1000 Health Tips

Chhaava Movie Review: అండ్ రేటింగ్.. సింహంలా గర్జించిన వికీ కౌశల్.. రష్మిక పెర్ఫార్మెన్స్ ఎలా

 


నటీనటులు: వికీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ కుమార్, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటి, వినీత్ కుమార్ సింగ్ తదితరులు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్

నిర్మాతలు: దినేశ్ విజన్

సినిమాటోగ్రఫి: సౌరభ్ గోస్వామి

ఎడిటింగ్: మనీష్ ప్రధాన్

మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్

బ్యానర్: మడోక్ ఫిల్మ్స్


Realise Date : 2025-02-14


దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకొంటాడు. అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను సంభాజీ తిప్పి విజయవంతంగా తిప్పికొడుతాడు. సంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి సంభాజీ మహారాజ్‌పై యుద్ధం ప్రకటిస్తారు. ఔరంగజేబ్‌ (అక్షయ్ ఖన్నా)కు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు.

దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకొన్న కథ, దానికి తగినట్టుగా రాసుకొన్న స్క్రీన్ ప్లేతోనే సినిమా విజయాన్ని రుచి చూసిందని చెప్పవచ్చు. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంతో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. తొలి సీన్ నుంచే యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో సినిమాను మరింత భావోద్వేగంగా మలిచాడు. తొలి భాగంలో ఎమోషన్స్, పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ పూర్తిగా డామినేట్ చేశాయనే చెప్పాలి.

ఛావా సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే... పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్బుతంగా తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చి దిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాలపాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సంభాజీ మహారాజ్, అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెల్లగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వికీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో పౌరుషంగా, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ సినిమా కోసం తన లుక్‌ను అద్బుతంగా డిజైన్ చేసుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక సినిమా చివరి 45 నిమిషాలపాటు స్క్రీన్ పైనుంచి కను రెప్పలు వాల్చకుండా చూసేలా తన నటనను ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు. యుద్ద సన్నివేశాల్లో మొఘల్ సేనలపై పులి దూకడం ఆయన టాలెంట్ ఏమిటో మరోసారి రుచి చూపించాడు.


Brahma Anandam upadate review:బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు

 నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం - రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు.

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.


కథ విషయానికొస్తే.. బ్రహ్మానందం(రాజా గౌతమ్) యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 9 ఏళ్లుగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాతయ్య ఆనంద్ రామ్మూర్తి(బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాశి(దివిజ ప్రభాకర్) బ్రహ్మానందంను, ఆనంద్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు.

డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తార(ప్రియా వడ్లమాని) వదిలేస్తుంది. బాబాయ్ అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద్ రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికి వెళ్తాడు. మరి ఆనంద్ రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తార మళ్ళీ తిరిగొచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత – మనవడు ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం - రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు.

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. బ్రహ్మానందం(రాజా గౌతమ్) యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 9 ఏళ్లుగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాతయ్య ఆనంద్ రామ్మూర్తి(బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాశి(దివిజ ప్రభాకర్) బ్రహ్మానందంను, ఆనంద్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు.

డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తార(ప్రియా వడ్లమాని) వదిలేస్తుంది. బాబాయ్ అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద్ రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికి వెళ్తాడు. మరి ఆనంద్ రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తార మళ్ళీ తిరిగొచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత – మనవడు ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Manchu Manoj : మంచు మనోజ్ సంచలనం.. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదని కామెంట్

సినిమా విశ్లేషణ.. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం – రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మనందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద్ రామ్మూర్తి ఓల్డ్ ఏజ్ హోమ్, అన్నయ్య – తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద్ రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. అక్కడికి ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్ కి తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఆసక్తి నెలకొంటుంది. ఆ ట్విస్ట్ తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేసాడు అని సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీతోనే నడిపించి అక్కడక్కడా చిన్న ఎమోషన్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే ముసలి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు అనే ఎమోషన్ చూపించినా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ లా చూపించి సడెన్ గా ఓ చిన్న సీన్ కి మారిపోయినట్టు చూపించడం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అయితే క్లైమాక్స్ మాత్రం ఏదో సింపుల్ గా అయిపోయింది అనేలా ఉంటుంది. అప్పటిదాకా మంచి ఎమోషన్ నడిపించి చివర్లో ఏదో ముగించేశారు. సమాజంలో అందరూ అర్ధం చేసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ ని చెప్పినా చివర్లో దాన్ని సరిగ్గా ముగించలేకపోయారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనే లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా తన కసి అంతా తీర్చుకున్నట్టు, నటనలో ఎంతో పరిణీతి చెందినట్టు అనిపిస్తుంది. రాజా గౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు అని చెప్పొచ్చు.

ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్ గా నవ్వించారు. సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాలి పాత్రలో మెప్పించింది. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని, బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ.. అందరూ వారి పాత్రల్లో బాగా మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకొని కథ, కథనం బాగానే రాసుకున్నా క్లైమాక్స్ మాత్రం ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్ కి తగ్గ న్యాయం చేసాడనే చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు. బ్రహ్మ ఆనందం సినిమా ఒక తాత – మనవడు ఎమోషన్, తాత కోసం మనవడు, మనవడి కోసం తాత ఏం చేసాడు అనే స్టోరీ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Movie:Salaar Songs Lyrics

 

  •  Movie:  Salaar

1.     Sooreede

2 .    Vinaraa

The Family Star 2024 Songs Lyrics

 

  •  Movie:  The Family Star

1.     Nandanandanaa



Movie: Jai Shree Ram Anthem Song: Jai Shree Ram Anthem

 

  •  Movie:  Jai Shree Ram Anthem
  •  Song:  Jai Shree Ram Anthem


జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం
 నరనరమున శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం
  శివధనుసే ఎత్తి
 విలుతాడు కడుతుంటే
 నీ కండ సత్తువకి
 ఫెళఫెళ విరిగిందే
  కోదండం ఎత్తి నారిని మోగిస్తే
 ఆ హిందు సాగరమే
 భయపడి వణికిందే
  సరదాగా నువ్వే బాణాన్ని వేస్తే
 ఒక దెబ్బకే ఏడు చెట్లే కూలాయే
 ధర్మంగా నువ్వే అస్త్రం సంధిస్తే
 దశకంఠుడే కూలి ఇతిహాసమయ్యే
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం శ్రీరాం
  నిను గన్న పుణ్యం ఈ భారతం
 నీ దారిలోనే తరం తరం
 యుగాలు కదిలి పోతున్నగాని
 శ్రీరామే ఘోషే నిరంతరం
  నీ నామమేలే మా ఆయుధం
 నీ పేరు చెబితే ఓ పూనకం
 ఏ కాలమైనా ఏ నాటికైనా
 దేశాన్ని ఏలును నీ సంతకం
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం
  కనతండ్రి మాట పాటిస్తూ రామా
 రాజ్యాధికారాన్నే వదిలెళ్లినావే
  నువ్విచ్చి మాట సుగ్రీవునికానాడు
 ఒక బాణంతో రాజ్యం గెలిచిచ్చినావే
  మాటంటే మాట ధర్మం నీ బాట
 మా జాతికే నువ్వు చిరునామావంటా
 సర్వం ఓ మిథ్య సత్యం అయోధ్య
 నీ ఆలయం మాకు శ్రీరామరక్ష
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం శ్రీరాం
  జై జై జై శ్రీరాం
 అణువణువూ శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 అడుగడుగూ శ్రీరాం
  జై జై జై శ్రీరాం శ్రీరాం
 నరనరమున శ్రీరాం శ్రీరాం
 జై జై జై శ్రీరాం
 కణకణమూ శ్రీరాం శ్రీరాం

Movie: YeMayaUndo 2024 Song: YeMayaUndo

 

  •  Movie:  Ye Maya Undo
        Song:  Ye Maya Undo


కంటి రెప్పే వెయ్యకుండా
 కొంటె చూపే గుచ్చావే
 కళ్ళనిండా రంగు రంగు
 కలలు రేపావే
  చప్పుడైనా చెయ్యకుండా
 గుండెలోకి వచ్చావే
 గుండెల్లోనా చప్పుడంతా
 నువ్వై పోయావే
  నీలో నీలో
 నేనేమా నిదురించడం
 నాలో నాలో
 నువ్వేననుకోవడం
  ఎంతలా బాగున్నదో
 మనలోనా ఈ సంబరం
 ప్రేమలో పడనోళ్ళకి తెలియదులే
  ఏ మాయ ఉందో ఏ మైకముందో
 ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
 ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  నువ్వంటే ఎంతో ఇష్టం ఇష్టం
 ఎంతంటే తెలుపుట కష్టం
 నువ్వు లేని ఒక్కో నిమిషం
 అయిపోదా ఒక్కో నరకం
  గుండెలో నీ ప్రేమని
 కళ్ళలో చూసానులే
 అందుకే నీ చేతిలో
 ఒదిగి పొయాలే
  నువ్విలా ఓ నావలా
 దారినే చూపావులే
 ఎప్పుడూ నీ నీడలో
 సాగిపోతాలే
  లోకంలో ఎవ్వరి పేరు పేరు
 గురుతైనా రానే రాదూ
 నీ పేరే నీ పేరే
 మరువాలన్నా మరువాలన్నా
 ఆ విషయం గురుతే రాదూ
  ఇంతలో ప్రేమించితే
 మనసులో చోటుంచితే
 జన్మలో నీ చేయిని విడిచిపోనంటా
  నువ్విలా ఏడడుగులే
 కలిసి వేస్తావే ఇటే
 ప్రాణమే నీ తోడుగా
 పంపుతానంటా
  ఏ మాయ ఉందో ఏ మైకముందో
 ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
  పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
 ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
 యాలె యాలె యాలె యాలె లల్లయాలే
 యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే

Bottle Gourd :1 గ్లాస్ తాగితే చాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ ,అధిక బరువు, కొలెస్ట్రాల్ అనేవి జీవితంలో ఉండవు


 Bottle Gourd health benefits:1 గ్లాస్ తాగితే చాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ ,అధిక బరువు, కొలెస్ట్రాల్ అనేవి జీవితంలో ఉండవు.. సొరకాయను సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

సొరకాయలో విటమిన్ బి, ఫైబర్, నీరు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో జీవక్రియ రేటును పెంచటంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరు వుండేలా చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.


అంతేకాకుండా ఆకలిని నియంత్రించడంలో చాలా బాగా సహాయ పడటం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన బరువు తగ్గటమే కాకుండా అలసట., నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

సొరకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. నిమ్మరసం, తేనె వంటి వాటిని కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనెను వాడకూడదు. ప్రతిరోజు ఉదయం సమయంలో ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే అధిక బరువు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి పోతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి.


యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒక 15 రోజులు ఈ జ్యూస్ తాగితే తేడా మీరే గమనించి చాలా ఆశ్చర్యపోతారు. సొరకాయ 365 రోజులు మనకి సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగి ఆరోగ్యంగా ఉండండి.


గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.