కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఈ సమయాల్లో ఏవో మందులు వేసుకుని సరిపుచ్చుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడొచ్చు.
*. పిప్పళ్లు బాగా దంచి చూర్ణం వేసి దానిలో అరస్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజు మూడు పూటలా వాడాలి.
*.జీలకర్రను నీటిలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని ప్రతి రోజూ మూడుపూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
*.మారేడు ఆకుల రసం రెండు స్పూన్ల తీసుకోవాలి. అందులో నాలుగు మిరియాలు చూర్ణం వేసి కలిపి తాగితే సమస్య తీరుతుంది.
*.పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దానిని బాగా మరగపెట్టాలి. దీనిని చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం.. సాయంత్రం తాగాలి.
*.ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ పాలను వడగట్టి తాగాలి.
*.పచ్చి కాకరకాయ రసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
No comments:
Post a Comment