1000 Health Tips

Pumpkin Seeds life style helth tips Articleshow

ప్రతి రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?


గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు వీటిలో అధికంగా ఉంటాయి.

ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి

గుమ్మడి గింజలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కణాలు. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల ఈ వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

కండరాలకు మేలు

గుమ్మడి గింజలు కండరాల రిపేర్ కు కూడా సహాయపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత వీటిని తినడం వల్ల కండరాలు త్వరగా కోలుకుంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

సరైన నిద్ర

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ అనేది సెరోటోనిన్ అనే హార్మోన్ గా మారుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గుమ్మడి గింజలు తింటే మంచి నిద్ర వస్తుంది.

గుండె ఆరోగ్యం

గుమ్మడి గింజలు గుండెకు కూడా చాలా మంచివి. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణక్రియకు సహాయం

గుమ్మడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా తినాలి..?

గుమ్మడి గింజలను పచ్చిగా తినవచ్చు. లేదా ఎండబెట్టి పొడి చేసి సలాడ్లో కలుపుకొని కూడా తినవచ్చు. కొంతమంది వీటిని వేయించి కూడా తింటారు.

ఎంత తినాలి..?

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ వాటిని మితంగానే తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

ఎవరు తినకూడదు..?

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైటీషియన్ ని సంప్రదించిన తర్వాతే గుమ్మడి గింజలు తినాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా గుమ్మడి గింజలు తీసుకోకూడదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Paralysis Treatment: helthy tips. Article show

పక్షవాతానికి చెక్!


పక్షవాతం వస్తే ఎంత నరకమో తెలిసిందే! మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలతో పక్షవాతం రాకుండా చూసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ శరీరానికి సరిపడా మెగ్నీషియం తీసుకుంటే పక్షవాతం దరిచేరదట. අධි ఆషామాషీగా చెప్పింది కాదు. పరిశోధనల్లో వెల్లడయిన విషయం ఇది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటం ద్వారా పక్షవాతం ముప్పు తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియం 100 మి.గ్రా మోతాదు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, బీన్స్, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.

Diabetes helthy tips articleshow

మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...

మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాకరకాయ

షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు.
 రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతి

మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే

దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)

అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్క

గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి es నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు గుర్తిస్తారు. మార్పును

పీచు పదార్థాలు
ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.

బీన్స్

బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.

బార్లీ

బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్లఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

క్యారెట్స్

క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు విషయాన్ని గుర్తించాలి. ఉపకరించేదన్న

తోటకూర

రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.
పాలు

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.

ఓట్ మీల్

ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయంతీసుకుంటుంది.

క్యాబేజీ

క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం నిపుణులు. మంచిదంటున్నారు పోషకాహార

కొద్ది కొద్దిగా ఆహారం

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.

నట్స్

నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

పుచ్చకాయ (వాటర్ మెలాన్)

ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలు

డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. _చక్కెర స్థాయులు తక్కువే.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.

జామ

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

నేరేడుపండ్లు (జామూన్)

ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం.కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

యాపిల్స్

యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.

ఉసిరి

ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం

సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది.
ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.

ఈ వేళల్లో తప్పనిసరిగా....

ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

వేకప్ స్నాక్

రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు.ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.

స్నాక్ (11 గంటల సమయంలో)

యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా
పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.

లంచ్

బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్

టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.

డిన్నర్

మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.



Asthma helth tips article show

ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు

పరిచయము :

దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది.


కారణాలు:

*. చల్లగాలి(చల్లటి వాతావరణం) దుమ్ము, ధూళి

*. పొగ

*.అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం)

*.రసాయనాలు(ఘాటు వాసనలు)

*.శారీరక శ్రమ

*.వైరల్ ఇన్ఫెక్షన్

*.పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు

*.శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్

నిర్ధారణ:

*. వంశానుగత చరిత్ర, అలర్జీ, ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు

*. ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు

*. కఫం పరీక్ష

*. ఎక్స్రే

*. చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు
ఆస్తమాతో జీవించడమెలా?

ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమలేకుండా చూసుకోవడం అవసరం. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణంకు దూరంగా ఉండాలి.

ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్బ్యాగ్స్, కార్పెట్స్, బెడీషీట్స్, బ్లాంకెట్స్లలో డస్ట్మెట్స్(చిన్న పరాన్నజీవులు) ఉంటాయి. కాబట్టి పది రోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవడం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉంటే డస్ట్మెట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి చేతిరుమాలు కట్టుకోవడం చేయాలి.


నివారణ:

బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్, నాసిల్ స్ప్రే మందులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. కానీ వీటివల్ల భవిష్యత్తులో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల దుష్ప్రభావాలు

*. స్పైరోమెట్రీ(శ్వాసమీటర్ ద్వారా పరీక్ష)
అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఆస్తమాను మెడిటేషన్, యోగా ద్వారా చాలా వరకు నివారించవచ్చు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటే మంచిది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

*. చల్లని గాలి లొ తిరగ కూడదు.

*. వర్షము లొ తడవకూడదు .

*. పడని పదార్దములు తీనకూడదు .

*. మనసుని ప్రశాంతము గా ఉండనివ్వాలి.


ట్రీట్ మెంట్:

1.వెంట్ మాత్రలు రోజుకి 3 చొప్పున్న 5 రొజులు వాడాలి.

2. బెట్నిసాల్ మాత్రలు రోజుకి 3 చొప్పున 5 రోజులు వాడాలి.

3. దగ్గుమందు : బ్రొ జెడెక్ష్ 2 చెంచాలు చొప్పున 3 సార్లు వాడాలి.

4. మంచి డాక్టర్ ని సంప్రదించి. ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

5.ఇన్హెలర్స్ వాడడం చాలా మంచిది ఎప్ఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి . సైడు

6. రోటాక్యాప్సు పీల్చడము ఒక మంచి పద్దతి .

Alopecia areata:పేనుకొరుకుడు helthy tips articleshow

పేనుకొరుకుడు వ్యాధిని ఆంగ్లంలో అలోపేసియా అరేటా (Alopecia areata) అంటారు. ఇది ఒక ఆటోఇమ్మ్యూన్ డిసార్డర్. 
అలోపేసియా అరేటా వ్యాధిని నివారించడానికి: 
తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
కఠినమైన రసాయనాలు లేని షాంపూలు, కండిషనర్లను ఉపయోగించాలి.
అధిక వేడి స్టైలింగ్, బిగుతుగా ఉండే హెయిర్ స్టైలింగ్‌ను నివారించాలి.
తల చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించుకోవాలి.
అలోపేసియా అరేటా వ్యాధికి చివరికి మందులు లేవు, కానీ జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడే కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 


పేనుకొరుకుడు

పేనుకొరుకుడు అంటే, తలమీద వున్నట్టుండి వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తూవుంటుంది. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. అలర్జీ తగ్గగానే వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలమాదిరిగా అవుతుందేమోనని అపోహ పడవలసిన అవసరంలేదు. దీనినే పేనుకొరుకుడు అంటారు.

తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండటాన్ని 'పేనుకొరుకుట' అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకడం వలనరాదు. అలా 'నానుడి'గా సాధారణజనానికి అర్ధమయ్యే పరిభాషలో అంటారు. దీన్ని వైద్యశాస్త్రంలో 'అలోపీ షియా ఏరియేటా(Alopecia areata)' అని అంటారు. దీన్ని సుమారు 2000 సంవత్స రాల క్రిందటే గుర్తించారు. చర్మవ్యాధుల ఆసుపత్రులకు హాజరయ్యే రోగులలో ఇది 2శాతం మందికి ఉంటుంది.


కారణం:

ఇది ఒక 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'. అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ' ఆంటీబాడీలు' తయారై వెంట్రుకలను అలా అక్కడక్కడా లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్, డయాబెటిస్, బి.పి. మొదలగు సమస్యలున్న వాళ్ళలో అధికంగా కన్పిస్తుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకు 20శాతం మందికి గోళ్ళ మీద గీతలు, గుంటలు కలిగి వుండటం గమనార్హం.

