Weeak end one time:ఒకసారి మాత్రమే మద్యం తాగుతాము అని చెప్పే వారికి ఎలాంటి ప్రాణం ప్రమాదంలో ఉంటుంది.
danger use Fridge items: ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం, అవేంటో చూడండి
ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం, అవేంటో చూడండి
Heart attack ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?
Heart attack ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?
మధ్య కాలంలో తెలంగాణాలో హైకోర్టులో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలి సీనియర్ న్యాయవాది ప్రాణాలు కోల్పోయిన వైనం అక్కడ ఉన్న వారి అందరిలో భయం ఆందోళన రేపింది. ఒకపుడు గుండెపోటు అంటే చాలా వరకు మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయస్సు మీద పడిన వారికి, ఊబకాయం ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని మాత్రమే వినే వాళ్ళం.
ఇప్పుడు ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్య చాలా మందిలో ఎక్కువగా వస్తుంది. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం ఏమైనా సంకేతాలు పంపిస్తుందా? అనేది ఇప్పుడు చూద్దాం.
జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య లేకపోయిన కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు.
గుండెపోటు అంటే?
గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు
వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పించుకొనే అవకాశం చాలా మందిలో ఉంటుందని అంటున్నారు.
గుండెల్లో మంట లేదా అజీర్ణం
గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం
ఛాతీలో నొప్పి, గుండె లోపల మార్పులు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం
నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం
ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది.
► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి
లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి
అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి.
అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి.
ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు.
మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే
మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు.
మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
గుండెపోటు రావడానికి కారణం
వృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం
చిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడం
కాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడం
శక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడం
గుండెపోటు రాకుండా ఏం చేయాలి?
క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం
ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక, లేదా ఇతర వ్యాయామం చేయడం.
ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం
నోట్: కొన్ని అనుమానాస్పద లక్షణాలున్నవారందరూగుండెజబ్బు వచ్చేసినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Kidney Health: కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించండి..! 8 సైలెంట్ లక్షణాల గురించి ఇప్పుడే తెలుసుకోండి..!
Kidney Health: కిడ్నీ వ్యాధిని ముందే గుర్తించండి..! 8 సైలెంట్ లక్షణాల గురించి ఇప్పుడే తెలుసుకోండి..!
కిడ్నీలు రెండు మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. రక్తం నుంచి వ్యర్థాలు, విష పదార్థాలు, ఎక్కువ నీటిని ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.
రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతాయి. ఇన్ని ముఖ్యమైన పనులు చేసినప్పటికీ కిడ్నీ వ్యాధులు చాలా ఆలస్యంగా తెలుస్తాయి.
దాదాపు 90 శాతం కిడ్నీ పనితీరు కోల్పోయే వరకు లక్షణాలు కనిపించవు. చాలా మందికి నష్టం జరిగిన తర్వాతే తెలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు అనేక సంక్లిష్టమైన పనులు చేస్తాయి. కానీ వాటి వ్యాధులు నిశ్శబ్దంగా వ్యాప్తి అవుతాయని నిపుణులు అంటున్నారు.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే విష పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలను తేలికగా తీసుకోకూడదు.. అవి శరీరం సహజ వడపోత వ్యవస్థలాంటివి. ఆరోగ్యకరమైన కిడ్నీ మీ శరీరం హానికరమైన వ్యర్థాల నుండి విముక్తి పొందేలా చేస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీ వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి. జీవన విధానంలో మార్పులు, సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు. నియంత్రణ లేని డయాబెటిస్, అధిక రక్తపోటు.. ఇవి కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. అధిక రక్త చక్కెర స్థాయిలు కాలక్రమేణా కిడ్నీ కణజాలాన్ని దెబ్బతీస్తాయి. నియంత్రణ లేని రక్తపోటు రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ పనితీరును తగ్గిస్తుంది. వైద్యులు చెప్పినట్లుగా, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండవచ్చని అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ వ్యాధి తరచుగా గుర్తించదగిన లక్షణాలు లేకుండా వ్యాప్తి అవుతుంది. ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణులు చెప్పిన ఎనిమిది లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
8 సైలెంట్ లక్షణాలు
కిడ్నీలు ఎక్కువ నీటిని బయటకు పంపలేనప్పుడు అది శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల కాళ్ళలో వాపు, కళ్ళ చుట్టూ ఉబ్బడం కనిపిస్తుంది.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అధిక రక్తపోటు వస్తుంది. ఇది సాధారణ చికిత్సలకు లొంగదు.
