Sandeep simple method of preparation
సందీప్లు
కావలసినవి: మైదాపిండి-1 కప్పు, పంచదార-3 కప్పులు, నెయ్యి-3 కప్పులు, పెరుగు-(పుల్లనిది, గట్టిగా వుండాలి) అరకప్పు.
తయారుచేయు విధానం:
1. చక్కగా జల్లించి వుంచుకొన్న మైదాలో పుల్ల పెరుగు వేసి పూరీల పిండివలే కలపాలి. కొద్దిగా నెయ్యి వేసి బాగా ముద్దగా కలపాలి. నీరు వేయరాదు. ఎంత నెయ్యి పడితే అంత నెయ్యి వేసి కలపాలి. ఈ పిండిముద్ద ఒక గంటసేపు నానబెట్టాలి.
2. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కొక్క ఉండనూ చపాతీలవలే చేయాలి.
3. చపాతీకి నెయ్యి రాసి మడిచి వత్తాలి. మరల నెయ్యి రాసి మరల వత్తాలి. ఇలా నాలుగు అయిదుసార్లు మడిచి, వత్తాలి.
4. ఆఖరుసారి చపాతీ మందంగా ఒత్తి, గుండ్రని మూతతో బిళ్ళలుగా వత్తాలి. ఇలా అన్నీ బిళ్ళలు చేయాలి.
5. మూకుడులో నెయ్యి వేసి, బాగా కాగిన తరువాత ఒక్కొక్క బిళ్ళ వేసి గోల్డ్కలర్ వచ్చేంత వరకు వేయించి తీయాలి.
6. మందమయిన గిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళు పోసి ముదురు పాకం రానిచ్చి దించాలి.
7. వేయించిన బిళ్ళలు పళ్ళెములో వరుసగా పేర్చి, ఒక్కొక్క బిళ్ళ మీద పాకం స్పూనుతో వేయాలి. అన్ని బిళ్ళల మీద సమంగా వేయాలి.
8. అన్ని బిళ్ళలు చక్కగా ఆరిపోయిన తరువాత, పాకం పొరలలోకి వెళ్ళి చాలా రుచిగా తయారు అవుతాయి.