Movie: Devara Part - 1 Song: Fear Song Lyrics

 

  •  Movie:  Devara Part - 1

Song:  Fear Song


అగ్గంటుకుంది సంద్రం
 ఏహా
 భగ్గున మండె ఆకసం
 అరాచకాలు భగ్నం
 ఏహా
 చల్లారె చెడు సాహసం
  జగడపు దారిలో
 ముందడుగైన సేనానీ
 జడుపును నేర్పగా
 అదుపున ఆపే సైన్యాన్ని
  దూకే ధైర్యమా జాగ్రత్త
 రాకే తెగబడి రాకే
 దేవర ముంగిట నువ్వెంత
 దాక్కోవే
  కాలం తడబడెనే
 పొంగే కెరటము లాగెనే
 ప్రాణం పరుగులయీ
 కలుగుల్లో దూరెనే
  దూకే ధైర్యమా జాగ్రత్త
 దేవర ముంగిట నువ్వెంత దేవర
  దేవరా ఓ
  జగతికి చేటు చేయనేల
 దేవర వేటుకందనేల
 పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
  కనులకు కానరాని లీల
 కడలికి కాపయ్యింది వేళ
 విధికే ఎదురై వెళితే విలవిలా
  అలలయే ఎరుపు నీళ్ళే
 ఆ కాళ్ళను కడిగెరా
 ప్రళయమై అతడి రాకే
 దడ దడ దడ దండోరా
  దేవర మౌనమే
 సవరణ లేని హెచ్చరిక
 రగిలిన కోపమే
 మృత్యువుకైన ముచ్చెమట
  దూకే ధైర్యమా జాగ్రత్త
 రాకే తెగబడి రాకే
 దేవర ముంగిట నువ్వెంత
 దాక్కోవే
  కాలం తడబడెనే
 పొంగే కెరటము లాగెనే
 ప్రాణం పరుగులయీ
 కలుగుల్లో దూరెనే
  దూకే ధైర్యమా జాగ్రత్త
 దేవర ముంగిట నువ్వెంత దేవర
  దేవరా ఓ

No comments:

Post a Comment