ఎక్కడెక్కడ వస్తుంది :

వెంట్రుకలు మొలచు ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. తలలో ఎక్కువగా కన్పిస్తుంది. గడ్డంమీద, మీసాల దగ్గర వస్తుంది. కనుబొమ్మల మీద కూడా రావచ్చు. కాళ్ళు, చేతులు, ఛాతీమీద కూడా వెంట్రుకలు లేని గుండ్రని ప్రదేశాలు కన్పిస్తాయి. కానీ, ముఖ్యంగా తలమీద, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు- మీద వస్తే చాలా ఆందోళనకు గురై - వెంటనే డాక్టర్ను సంప్రదిస్తారు. ఇది సౌందర్యలోపానికి చిహ్నం కూడా. ఇది మరే ఇతర ఇబ్బంది కలిగించదు కూడా! కొందరిలో తలమీద ఒకచోట మొదలై - మొత్తం తలంతా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తల గుండు జేయించినట్లు ఉంటుంది. దీన్ని' అలోపీషియా' టోటాలిస్ (Alopecia Totalis)' అని అంటారు. అలాగే, జబ్బు శరీరం అంతా ప్రాకి-
తలమీద, కనుబొమ్మలు, గడ్డం, మీసాలు, చేతులు, కాళ్ళు, ఛాతి మీద- మరెక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది. దీన్ని అంటారు. 1 అలోపీషియా (Alopecia Universalis)' ໙໖

ఎవరిలో వస్తుంది :

ఇది ఆడా,మగా తేడా లేకుండా ఎవరిలోనైనా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. కానీ, 20-40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉంటే, మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది. కానీ, ఇది అంటువ్యాధి కాదు. 60 సం. దాటిన తర్వాత సాధారణంగా రాదు.

చికిత్స:

*. దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.

*.స్టిరాయిడ్ పూతమందులు.,

*. అక్కడే కొంచెం మంట పుట్టించే పూతమందులు.,

*. ఇమ్యునోమాడ్యులేటర్ పూతమందులు

*.అక్కడే స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చే విధానం.,

*. లేజర్ చికిత్స.
జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి వేరే చోట్లకు ప్రాకుతుంటే స్టిరాయిడ్ మందు బిళ్ళలు లేదా సైక్లోస్పోరిన్ ఇమ్యునోసప్రసివ్ (Immuno మందు బిళ్ళలు వాడుతారు. మొదలగు suppresive)

ఏ చికిత్సా విధానమైనా చాలా ఓర్పుతో దీర్ఘ కాలంగా వాడాలి. చికిత్స పూర్తికాలం డాక్టరు పర్యవేక్షణలో సాగాలి. తన ఇష్టానుసారం మందులువాడటంవల్ల ස) తగ్గకపోగా సైడ్ఫైక్ట్స్్స్కు గురౌతారు. మందులతో పూర్తి ఫలితం పొందకపోతే, కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణీత ప్రదేశాలలో టాటూయింగ్ పద్ధతి ద్వారా లోపాన్ని కప్పివేయవచ్చు.

చికిత్స ఫలితాలు :

ప్రతి డాక్టరు రోగికి పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతోనే మంచి ట్రీట్మెంట్ రోగిని అనుసరించి ప్రారంభిస్తారు. అయినప్పటికి అందరి రోగులకు ఫలితాలు ఒకేరకంగా ఉండవు. కొందరికేమో అతి కొద్దికాలంలోనే అనూహ్య మార్పు వచ్చి ఆనందాన్నిస్తుంది. మరికొందరికి దీర్ఘకాలం తర్వాత మార్పు వస్తుంది. మరికొద్దిశాతం మందిలో ఎన్నిరోజులు వాడినా ఫలితం కన్పించదు. వంశపారంపర్యంగా ఉన్నా....కనుబొమ్మలు,
కనురెప్పలు, తల, గడ్డం, మీసాలు అన్నిచోట్ల వెంట్రుకలు రాలిపోవడం, చిన్నరోగం మాదిరిగానే మొదలై ప్రాకుతుంటే -మొదలగు సందర్భాలలో ఆశించినంత ఫలితాలు అందవు. కానీ, ఏది ఏమైనా 'పాజిటివ్ మైండ్'తో ఉండి ఫలితాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి!!

