షాటా తయారుచేయు విధానం:
కావలసినవి:మైదాపిండి-1 కప్పు, పంచదార-3 కప్పులు, నెయ్యి-3 కప్పులు, పుల్లటి పెరుగు- 1/2 కప్పు.
తయారుచేయు విధానం:
1. మైదాపిండిలో పేరిన నెయ్యి, గట్టి పుల్లటి పెరుగు వేసి పూరీల పిండి మాదిరి కలపాలి. నీరు ఉపయోగించ కూడదు. ముందు పెరుగు వేసి, తరువాత ఎంత నెయ్యి పడితే అంతా వేసి కలపాలి పిండి గంటసేపు నాననివ్వాలి.
2. నానిన తరువాత పిండిని బాగా మర్దనా చేయాలి. పిండిని ఉండలుగా చేసి వుంచుకోవాలి.
3. ఉండలను చపాతీ మాదిరి ఒత్తాలి. పొరకీ పొరకి మధ్య నెయ్యి రాస్తూ ఐదుసార్లు మడిచి వత్తాలి చివరిగా మందంగా వత్తి హర్లిక్సుమూతతో దానిమీద తిప్పితే గుండ్రంగా, బిళ్ళలుగా వస్తాయి.
4. మూకుడులో నెయ్యి పోసి మరిగిన తరువాత బిళ్ళలు సన్నని సెగమీద వేయించాలి. గోధుమరంగు వచ్చేంతవరకూ వేయించాలి.
5. పంచదారలో నీళ్లుపోసి ముదురుపాకం పట్టుకోవాలి.
6. పాకాన్ని పళ్ళెంలో ఉన్న బిళ్ళల మీద పోస్తే అవి గట్టిబడి తెల్లగా అవుతాయి.
7. పాకం చాలా శుభ్రంగా వుండాలి. స్పూను పాలు పాకంలో వేస్తే తుక్కు అంతా పోయి శుభ్రంగా, తెల్లగా వుంటుంది,