కొంచెం నురుగు సాధారణమే.. కానీ ఎక్కువ నురుగు ప్రోటీన్ లీకేజ్‌ను సూచిస్తుంది. ఇది కిడ్నీ దెబ్బతినడానికి ఒక సంకేతం.
ముదురు, టీ-రంగు మూత్రం ప్రమాదకరమైనది. ఇది తీవ్రమైన కిడ్నీ నష్టం లేదా మూత్రంలో రక్తం లీకేజ్‌ను సూచిస్తుంది.
అప్పుడప్పుడు రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం సాధారణం.. కానీ ఇది తరచుగా ఉంటే అది ప్రారంభ కిడ్నీ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది.
కొన్ని రోజులు వాంతులు కిడ్నీ వైఫల్యం వల్ల రక్తంలో విష స్థాయిలు పెరగడం వల్ల సంభవించవచ్చు.
తీవ్రమైన, నిరంతర దురద చికిత్సకు లొంగదు. ఇది తరచుగా కిడ్నీ వైఫల్యంలో విషపదార్థాల పేరుకుపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది.
మూత్రంలో రక్తం.. ఇది ఎప్పటికీ సాధారణం కాదు. ఇది అంటువ్యాధులు, కిడ్నీ రాళ్ళు లేదా కిడ్నీ వ్యాధిని సూచించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
Diabetes tips food fruits helth benfits
మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...
మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
కాకరకాయ
షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. రోజూ ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
మెంతి
మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.
అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)
అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
దాల్చిన చెక్క
గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి మధుమేహంతో గుర్తిస్తారు. బాధపడేవారు నీటిని తాగితే మార్పును
పీచు పదార్థాలు
ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.
బీన్స్
బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో ప్రయోజనకారి. బాధపడేవారికి ఎక్కువ
బార్లీ
బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.
క్యారెట్స్
క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు విషయాన్ని గుర్తించాలి. ఉపకరించేదన్న
తోటకూర
రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం ස0යි.
పాలు
ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.
ఓట్ మీల్
ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
క్యాబేజీ
క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం నిపుణులు. మంచిదంటున్నారు పోషకాహార
కొద్ది కొద్దిగా ఆహారం
షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.
నట్స్
నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.
దానిమ్మ (పొమెగ్రనేట్స్)
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.
పుచ్చకాయ (వాటర్ మెలాన్)
ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.
కమలాలు
డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. చక్కెర స్థాయులు తక్కువే.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.
జామ
మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.
నేరేడుపండ్లు (జామూన్)
ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.
యాపిల్స్
యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.
ఉసిరి
ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.
వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం
సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది. ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.
ఈ వేళల్లో తప్పనిసరిగా....
ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్ తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.
వేకప్ స్నాక్
రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు. ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.
బ్రేక్ ఫాస్ట్
ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.
స్నాక్ (11 గంటల సమయంలో)
యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.
లంచ్
బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.
సాయంత్రం స్నాక్
టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.
డిన్నర్
మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.
Astma Ubbasam helth tips pramadam kaadu?
ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు
పరిచయము :
దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది.
కారణాలు:
*. చల్లగాలి(చల్లటి వాతావరణం) దుమ్ము, ధూళి
*. పొగ
*.అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం)
*.రసాయనాలు(ఘాటు వాసనలు)
*.శారీరక శ్రమ
*.వైరల్ ఇన్ఫెక్షన్
*.పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు
*.శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్
నిర్ధారణ:
*. వంశానుగత చరిత్ర, అలర్జీ, ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు
*. ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు
*. కఫం పరీక్ష
*. ఎక్స్‌రే
*. చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు
*. స్పైరోమెట్రీ(శ్వాసమీటర్ ద్వారా పరీక్ష)
ఆస్తమాతో జీవించడమెలా?
ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమలేకుండా చూసుకోవడం అవసరం. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణంకు దూరంగా ఉండాలి.
ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్‌బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్‌లలో డస్ట్మట్స్(చిన్న పరాన్నజీవులు) ఉంటాయి. కాబట్టి పది రోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవడం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉంటే డస్ట్మెట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి చేతిరుమాలు కట్టుకోవడం చేయాలి.
నివారణ:
బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్, నాసిల్ స్ప్రే మందులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. కానీ వీటివల్ల భవిష్యత్తులో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల దుష్ప్రభావాలు
కలుగుతాయి. పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడంతో పాటు మానసిక ఆందోళన, బరువు పెరగడం, జ్ఞాపకశక్తి లోపించడం వంటి సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఆస్తమాను మెడిటేషన్, యోగా ద్వారా చాలా వరకు నివారించవచ్చు.
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటే మంచిది.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
*. చల్లని గాలి లొ తిరగ కూడదు.
*. వర్షము లొ తడవకూడదు .
*. పడని పదార్దములు తీనకూడదు .
*. మనసుని ప్రశాంతము గా ఉండనివ్వాలి.
ట్రీట్ మెంట్:
1.వెంట్ మాత్రలు రోజుకి 3 చొప్పున్న 5 రొజులు వాడాలి.
2. బెట్నిసాల్ మాత్రలు రోజుకి 3 చొప్పున 5 రోజులు వాడాలి.
3. దగ్గుమందు : బ్రొ జెడెక్ష్ 2 చెంచాలు చొప్పున 3 సార్లు వాడాలి.
4. మంచి డాక్టర్ ని సంప్రదించి. ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
5.ఇన్హీలర్స్ వాడడం చాలా మంచిది ఎప్బెక్ తక్కువగా ఉంటాయి . సైడు
6. రోటాక్యాప్సు పీల్చడము ఒక మంచి పద్దతి .
Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చలు మాయం అవ్వాలంటే చింతపండుతో ఇలా చేయాల్సిందే!
Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చలు మాయం అవ్వాలంటే చింతపండుతో ఇలా చేయాల్సిందే!
మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో చింతపండు తప్పనిసరిగా ఉంటుంది. చింతపల్లిలో చాలా రకాల వంటల్లోకి వేయడంతో పాటు పెట్టి చింతపండుతో కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు.
చింతపండు చారు చింతపండు రసం, చింతపండు పులిహోర, చింతపండు చిత్రాన్నం ఇలా రకరకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చింతపండు కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, చింతపండు కేవలం ఆరోగ్యానికి కూరల్లో మాత్రమే కాకుండా అందరికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి చింతపండును ఉపయోగించి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టేబుల్ స్పూన్ చిక్కటి చింత పండు గుజ్జును తీసుకొని దానికి అరచెంచా పసుపు కలపి, ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలట. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ గ్లోని పెంచుతుందని చెబుతున్నారు.
చింతపండు గుజ్జుకు కొద్దిగా అరటి పండు గుజ్జు, శనగ పిండిని కలిపి పేస్ట్ లా చేసి, చర్మానికి పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చని వాటర్ తో కడిగేసుకోవాలట. ఈ మిశ్రమం బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేసి చర్మాన్ని క్లీన్ చేస్తుందని చెబుతున్నారు.
అలాగే చింతపండు గుజ్జును కొద్దిగా తీసుకొని టేబుల్ స్పూన్ నిమ్మరసం,చెంచా పంచదార,అర చెంచా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి మర్దన చేసి 15 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరంపై ఉన్న జిడ్డు తొలగిపోయి మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
మొటిమల సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వారు నిమ్మకాయంత సైజంత చింత పండు దాని పావుకప్పు వేడి నీటిలో కాసేపు బాగా నాననిచ్చి తర్వాత పిప్పిని వేరు చేయాలి. ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ చిక్కటి గుజ్జు తీసుకొని టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మేరకు మాస్కులా అప్లై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకుని ఫ్రిజ్‌లో కూడా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుతుంది.
రెండు టేబుల్స్పూన్ల చింతపండు రసాన్ని తీసుకొని, రెండు చెంచాల టీ డికాషన్ ను కలిపి ముఖం కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో మరోసారి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తాది.

