మర్జీపాన్ తయారుచేయు విధానం:
కావలసినవి: జీడిపప్పు-2 కప్పులు, పంచదార-2 కప్పులు, మిఠాయిరంగు-2 స్పూను, వెనీలా ఎస్సెన్సు-1/2 స్పూను.
తయారుచేయు విధానం:
1. జీడిపప్పు కొంచెం నీరుపోసి మెత్తగా, పేస్టులా చేయాలి.
2. జీడిపప్పు పేస్టులో పంచదార వేసి కరిగించి, పొడిగా అయ్యేంతవరకూ వేయించాలి.
3. ఎస్సెన్సు, రంగు వేసి దించేయాలి.
4. నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి, కావలసిన ఆకారంలో ముక్కలు కోసుకోవచ్చును.