Maida ladoo simple method of preparationsimple method of preparation
మైదా లడ్డు
కావలసినవి: మైదాపిండి-అరకేజీ, నెయ్యి-అరకేజీ, పంచదార-పావుకేజీ, ఏలకులు-4, జీడిపప్పు-10, కిస్మిస్-10, పాలు-అరకప్పు.
తయారుచేయు విధానం:
1. మైదాపిండి, ఉప్పు, నీళ్ళు పోసి పూరీ పిండివలే కలుపుకోవాలి ఇది 2,3 గంటలు నానబెట్టాలి.
2. నానిన తరువాత ముద్దను బాగా మర్దన చేయాలి.
3. ఉండలను పెద్దగా చేసి, రొట్టెలు చేయాలి.
4. రొట్టెలను డైమండ్ ఆకారములో ముక్కలుగా చేయాలి.
5. మూకుడులో నెయ్యి వేసి, ఈ డైమండ్స్ అన్నీ వేయించి, తీసి రోట్లోవేసి మెత్తగా పిండివలే దంచాలి.
6. జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించి తీసి దంచిన పిండిని కలపాలి.
7. పంచదార మెత్తగా(పిండి) పొడి కొట్టాలి. ఏలకులు కూడా పొడి చేయాలి.
షాను
8. దంచిన డైమండ్స్ పొడి, పంచదార పొడి, ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ చక్కగా కలిపి పాలు తడిచేసుకొంటూ లడ్డూలు చేసుకోవాలి.
9. చేసిన లడ్డూ ఒక అరగంట ఆరిన తరువాత డబ్బాలలో వుంచి నిల్వ చేసుకోవచ్చు.