1000 Health Tips: రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిది

రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిది

 

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఎవరన్నా కాదన్నా ఇది నిజం. బయట మనం ఏం తిన్నా అన్నం తిన్నంత తృప్తి ఉండదు. మరి అన్నాన్ని ఎప్పుడు తింటే హెల్త్‌ పరంగా మంచిదో తెలుసుకోండి.

రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిదిఅన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు బరువు పెరగడమనే సమస్య కారణంగా అన్నం తినడాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
అన్నం బదులు ఇతర ఫైబర్ రిచ్ క్వినోవా వంటి చిరుధాన్యాలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, వాటిని ఎంత తిన్నా అన్నం తిన్నట్లుగా ఉండదు. అందుకోసం, అన్నం ఎలా తినాలి, రోజులో ఎప్పుడు తింటే మంచిదో తెలుసుకోండి.
కొన్ని అధ్యయనాల ప్రకారం అన్నాన్ని లంచ్‌లో తినడం చాలా మంచిది. కారణం అన్నంలో బి విటమిన్స్ ఉండడమే. బ్లాక్ రైస్ వంటివి బ్రెయిన్ ఫంక్షన్‌ని మెరుగ్గా చేస్తుంది. నిజానికీ ఈ బ్లాక్ రైస్‌తో చేసిన అన్నంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

వైట్ రైస్‌లో

రీసెర్చ్‌లో భాగంగా తేలిన విషయమేంటంటే.. చాలా మంది తెల్లని బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇందులో పోషకాలు, ఫైబర్‌లు బ్రౌన్‌రైస్, గ్రే రైస్‌లతో పోలిస్తే తక్కువ. మనం తెల్లని రైస్‌ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో షుగర్ పెరుగుతుంది. దీని బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, హోల్ గ్రెయిన్స్‌ తీసుకుంటే అందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాటిని తినడం మంచిది.

మనం ఏ రైస్ ఎంత మంచిదైనప్పటికీ మనం తినే రైస్ మోతాదులోనే తినాలని గుర్తుంచుకోండి. మనం ఎక్కువగా తెల్లని రైస్ తసీుకుంటాం. ఇందులో కాస్తా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. బ్రౌన్‌రైస్, ఇతర గ్రెయిన్స్‌తో పోలిస్తే. కాబట్టి, జాగ్రత్త అవసరం. పైగా విటమిన్స్, ఫైబర్, మినరల్స్ కావాలనుకుంటే కచ్చితంగా బ్రౌన్‌రైస్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తింటే చాలా మంచిది.

అన్నం త్వరగా జీర్ణమైనప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం తినడం అంత మంచిది కాదు. బియ్యంలో స్టార్చ్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని ఈజీగా పెంచుతాయి. ఎనర్జీని తగ్గిస్తాయి. బియ్యంలోని కొన్ని గుణాల కారణంగా సరిగా తీసుకోకపోతే మన బాడీలో ఫ్యాట్ పెరిగి బరువు పెరుగుతారు.