Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చలు మాయం అవ్వాలంటే చింతపండుతో ఇలా చేయాల్సిందే!

 Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చలు మాయం అవ్వాలంటే చింతపండుతో ఇలా చేయాల్సిందే!


మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో చింతపండు తప్పనిసరిగా ఉంటుంది. చింతపల్లిలో చాలా రకాల వంటల్లోకి వేయడంతో పాటు పెట్టి చింతపండుతో కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు.

చింతపండు చారు చింతపండు రసం, చింతపండు పులిహోర, చింతపండు చిత్రాన్నం ఇలా రకరకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చింతపండు కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, చింతపండు కేవలం ఆరోగ్యానికి కూరల్లో మాత్రమే కాకుండా అందరికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి చింతపండును ఉపయోగించి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


టేబుల్‌ స్పూన్ చిక్కటి చింత పండు గుజ్జును తీసుకొని దానికి అరచెంచా పసుపు కలపి, ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలట. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్​ గ్లోని పెంచుతుందని చెబుతున్నారు.


చింతపండు గుజ్జుకు కొద్దిగా అరటి పండు గుజ్జు, శనగ పిండిని కలిపి పేస్ట్‌ లా చేసి, చర్మానికి పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చని వాటర్​ తో కడిగేసుకోవాలట. ఈ మిశ్రమం బ్లీచింగ్ ఏజెంట్‌ లా పనిచేసి చర్మాన్ని క్లీన్​ చేస్తుందని చెబుతున్నారు.


అలాగే చింతపండు గుజ్జును కొద్దిగా తీసుకొని టేబుల్ స్పూన్ నిమ్మరసం,చెంచా పంచదార,అర చెంచా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి మర్దన చేసి 15 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరంపై ఉన్న జిడ్డు తొలగిపోయి మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.


మొటిమల సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వారు నిమ్మకాయంత సైజంత చింత పండు దాని పావుకప్పు వేడి నీటిలో కాసేపు బాగా నాననిచ్చి తర్వాత పిప్పిని వేరు చేయాలి. ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ చిక్కటి గుజ్జు తీసుకొని టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మేరకు మాస్కులా అప్లై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకుని ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుతుంది.


రెండు టేబుల్​స్పూన్ల చింతపండు రసాన్ని తీసుకొని, రెండు చెంచాల టీ డికాషన్‌ ను కలిపి ముఖం కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో మరోసారి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తాది.

No comments:

Post a Comment