ఆయుర్వేద చికిత్స :

బెట్నిసాల్ వంటి స్టిరాయిడ్స్తో తయారయిన చుక్కల మందుని పేనుకొరుకుడు పైన రాయమని వైద్యులు సూచిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటికి ఫలితం రాకపోతే గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. మందారంపూలనుకూడా దీనినివారణకు మందుగా వాడుతారు, కాని గురివిందతోనే చాలా త్వరగా నయమౌతుందని వైద్యులు తెలిపారు.

ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.

Weight loss Tips Helth Tips Article show

బరువు తగ్గడానికి, మీరు తక్కువ కేలరీలు తినడం, మరింత చురుకుగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు చేసుకోవడం ప్రయత్నించవచ్చు .   
తినడం   
ఎక్కువ పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి.
బ్రౌన్ రైస్, బార్లీ, మరియు హోల్-వీట్ బ్రెడ్ మరియు పాస్తా వంటి తృణధాన్యాలను ఎంచుకోండి.
తెల్ల బియ్యం మరియు తెల్ల రొట్టె వంటి శుద్ధి చేసిన ధాన్యాలను తక్కువగా తినండి.
డెజర్ట్‌లు, జెల్లీలు మరియు సోడాలు వంటి చక్కెర కలిపిన ఆహారాలు మరియు పానీయాలను పరిమితం చేయండి.
ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడోస్, నట్స్, నట్ బటర్స్, మరియు నట్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను వాడండి.
తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులను ఎంచుకోండి.
ఆహార లేబుళ్ళను చదవండి.
చురుకుగా ఉండటం   
వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ చేయండి.
మీరు ఆనందించే కార్యకలాపాలను కనుగొని వాటిని రోజంతా విస్తరించండి.
విసుగు చెందకుండా ఉండటానికి మీ కార్యాచరణను మార్చుకోండి.
నడవడానికి సౌకర్యవంతమైన బూట్లు ధరించండి.
జీవనశైలి తగినంత నిద్ర పొందండి, ఒత్తిడిని నిర్వహించండి, మీ బరువు తగ్గించే ప్రణాళికను మీరు విశ్వసించే వారితో పంచుకోండి మరియు వారానికి 1 నుండి 2 పౌండ్ల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి.   
ఇతర చిట్కాలు
మీ భోజనాన్ని అధిక ఫైబర్ స్టార్చ్ కార్బోహైడ్రేట్లపై ఆధారపడి ఉంచండి.   
రుచిని త్యాగం చేయకుండా భోజనంలోని క్యాలరీలను తగ్గించుకోవడానికి రుచికరమైన పదార్థాలను ఎంచుకోండి.   
చక్కెర శీతల పానీయాలు, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ మరియు ఫ్లేవర్డ్ మిల్క్ వంటి పానీయాల నుండి ద్రవ కేలరీలను పరిమితం చేయండి.

బరువు తగ్గటానికి సూచనలు

పక్క వీధిలోని పాలబూత్కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్మెంట్లకై వెదుకులాట.

పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. 5... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.


వెయిట్ తగ్గించే అద్భుతాలు స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు.'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.

స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్లో ఓ గంటసేపు మసాజ్...
నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్ఫుడ్ సెంటర్క వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్బల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.



అసలైన మంత్రం

అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితేబరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్టాఫ్లోర్కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.

సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి.'హాస్పిటల్లో ఏ ఫ్లోర్కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే'అంటారు హైదరాబాద్ లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.

sweat heavy: helthy tips. Articleshow

చెమట అధికంగా వస్తుందంటే..

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..


ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.

రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.

టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.


ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.. నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.