కులిఛ తయారుచేయు విధానం:
కావలసినవి: మైదా-అరకేజీ, నెయ్యి-పావుకేజీ, పంచదారపొడి-పావుకేజీ, యాలకులు-6, పాలు-ఒక కప్పు.
తయారుచేయు విధానం:
1. మైదాలో సగం నెయ్యి, పంచదార పోసి కలపాలి.
2. ఒక కప్పు పాలు వేడిచేసి అందులో మిగిలిన నెయ్యి కలపాలి. ఏలకులపొడి చేసి పాలల్లో వేసి బాగా కలియబెట్టాలి.
3. మైదాలో ఈ పాలు పోస్తూ నెమ్మదిగా ముద్దగా కలిపి, పైన తడి గుడ్డ వేసి అరగంట సేపు వుంచాలి.
4. అరగంట తర్వాత పిండిని చిన్న చిన్న వుండలుగా చేసి, పూరీలాగా వత్తి మధ్యలో సూదితో రంధ్రం చేయాలి.
5. మూకుడులో నెయ్యి కాగిన తర్వాత పూరీలను వేయించి నెయ్యి పూర్తిగా ఓడ్చి తీయాలి.
6. ఇవి బాగా చల్లారిన తర్వాత మూత గట్టిగా వున్న డబ్బాలో పెడితే యివి వారందాకా నిల్వ వుంటాయి.