కల్కన్ తయారుచేయు విధానం:
కావలసినవి: మైదా-5 కప్పులు, పంచదార-ఒకటిన్నర కప్పు, కొబ్బరిచిప్పలు-2, ఏలకుల పొడి- ఒక స్పూను, నెయ్యి- 8 స్పూన్సు.
తయారుచేయు విధానం:
1. కొబ్బరిచిప్పలు కోరి, పాలు తీసుకోవాలి.
2. మైదా, పాలు కలిపి పూరీ ముద్దలా కలుపుకోవాలి.
3. పిండి చిన్న చిన్న ఉండలుగా చేసి, అరచేతిలో బిళ్ళలుగా వత్తాలి.
4. మూకుడులో నెయ్యిపోసి, బిళ్ళలు బంగారు రంగు వచ్చేంతవరకు వేయించి తీయాలి.
5. పంచదార, నీళ్ళు పోసి(మందటి) గట్టిపాకం వచ్చేంతవరకు వుంచి, వేయించిన బిళ్ళలు పాకంలో వేసి, బాగా కలిపి, పైన ఏలకులపొడి చల్లి చల్లార్చాలి.