1000 Health Tips: skin damaged treatment

skin damaged treatment

 

గాయాలు తగ్గకపోవడం

మీకు ఏదైనా సర్జరీ, గాయాలు, పుండ్ల లాంటివి అయినప్పుడు ఆ తాలుకూ గాయాలు త్వరగా తగ్గవు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అధ్యయనాల ప్రకారం, సర్జరీ అయిన వారు ఎవరైతే విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్నారో, ఆ ట్యాబ్లెట్స్ తీసుకోని వారి కంటే త్వరగా గాయాలు తగ్గినట్లు తేలింది. విటమిన్ సి హెల్దీ కొల్లాజెన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ హెల్దీ ప్రోటీన్ స్కిన్‌‌ని స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. సరిపడా విటమిన్ సి మన బాడీలో లేకపోతే మనం వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తాం. మీకు యవ్వనమైన మెరిసే చర్మం కావాలంటే కచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్, పండ్లు తీసుకోవాలి. అందులో కివీస్, ఆరెంజెస్ వంటివి ఉంటాయి.