ఫ్రిజ్ లో ఇవి పెడితే విషం తో సమానం అని మీకు తెలుసా! ఇప్పడు అవి ఏమిటో తెలుసుకుందాం.
ఎండ కాలం వస్తే మాత్రం బయట ఎండలు పని చూసుకొని ఇంటికి రాగానే తప్పనిసరిగా ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి నీళ్లు త్రాగితేకాని ప్రశాంతం గా ఉండదు. ఎండ కాలంలో చాల వరకు ఫ్రిజ్ తోనే అవసరం ఎక్కువగా ఉంటుంది.
ఇంకా మనం తినే ఆహార పదార్దాలు, కూరగాయలు ఇంకా మంచి నీళ్లు పాలు,పెరుగు లాంటివి పాడవకుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిజ్ లో పెడుతూ ఉంటాం. కొన్ని కూరగాయలు పిండి ఆహార పదార్డలు ఇంకా కొన్ని ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఆలా ఉంచడం వలన ఆరోగ్య సమస్యలు రావచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలు:
- ఎండ కాలం లో చల్లగా ఉండేందుకు చాల వరకు పుచ్చకాయలు తింటుంటాం. బయట నుండి వచేటపుడు పుచ్చకాయలు తెస్తూఉంటాం. వాటిని ఫ్రిజ్ లో పెడతాం పుచ్చకాయలు కోసి నప్పుడు వాటిని బాక్స్ లో కానీ గిన్నెలో కానీ పెట్టి ఫ్రిజ్ లో పెట్టవచ్చు. లేకపోతె పుచ్చకాయ కోయకుండా ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
ఉల్లిపాయలు
నిత్యం ఉల్లిపాయలు వంట లో కి ఉల్లిపాయలు ఎక్కువ గా కోయటం తరువాత వాటిని ఫ్రిజ్ లో పెట్టడం తరువాత వాటిని ఉపయోగించటం వలన తరిగిన ఉల్లిపాయలు వాసన వలన ఫ్రిజ్ లో మిగతా ఆహార పదార్దాలు పైన ప్రభావితము చూపుతుంది. సాధ్యమైనంత వరకు తరిగిన ఉల్లిపాయలు పెట్టకపోవటం చాల వరకు మంచిది.
బంగాళాదుంపలు
సాధారణంగా చల్లటి ప్రదేశం లో కానీ ఫ్రిజ్ లో ఉంచుకోవటం వలన బంగాళాదుంపలో చక్కెర శాతం ఎక్కువగా పెరుగుతుంది. ఆలా చేయటం వల్లన కూరలో రుచి మారుతుంది. బంగాళాదుంపలు సాధ్యమైన వరకు బయట ప్రదేశం లో ఉంచటం చాల వరకు మంచిది.
అరటిపండ్లు
కొంత మంది అరటిపండ్లు ఫ్రిజ్ లో పెడుతూవుంటారు. ఆలా ఫ్రిజ్ లో పెట్టడం వలన అరటిపండ్లు లో ఎంజైమ్ తగ్గిపోతాయి. ఇంకా అరటిపండ్లు సాద్యమైనంత వరకు అరటి పండ్లు చెడిపోతాయి సాధ్యమైనంత వరకు అరటి పండ్లు బయట ప్రదేశం లో ఉంచటం మంచిది.
తేనే
ఎంత కాలం అయినా చెడిపోకుండా ఉండేది పదార్థం తేనే వీటిని మాత్రం ఫ్రిజ్ లో అసలు పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెట్టడం వలన తేనే రుచి మారుతుంది. ఇంకా ఆరోగ్యానికి చాల హానికరం చేస్తుంది. తేనే ను చాల వరకు కాలి ప్రదేశం లో భద్రపర్చుకోవటం మంచిది.
ఊరగాయ పచ్చళ్లు
కాలానికి తగ్గట్టు తెలుగు వారు పచ్చళ్ళు పెడతూఉంటారు. పచ్చళ్ళు చెడిపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో పచ్చళ్ళు పెట్టడం వలన ఆ చల్లదనానికి ఊరగాయ పచ్చళ్ళు త్వరగా చెడిపోతాయి.
పూలు
అసలు పూలు ఫ్రిజ్ లో పెట్టడం వలన ఫ్రిజ్ లో పులా వాసన వలన ఇతర ఆహార పదార్దాల పైనా చాల ప్రభావిత చూపుతాయి. పులా వాసన వలన ఆహార పదార్దాలు తినలేము.
బ్రెడ్
చాల మంది బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి మిగిలిపోయిన వాటిని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటాం. ఫ్రిజ్ లో పెట్టడం వలన బ్రెడ్ గట్టిగా ఉంటుంది. దీని వలన తినలేక ఇబ్బంది పడుతుంటాం. అందువలన బాక్స్ లో కానీ ఒక కవర్ లో కానీ పెట్టుకోవటం మంచిది.