కచ్చూర్ తయారుచేయు విధానం:
కావలసినవి: మైదాపిండి-అరకేజీ, గసగసాలు-100 గ్రా, డాల్డా-250 గ్రా, బెల్లం-అరకేజీ, వంటసోడా - చిటికెడు.
తయారుచేయు విధానం:
1. బెల్లం మెత్తగా పొడిచేయాలి.
2. బెల్లంపొడి, వంటసోడా, ఒకస్పూను డాల్డా, కొద్దిగా నీరు మైదా పిండిలో పోసి, కలిపి ముద్దగా చేయాలి.
3. గసగసాలు పొడి మూకుడులో ఎర్రగా వేయించి మైదాపిండి ముద్దలో, కలపాలి.
4. ఈ పిండిని పెద్ద పెద్ద వుండలుగా వత్తి, ఒక్కొక్కటి దళసరిగా, పూరీలాగా ఒత్తి, డాల్డాలో వేయించి తీయాలి.
5. ఇవి వారం రోజులు నిల్వ వుంటాయి.