండ్లను, కూరగాయలను తాజాగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి రసాయనాలను ఉపయోగిస్తున్నారు.


రంగులు, రసాయనాలతో నిండిన కూరగాయలు


మనం మార్కెట్లో చూసే ఆకుకూరలు, కూరగాయలు పచ్చగా, తాజాగా కనిపించడానికి కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఇవి చూడడానికి తాజాగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇంట్లో పండించే ఆకుకూరలు పురుగులు పట్టి, అందంగా కనిపించవు కాబట్టి వాటిని కొనడానికి చాలామంది ఆసక్తి చూపరు. అందుకే చాలామంది వ్యాపారులు విషపూరిత రసాయనాలను వాడి తాజాదనాన్ని కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఇది ప్రజలకు తెలియని నిజం.


విషపూరితమైన పండ్లు


పండ్ల విషయానికి వస్తే కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. సేంద్రీయంగా పండించే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలావరకు పండ్లను రసాయనాలతో పిచికారీ చేసి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తున్నారు. ద్రాక్ష వంటి పండ్లపై నేరుగా పురుగుమందులు చల్లుతున్నారు. ఆ విషం నేరుగా మన కడుపులోకి వెళ్తుంది. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు ఒక ప్రధాన కారణం కావచ్చు అని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.


విషరహిత పండ్లు ఇవే


ఈ విషపూరిత ప్రపంచంలో కూడా కొన్ని పండ్లు విషరహితంగా ఉంటాయి. దేశంలో రెండు పండ్లు రసాయనాలతో పిచికారీ చేస్తే త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని రసాయనాలు లేకుండా పండిస్తారు. అవి అరటిపండ్లు, జామపండ్లు. అరటిపండ్లను ప్రపంచమంతా ఒకే పేరుతో పిలుస్తారు. జామపండును దవాడి ఆపిల్ అని కూడా పిలుస్తారు. యాపిల్ పండ్లను కూడా రసాయనాలతో పిచికారీ చేస్తారు కాబట్టి, వాటిని తొక్క తీసి తినమని కూడా కొందరు వైద్యులు సూచిస్తున్నారు. అందుకే అరటిపండ్లు, జామపండ్లు ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు.


ఆరోగ్యకరమైన ఆహారం కోసం మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు ఇంట్లో పండించుకోవడం లేదా నమ్మకమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.

Liquid Diet: మీరు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

 


ప్రస్తుత రోజుల్లో ఫిట్‌నెస్ పేరుతో సోషల్ మీడియాలో అనేక రకాల డైట్ ట్రెండ్‌లు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ''లిక్విడ్ డైట్". ఇటీవల తమిళనాడులోని కన్యాకుమారిలో 17 ఏళ్ల యువకుడు ఈ డైట్‌ను పాలో అయి మరణించాడు.

వైద్య సలహా లేకుండా ట్రెండింగ్ డైట్‌ను అనుసరించడం ఎంత ప్రమాదకరమూ అనేదానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. లిక్విడ్ డైట్ యొక్క ఉద్దేశ్యం జ్యూస్‌లు, స్మూతీలు, సూప్‌లు, షేక్‌లు లేదా మెడికల్ సప్లిమెంట్‌లు వంటివి మాత్రమే తీసుకోవడం. సాధారణంగా ఈ డైట్‌ను శస్త్రచికిత్సకు ముందు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులలో వైద్యుడి పర్యవేక్షణలో ఫాలో అవుతారు. కానీ సోషల్ మీడియాలో ఇది బరువు తగ్గడానికి బెస్ట్ పద్ధతిగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది దీనిని ఫాలో అవుతున్నారు.


లిక్విడ్ డైట్ ఎలా హాని చేస్తుంది..?


ఈ రకమైన డైట్ అందరు పాటించడానికి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా డైట్ తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. ముందుగా ఎవరికి వారు తమ శరీరం గురించి తెలుసుకోవాలి. శరీరానికి ఏది మంచిదో డాక్టర్ ద్వారా తెలుసుకుని దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని చెబుతున్నారు. లిక్విడ్ డైట్‌లో తగినంత మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉండవని డాక్టర్లు అంటున్నారు. దీని కారణంగా శరీరానికి పూర్తి పోషకాహారం లభించదు. ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది.


ఈ ఆరోగ్య సమస్యల వచ్చే ఛాన్స్..


లిక్విడ్ డైట్ రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు లభించనప్పుడు, రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత అవసరం. ద్రవ ఆహారం ఈ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు, నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు, ఈ సమస్యలు కూడా సంభవించవచ్చు


రక్తపోటు


ఎక్కువ కాలం ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ప్రమాదకరమైన స్థాయికి పడిపోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారవచ్చు.


హార్మోన్ల అసమతుల్యత


యువతలో ఈ ఆహారం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది శారీరక అభివృద్ధిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.


జీర్ణవ్యవస్థపై ప్రభావం


ఘన ఆహారం నుండి లభించే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని లోపం మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది.


మానసిక అలసట – చిరాకు


శరీరంలో గ్లూకోజ్, పోషకాహారం లేకపోవడం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితి మార్పులు, చిరాకుకు దారితీస్తుంది.


కాబ్ట వైద్యుడి సలహా మేరకు మాత్రమే లిక్విడ్ డైట్ ఫాలో అవ్వాలి. సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత అలాంటి ఆహారం తీసుకుంటారు. కడుపుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, వైద్యుడు ఈ ఆహారం తీసుకోవాలని సూచిస్తారు.