Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Head Massage: హెడ్‌ మసాజ్‌ తరచు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ లాభాలు, తలకు మర్దన ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!​​Head Massage: ఒత్తైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు ఒత్తైన జుట్టు కావాలనే ఆశ ఉంటుంది. చాలామంది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. రకరకాల ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు, ఖరీదైన హెయిర్‌ ప్రాడెక్ట్స్‌ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉంటూనే సింపుల్‌ హెడ్‌ మసాజ్‌తో అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ కుదుళ్లను దృఢంగా ఉంచడమే కాదు, మాడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెడ్‌ మసాజ్‌ ప్రయోజనాలు, తలకు మర్దన ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..

హెడ్‌ మసాజ్‌ వ్లల హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ మెరుగ్గా సరఫరా అవుతుంది. మాడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగితే.. జట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
​Potato Pack: బంగాళాదుంప రసాన్ని ఇలా రాస్తే.. పిగ్మెంటేషన్‌ మాయం అవుతుంది..!

ఒత్తుగా పెరుగుతుంది..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెడ్‌ మసాజ్‌ విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు సమస్యలు ఉంటే వాటికి చెక్‌ పెట్టడానికి తల మర్దన సహాయపడుతుంది.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Authored Byరాజీవ్ శరణ్య | Samayam Telugu | Updated: 5 Feb 2024, 5:17 pm
Subscribe

Head Massage: హెడ్‌ మసాజ్‌ తరచు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ లాభాలు, తలకు మర్దన ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Samayam TeluguHead Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!
​​Head Massage: ఒత్తైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు ఒత్తైన జుట్టు కావాలనే ఆశ ఉంటుంది. చాలామంది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. రకరకాల ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు, ఖరీదైన హెయిర్‌ ప్రాడెక్ట్స్‌ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉంటూనే సింపుల్‌ హెడ్‌ మసాజ్‌తో అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ కుదుళ్లను దృఢంగా ఉంచడమే కాదు, మాడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెడ్‌ మసాజ్‌ ప్రయోజనాలు, తలకు మర్దన ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..

హెడ్‌ మసాజ్‌ వ్లల హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ మెరుగ్గా సరఫరా అవుతుంది. మాడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగితే.. జట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
Potato Pack: బంగాళాదుంప రసాన్ని ఇలా రాస్తే.. పిగ్మెంటేషన్‌ మాయం అవుతుంది..!

ఒత్తుగా పెరుగుతుంది..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.
ఈ ఫుడ్స్ అతిగా తింటే.. జుట్టు కుచ్చులు, కుచ్చులుగా రాలుతుంది..!

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెడ్‌ మసాజ్‌ విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు సమస్యలు ఉంటే వాటికి చెక్‌ పెట్టడానికి తల మర్దన సహాయపడుతుంది.

హెయిర్ ఫోలికల్స్ యాక్టివేట్‌ అవుతాయి..

సున్నితంగా తలకు మర్దన చేస్తే.. హెయిర్‌ ఫోలికల్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. జుట్టు త్వరగా, ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తరచూ మర్దన చేసుకోవడం ద్వారా తలలో చుండ్రు చేరకుండా జాగ్రత్తపడచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.

ఇలా మసాజ్‌ చేయండి..

  • మీరు తలకు మర్దన చేసుకునే ముందు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన చోటును సెలెక్ట్‌ చేసుకోండి. ఆ ప్రదేశంలో లైట్లను డిమ్‌ చేయండి, రిలాక్సింగ్‌ మ్యూజిక్‌ ప్లే చేసుకోండి. ఇది మీకు రిలాక్సింగ్‌ మూడ్‌ సెట్‌ చేస్తుంది.
  • కొబ్బరి నూనె, ఆలివ్, జోజోబా నూనెలు మసాజ్‌కు బెస్ట్‌ ఆప్షన్స్‌. ఈ నూనెలు హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి.
  • మసాజ్‌ ఆయిల్‌ డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో గోరువెచ్చగా వేడి చేయండి.
  • మసాజ్‌ చేయడానికి ముందు మీ జుట్టును సెక్షన్స్‌గా విభజించండి. చేతి వేళ్లతో కొంచెం మొత్తంలో నూనె తీసుకుని. మీ మెడ ప్రాంతం నుంచి నూనెను మీ తలకు సమాంతరంగా అప్లై చేయండి.
  • చేతివేళ్లను ఉపయోగించి, సున్నితంగా.. వృత్తాకార కదలికలతో మీ తలపై మసాజ్‌ చేయండి. హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. 10-15 నిముషాల పాటు మసాజ్ కొనసాగించండి. మీ చేతి వేళ్లతో ప్రెజర్‌ పాయింట్స్‌ వద్ద ఒత్తిడి ఉంచండి. ఇవి మిమ్మల్ని రిలాక్స్‌ చేస్తాయి.
  • ఆ తర్వాత.. గంట వరకు ఆరనిచ్చి, మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

No comments:

Post a Comment