మోహన్ లడ్డు తయారుచేయు విధానం:
కావలసినవి: మైదాపిండి-పావుకేజీ, నెయ్యి-పావుకేజీ, పంచదార-ఒక కేజీ, జీడిపప్పు, కిస్మిస్-కొంచెం.
తయారుచేయు విధానం:
1. మైదాపిండిలో కొంచెం ఉప్పువేసి, కొంచెం పేరిన నెయ్యి వేసి పూరీ పిండివలే తడపాలి. పిండిని రెండు భాగాలుగా చేసికొని, మందంగా వత్తి డైమండ్స్ ఆకారంలో కోసుకొని వుంచుకోవాలి.
2. మూకుడులో నెయ్యి పోసి మరిగించిన తరువాత డైమండ్స్ వేయించాలి.
3. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి పెట్టుకోవాలి. ఏలకులు పొడుం చేసుకోవాలి.
4. వండిన పూరీ ముక్కలు మెత్తగా దంచుకోవాలి.
5. పంచదార పొడిచేసి ఇందులో జీడిపప్పు, కిస్మిస్, ఏలకుపొడి, పూరీపొడి వేసి, పాలు తడి చేసుకొంటూ లడ్డూలు కట్టాలి.