1000 Health Tips: శరీరము లో చెడు కొలస్ట్రాల్ కరిగించాలి అంటే వీటిని తప్పక తీసుకోవాలిసిన ఆహారములు.

శరీరము లో చెడు కొలస్ట్రాల్ కరిగించాలి అంటే వీటిని తప్పక తీసుకోవాలిసిన ఆహారములు.

 శరీరము లో చెడు కొలస్ట్రాల్  కరిగించాలి అంటే వీటిని తప్పక తీసుకోవాలిసిన ఆహారములు. 

మన శరీరము లో చెడు కొలస్ట్రాల్ పేరుకుంటే దాని పరిణామాలు మనకు తెలియకుండా మన ఆరోగ్యము పైన పడుతుంది. బయట కొన్ని ప్రాణాంతక పరిస్తుతులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు. 

కొలస్టాల్ లో రెండు రకాలుగా ఉంటాయి. కొలస్ట్రాల్ లో ఒకటి మంచి కొలస్ట్రాల్,ఇంకొకటి చెడు కొలస్ట్రాల్, చెడు కొలస్ట్రాల్ లోని LDL అంటారు. ఏవి రక్తనాళాల్లో అడ్డుపడి రక్తాన్ని గుండె కి చేరకుండా చేస్తుంది. వీటివలన గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. అందువలన శరీరములో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ కరిగించే కొన్ని ఆహారములు తీసుకోవటం తప్పనిసరి చెప్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 

  1. బీన్స్ 
బీన్స్ లో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ ను కరిగించటము తో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది. మీ డైట్ లోను బీన్స్,చిక్కులు,టోఫు వంటివి ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్స్ తీసుకువొటం కూడా చాల మంచిది. వీటి వలన ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ప్రోటీన్ కారణముగా చేదు కొలస్ట్రాల్ తగ్గుతుంది. 

  2.  ఔట్స్ 

ఔట్స్ లో సొల్యూబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఔట్ మిల్ తీసుకోవటం ద్వారా చెడు కొలస్ట్రాల్ ను కరిగించవచ్చు. దీనిద్వారా గుండె ఆరోగ్యముగా ఉంటుంది. ఫైబర్ కొలస్ట్రాల్ లోని కరిగించి బయటకి పంపుతుంది. వీటి కోసం పీచు పదార్దాలు తీసుకోవటం గుండెకి మంచిది. ఔట్స్ ని చాల రకాలుగా తీసుకోవచ్చు. మషాలా ఔట్స్ పాలతో కలిపి తీసుకోవాలి. 

 3.  గింజలు. 

జీడిపప్పు,బాదంపప్పు, వాల్ నట్స్ ,పిస్తా ఇటువంటి గింజలలో ఫైబర్ ఎక్కువ గా ఉంటాయి. LDL కొలస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యముగా ఉంచుతాయి. శరీర బరువు అదుపులో ఉంటుంది. 

4. వంకాయ, బెండకాయ 

బెండకాయ,వంకాయ లో క్యాలరీలు తక్కువ గా ఉండే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటి లోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలస్ట్రాల్ ను  ప్రభావంతముగా పని చేస్తుంది. గుండెను ఆరోగ్యగముగా శరీరాన్ని ఉంచుతుంది. 

5. వెజిటబుల్ ఆయిల్ 

శరీరములో చెడు కొలస్ట్రాల్ కరగాలి అనుకుంటే. పొద్దు తిరుగుడు, కనోలా సఫోల ఆయిల్ వాడటం చాల మంచిది. ఇవి చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి గుండె ను ఆరోగ్యముగా చేస్తుంది. 

6. సొయా 

సొయా,పాలు,సొయా బీన్స్, టోపు వంటి సొయా ఉత్పత్తుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్,ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ ను కరిగించటము లో సహాయపడతాయి. 

7. పండ్లు 

ద్రాక్ష, ఆపిల్,స్ట్రాబెర్రీ,నిమ్మ,నారింజ,బత్తాయి ఇటువంటి పండ్లలో పెక్టిన్ అనేది ఉంటుంది. ఇది సాలుబుల్ ఫైబర్. ఇవి చేదు కొలస్ట్రాల్ కరిగించటము లో ప్రభావంతముగా పనిచేస్తుంది. 

8. కొవ్వు చేపలు

సాల్మన్, మాకరెల్, ట్యూనా లాంటి కొవ్వు చేపలు లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యవంతముగా ఉంచుతాయి. ఇంకా మెదడు చాల చురుకుగా మారుస్తాయి. సాల్మన్ చేపలు లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందువలన హెల్త్య్ ఫ్యాట్స్ చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి. వీటితో పాటు ట్రై గ్లుజరైడ్స్ స్ధాయి ని తగ్గిస్తాయి. 

9. బార్లీ 

బార్లీ లో ఫైబర్ నిండుగా ఉంటుంది. ఇది చేదు కొలస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యముగా ఉంచుతాయి. శరీర బరువు తగ్గటంలో సహాయపడుతుంది. 
గమనిక: ఇందులోని అంశాలు కేవలము అవగాహనా కోసము మాత్రమే. వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారము మేము ఇక్కడ తెలియచేయటం జరిగింది. ఆరోగ్య రీత్యా ఎటువంటి సమస్య ఉన్న  నేరుగా వైద్యనిపుణులు ను సంప్రదించటం చాల మంచిది.