పనస తొనలు తయారుచేయు విధానం:
కావలసినవి: మైదాపిండి-అరకప్పు, గోధుమపిండి-అరకప్పు, పంచదార-ఒక కప్పు, నూనె-2 కప్పులు.
తయారుచేయు విధానం:
నీరు
1. మైదాపిండి, గోధుమపిండి నీరు పోసి, మరీ పల్చగా లేకుండా, మరీ గట్టిగా కాకుండా బాగా మెత్తగా పూరీ ముద్దలా కలపాలి.
2. ముద్దతో చిన్న చిన్న వుండలుగా చేయాలి. ఒక్కొక్కటి పూరీలాగా వత్తి, మధ్యలో బ్లేడుతో మూడుచోట్ల గాటు పెట్టి, పైపైన గుండ్రంగా చుట్టి అంచులు కలిపి నొక్కాలి.
3. మూకుడులో నూనె పోసి కాచి, అందులో ఎర్రగా వేయించి తీయాలి. అన్నీ ఈ విధంగా వేయించుకోవాలి.
4. పంచదార నీళ్ళలో కలిపి తీగపాకం పట్టి, వేయించిన వాటిని పాకములో వేయాలి.
5. ఇవి రుచిగా వుండి, 5,6 రోజులు నిల్వా వుంటాయి.
