1000 Health Tips: Health Sleep: నిద్రలో కాళ్లు, చేతులు పట్టేస్తే డేంజరా? ఏం చేయాలి?

Health Sleep: నిద్రలో కాళ్లు, చేతులు పట్టేస్తే డేంజరా? ఏం చేయాలి?

 Health : నిద్రలో కాళ్లు, చేతులు పట్టేస్తే డేంజరా? ఏం చేయాలి?


సందేశం : మన కంటి లో నలుసు.. కాలు ల్లో ఏదైనా ముల్లు చిన్న సమస్య గానే అనిపిస్తుంది.

నిజానికి అవి కలిగించే బాధ చాలా ఎక్కువ. నెప్పిని కలిగిస్తుంది.

ప్రతి నిత్య జీవితం లోనూ అంతే..

కొన్ని ప్రాబ్లమ్స్ పైకి చిన్నవి గానే అనిపిస్తాయ్..

కానీ అవి అనుభవించే వారికి అదే ఒక పెద్ద ప్రపంచ యుద్ధం!

ఉన్నటుండి నిద్రలో కాళ్లు, చేతులు పట్టేయడం కూడా అలాంటిదే అని చెపుతుంటారు పెద్దలు.

అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

* నిద్రలో సడెన్‌గా కాళ్లు పట్టేసినట్టు, చేతులు మొద్దు బారినట్టు ఏజ్‌బార్ అయినోళ్లు చెప్తుంటే పెద్దగా పట్టించుకోం. కానీ.. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే అంటున్నారు వైద్య నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా రక్త సరఫరాలో ఆటంకాలకు కారణం అవుతుంది. అట్లనే శారీరం జలదరింపు, కాళ్లు, చేతుల్లో సూదులతో పొడుస్తున్నట్లు మంటగా అనిపించడం అటు వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుంటాయి . ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్నిరోజులు కంటిన్యూ అయితే నిద్రలేమితో పాటు ఇతర అనారోగ్యాలు దాడి చేస్తాయి. అందుకే జాగ్రత్త అని అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.

*ఇక కాళ్లు చేతులు మొద్ద బారడమో, పట్టేడయడమో నిద్ర సమయాల్లోనే ఎందుకు జరుగుతుంది? అనేక కారణాలు ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కామన్‌గా ఎప్పుడూ ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు పడుకోవడం, శరీరంలో డయాబెటిస్ డెవలప్ అవుతుండటం, విటమిన్ల లోపం, నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఇలాంటి సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఒకే భంగిమలో ఎక్కువసేపు నిద్రించడం వల్ల శారీరం లో నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాళ్లు, చేతులు పట్టేయడానికి ఇదొక ప్రధాన కారణం.

* తరచుగా చేతులు తలకింద పెట్టుకొని పడుకోవడంవల్ల కూడా శరీరానికి బ్లడ్ సప్లయ్ కలగడంలో ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల కాళ్లు, చేతులు మొద్దు బారుతుంటాయి. కాళ్లను మడిచి పడుకున్నప్పుడు, ఏవైనా అధిక బరువులు ఎత్తినప్పుడు కూడా సిరల మీద ఒత్తిడి పెరిగి ఇలా జరుగుతుంది. అట్లనే తలకింద వేసుకునే మెత్త (దిండు), పడుకునే పరుపు సరిగ్గా లేకపోయినా మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటివి రావడంతోపాటు కాళ్లు, చేతుల్లో జలదరింపులు సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

దీనికి పరిష్కారమేంటి?

తలదిండు, పరుపు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. మరీ మెత్తగానో, గట్టిగానో ఉండకూడదు. అట్లనే రోజూ నిద్రించే భంగిమ ఒకే తరహా ఉండకూడదంటున్నారు వైద్య నిపుణులు. కొన్నిసార్లు తలకింద చేతులు పెట్టుకోవడం, కాళ్లు మడచి పడుకోవడం వల్ల తిమ్మిర్లు, కాళ్లు, చేతులు పట్టేయడాలు సంభవిస్తాయి. కాబట్టి అలా చేస్తున్నారేమో అని చెక్ చేసుకొని అలర్ట్ అవ్వాలి. ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం, ఒకే భంగిమలో పడుకోవడం చేయకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండటం వలన ఈ సమస్య దూరం అవుతుంది. అట్లగే డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలని, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోతే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పాటించాలి.


*నోట్ : పైవార్తలోని సమాచారం (సోషల్ ఇంటర్నెట్సే ఆధారంగా కరించబడింది.మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.