Food poisoning Treatment HelthTips Articleshow

ఫుడ్ పాయిజనింగ్..చిట్కాలు...

రోడ్డు పక్కన ఉండే బండ్లు.. ఇతరత్రా ప్రాంతాల్లో విక్రయించే ఆహార పదార్థాలను అసలు భుజించవద్దని పెద్దలు చెబుతుంటారు. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని హెచ్చరిస్తుంటారు. కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ వల్ల పలు సమస్యలు వాంతులు..వికారంతో ఎదుర్కొంటుంటారు. చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.



వికారంగా అనిపించే సమయంలో మూడు పూటలా ఒక స్పూన్ మోతాదులో తేనే తీసుకోవాలి. రెండు అరటిపళ్లు పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును పాలలో కలిపి తీసుకుంటే బెటర్. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూను జీలకర్ర వేసి మరిగించాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కలిసి తీసుకోవాలి. నీరసంగా ఉన్న సమయంలో ఒక అరటిపండు తింటె బాగుంటుంది. ప్రతి నిత్యం పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ చిట్కాలు పాటిస్తే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. ఒకవేళ ఇంకా తగ్గలేనిపక్షంలో వైద్యుడిని సంప్రదించడం బెటర్.

No comments:

Post a Comment