బటర్ మనం అంత ఎక్కువగా వీటితో వంటలు చేసుకోకపోయినా కొన్ని వంటలకి బటర్ లేకపోతే అసలు రుచే లేదని చెప్పొచ్చు. కానీ, దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, ఆల్టర్నేటివ్‌గా మనం ఏం తినొచ్చో తెలుసుకోండి.

మనం బటర్‌ని పోషకాలతో కూడిన ఇతర ఆల్టర్నేటివ్స్‌తో తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. మన డైట్‌లో హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేయడం మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ కొన్ని ఫుడ్స్ ప్లాంట్ బేస్డ్, ఎక్కువగా పోషకాలతో నిండి ఉంటుంది. అలాంటి ఫుడ్స్‌ని మనం బటర్ బదులు వాడుకోవచ్చు.

గ్రీక్ యోగర్ట్ ఫ్యాట్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం బేకింగ్‌లో వాడొచ్చు. దీని వల్ల మంచి క్రీమీ టేస్ట్ ఉంటుంది. కాస్తా పుల్లని రుచి కూడా వస్తుంది. ఫుల్ ఫ్యాట్, లోఫ్యాట్ ఫుడ్స్‌లో కూడా వాడొచ్చు. దీనిని మనం ఏ కాంబినేషన్‌తో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది.